వృద్దాప్యం?

వృద్దాప్యం కూడా అచ్చు బాల్యం లాంటిదే….కాకుంటే దశలన్నీ వ్యతిరేకంగా ఉంటాయి.

చిన్న బిడ్డ, తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తే..
వృద్దుడు పుడమి తల్లి గర్భానికి చేరుకొంటాడు

చిన్న బిడ్డకి మాటలు రావు
వృద్దునితో ఎవ్వరూ మాట్లాడరు

చిన్న బిడ్డకి రోగాలు తేలిగా వస్తాయి
వృద్దునికి ఓ పట్టన రోగాలు వదలవు

చిన్న బిడ్డను లాలిస్తుంన్నప్పుడు ఉచ్చ పోస్తే ఛీ ఛీ..కుట్టీ అంటారు
వృద్దుడు మంచంపై ఉచ్చ పోస్తే..ఇదేమి ఖర్మమో అనుకొంటారు

చిన్న బిడ్డతో మాట్లాడటానికి, ఆటాడుకోవటానికి అందరూ పోటీ పడతారు
వృద్దుడు ఎప్పుడూ ఒంటరే…మాట్లాడితే చాదస్తం అంటారు

చిన్న బిడ్డను గుండెలపై తన్నించుకొంటూ ఆనందపతారు
వృద్దుని గుండెలవిసేలా చేసి బాధపెడతారు

చిన్న బిడ్డ దేవుని ప్రతిరూపం
వృద్దుడు వ్యర్థానికి ప్రతిరూపం?

4 స్పందనలు

  1. నిజమే.చదవడానికి చాలా సాధారణ విషయాలలానే కనిపిస్తున్నా చదివాకా ఒక్కసారి అత్మావలోకనం చెసుకుంటే బాధగా అనిపించింది.నేను తాతయ్య దగ్గర ఇలాగే ప్రవర్తించేదానిని ఒక్కొసారి. చాలా ఆలోచింపచేసింది నన్ను.

  2. ఇంకా పోలికలు చాలానే వున్నాయి.

    పిల్లలకు పాల దంతాలు వచ్చినట్లే ముసలి వాళ్ళకు కూడా పాల దంతాలు వస్తాయట. ఒకవేళ రాకపోయినా పళ్ళులేని ఇద్దరిదీ బోసినవ్వే!

    పిల్లవాడు నడవడం రాక పడుతూ లేస్తూ నడిస్తే వృద్దులుకూడా నడవలేక పడుతూ లేస్తూ నడుస్తారు.

    మొత్తం మీద మీరన్నట్లు పసి వారికీ ముసలివారికి పోలికలెన్నో వున్నా వీరి విషయం లో అంతా వ్యతిరేక దిశలో నడుస్తుంది. ప్చ్!

    –ప్రసాద్
    http://blog.charasala.com

  3. ఈ మధ్య ఇదే విషయం నేనూ అలోచిస్తున్న అండీ. ఇంకా మనకి కొత్త వాళ్ళైన పిల్లల్ని చూసినంత ప్రేమ ఎంతో కాలం అనుబంధం ఉన్న ముసలి వాళ్ళని చూస్తామా అనిపించింది కూడా.

  4. ఖచ్చితంగా మనం ముసలివాళ్ళను చిన్నపిల్లల్ను చూసిట్లు చూడము..వారిని అర్థం చేసుకోము. చిన్నపిల్లల్లో లేనిది వృద్దుల్లో ఉన్నది సంస్కారం. దాన్ని బట్టే జనాలు ఫలితాలు అనుభవిస్తున్నరేమో

ప్రత్యుత్తరమిమ్ము