ఆస్ట్రేలియా క్రికెట్ జట్టునేం చెయ్యాలి?

అప్రతిహతంగా సాగిపోతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు జైత్రయాత్ర చూస్తూంటే నాకొక చిన్న ఆలోచన వచ్చింది.

యుద్దానికి ముందు ప్రత్యర్థి బలంలో సగం వాలికి వచ్చేస్తుందట. అలాంటి అతీంద్రియా శక్తులేమన్నా సంపాదించారేమో విచారణ జరిపించాలి
ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చెయ్యాలని రూల్ పెట్టాలి
ఆస్ట్రేలియా ఆడేటప్పుడు 25 ఓవర్లు మాత్రమే ఆడాలి. ప్రత్యర్థులుకు 50 ఓవర్లు సరిపోతాయి.
ఆస్ట్రేలియా బౌలర్లు నిర్థాక్షిణ్యంగా వ్యవహరించ కూడదు. 100 పరుగుల లోపు 2 వికెట్లు మాత్రమే తీయాలి

ఇదంతా కుదరకపోతే ఇక నుంచి [...]

జంట పదాలు

* కిల కిల
* కట కట
* గల గల
* జల జల
* వల వల
* సల సల
* మల మల
* టప టప
* పట పట
* టక టక
* మట మట
* ఇంకా ఏమునాయి?

లలితగారి వ్యాఖ్యకు నా ప్రతి వ్యాఖ్య

ముందు ఈ టాపా చదవండి.
ప్రతివ్యాఖ్య:
మన వేదాలలో చెప్పిన వాటికీ ఎందుకు సామ్యాలు చూపించెయ్యడం?
లలితగారు, వేదాల్లో (ఆ మాటకొస్తే పురాతన పుస్తాకాలు కూడా) ఉన్న మాటల్ని అంత తేలిగ్గా కొట్టి పారెయ్యకండి. ఇది “మనం అప్పట్లోనే ఇంతకన్నా గొప్పగా ఉండే వాళ్ళమన్నమాట” అని రుజువు చేసుకొనే ప్రయత్నం కాదు. ఆ వ్రాతల్నిబట్టి అప్పటి నాగరికత పరిపక్వత గురించి తెలుసుకొనే ప్రయత్నం. ఉదాహరణకు ఒక శ్లోకంలో “భూగోళం” అని వ్రాసుందనుకొందాము. అంటే…ఆ శ్లోకం వ్రాసిన సమయంలోనే వారికి భూమి గోళాకారంలో [...]

కరివేపాకాంధ్రప్రదేశ్‌

”ఎవడువాడు? ఎచటివాడు?
ఇటువచ్చిన తెలుగువాడు
తరిమి తరిమి కొట్టరా
తగిన శాస్తి చేయరా” అంటూ ‘శాస్త్రీ’యమైన పద్ధతిలో తెలుగు భూభాగంలోకి కూడా చొచ్చుకువచ్చి మరీ మరాఠీ లాఠీ విన్యాసం సాగిస్తుంటే తెలుగువాడు తెల్లమొగం వేస్తున్నాడు. మనస్సూ, శరీరమూ గాయపడి తనకు మైనస్‌ మార్కులు ఎందుకుపడుతున్నాయో తెలియక తికమకపడుతున్నాడు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే. అయినా తనకు అడుగడుగునా అవమానమేమిటని తల్ల’ఢిల్లి’పోతున్నాడు. ఏ ఏడాది చూసినా కాంగ్రెస్‌ పంచాంగంలో తెలుగు రాశికి రాజపూజ్యం 0, అవమానం [...]