మార్చి 19. సర్కారీ ఉగాది రోజు …
రవీంద్రభారతిలో సర్వజిత్ నామసంవత్సర ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. పంచాంగ పఠనం చేయడానికి మల్లాది వారు ససేమిరా అనడంతో వేరే పెద్దాయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పారు.
పంచాంగ పఠనం జరుగుతుండగా వైఎస్ పక్కనే ఉన్న రోశయ్యని యథాలాపంగా అడిగినట్టు అడిగాడు.
“ఇంట్లో ఉగాది పచ్చడి తినొచ్చారా, రోశయ్య గారూ!”
రోశయ్యకు ఆ ప్రశ్న వెంటనే మింగుడు పడలేదు. “మీ ఇంట్లో ఉగాది ఎప్పుడు చేస్తున్నారు?” అని డైరెక్టుగా అడక్కుండా డొంకతిరుగుడుగా వైఎస్ ఈ ప్రశ్న అడిగాడని [...]
: నందు ఉంచబడ్డది; సరదాకి | 4 వ్యాఖ్యానాలు »