ఉగాది జితదినోత్సవం

మార్చి 19. సర్కారీ ఉగాది రోజు …
రవీంద్రభారతిలో సర్వజిత్‌ నామసంవత్సర ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. పంచాంగ పఠనం చేయడానికి మల్లాది వారు ససేమిరా అనడంతో వేరే పెద్దాయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పారు.
పంచాంగ పఠనం జరుగుతుండగా వైఎస్‌ పక్కనే ఉన్న రోశయ్యని యథాలాపంగా అడిగినట్టు అడిగాడు.
“ఇంట్లో ఉగాది పచ్చడి తినొచ్చారా, రోశయ్య గారూ!”
రోశయ్యకు ఆ ప్రశ్న వెంటనే మింగుడు పడలేదు. “మీ ఇంట్లో ఉగాది ఎప్పుడు చేస్తున్నారు?” అని డైరెక్టుగా అడక్కుండా డొంకతిరుగుడుగా వైఎస్‌ ఈ ప్రశ్న అడిగాడని [...]

పీడా వదిలిపోయింది!!

నాకు క్రికెట్ బొత్తిగా ఇష్టం లేదు….నేను చూడను కూడా………కాకుంటే మా రూమ్ మేట్స్ రోజూ అర్థ రాత్రి దాటేంత వరకు టీ.వీ పెట్టి నన్ను నిద్రపోనీకుండా…ఇతర తెలుగు ఛానెల్స్ చూడనీకుండా చేసేవారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూసి వికటాట్టహాసం చేయాలనుంది………………. హ్హ హ్హహ హ్హ్హహ హ్హహ్హహ్హ్హహ హ్హ్హ
పొద్దున్నే అందరూ “రేపు ప్రపంచం అంతం కాబోతోందట” అని వార్త విన్న వాళ్ళ మాదిరి ముఖాలు వేలాడదీసుకొని ఉంటే భలే నవ్వొచ్చింది :)
ఏ ఇద్దరు కలిసినా చాలు …”మామా దారుణం [...]

అంతా పంచాంగంలోనే ఉంది!!

ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది పంచాంగం. ఉగాది పచ్చడీ, పిండి వంటలూ, సెలవూ, కొత్త బట్టలు కూడా గుర్తొస్తాయనుకోండి. కొందరికి అత్తవారి ఇల్లూ గుర్తు రావచ్చు, కొందరికి అల్లుడు గుర్తు రావచ్చు. కవులకు కలకోకిల కూజితాలూ, (కలకోకిల కూత కూయదని మనవి. మగ కోకిల కూస్తుంది) లేచిగురు మామిడి జొంపాలూ, మేఘమాలలూ, వసంత కాంతలూ గుర్తొస్తాయి. కట్టుకున్న పెళ్లాం, మాడు పగిలే ఎండా, కరెంటు కోతలు గుర్తుకు తెచ్చుకుంటే ఏం బావుంటుంది! పండగ నాడు కూడా పాత [...]

సర్వ మత్తు సమ్మేళనం!

ఉగాది సోమవారమా మంగళవారమా… గ్రహణం రోజున పండగేమిటి? మిగుల్లో చేయాలా తగుల్లో చేయాలా లాంటి చర్చలతో సంబంధం లేకుండా అక్కడ ఉగాది, ఉషస్సు బుసబుస పొంగుతున్నాయి. గ్లాసుల గలగలా రావాలు. గొంతుల గటగటా రావాలు. క్యాబరే కోయిలల కూతలు. వగరు, తీపి, చేదు రుచుల ద్రవాలు. ఆపై ఉగాది ప్రత్యేకమైన కవిసమ్మేళనాలు. తెలుగుతల్లి చూడాలేగానీ…లక్షన్నర ‘మందు’ కొట్లున్న రాష్ట్రంలో ఒక్కరోజేం ఖర్మ, నిత్యం అదోరకం ఉగాది! హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో కవిసమ్మేళనానికి మించి, రాష్ట్రమంతా మదిరాసుర [...]