ఆత్మస్త్థెర్యం మనిషైతే!!

ఈనాడు ఆదివారంలో వచ్చిన వ్యాసం ఇది. ఖచ్చితంగా ఇతని జీవితం చదివిన ప్రతి ఒక్కరికీ స్పూర్తిని ఇస్తుంది. ఈ మహలింగాన్ని అభినందించడానికి మాటలు చాలవు…చదవండి మీకే తెలుస్తుంది ఎందుకిలా అంటున్నానో
కష్టాలకే కష్టం వేసే కథ అతడిది!
కన్నీళ్లకే కన్నీరొచ్చే వ్యధ..!
నోరుండీ మాట్లాడలేడు… అన్నం నమిలి మింగలేడు… ముక్కుతో గాలి పీల్చుకోలేడు… ఒకటి కాదు రెండు కాదు… ఆరేళ్ల నరకం అది. అయితేనేం! కష్టాలను అలవోకగా ఎదుర్కొనే ఆయుధం ఒకటి అతని దగ్గరుంది. అది… ఆత్మస్త్థెర్యం.
అతనికా ధైర్యాన్నిచ్చింది…
చదువుకోవాలన్న కోరిక, ఓడిపోకూడదన్న [...]