అప్రతిహతంగా సాగిపోతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు జైత్రయాత్ర చూస్తూంటే నాకొక చిన్న ఆలోచన వచ్చింది.
- యుద్దానికి ముందు ప్రత్యర్థి బలంలో సగం వాలికి వచ్చేస్తుందట. అలాంటి అతీంద్రియా శక్తులేమన్నా సంపాదించారేమో విచారణ జరిపించాలి
- ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చెయ్యాలని రూల్ పెట్టాలి
- ఆస్ట్రేలియా ఆడేటప్పుడు 25 ఓవర్లు మాత్రమే ఆడాలి. ప్రత్యర్థులుకు 50 ఓవర్లు సరిపోతాయి.
- ఆస్ట్రేలియా బౌలర్లు నిర్థాక్షిణ్యంగా వ్యవహరించ కూడదు. 100 పరుగుల లోపు 2 వికెట్లు మాత్రమే తీయాలి
ఇదంతా కుదరకపోతే ఇక నుంచి ప్రపంచ కప్ పోటీలు నిర్వహించే సన్నాహక రోజునే ఆస్ట్రేలియాకు కప్ ప్రధానం చెయ్యాలి. తరువాత రెండవ స్థానం కోసం పోటీలు నిర్వహించాలి
: నందు ఉంచబడ్డది; సరదాకి
చూడబోతే అలానే ఉంది.చిన్నపుడు క్లాస్ లో ఏ ప్రశ్న అడిగినా తెలివైన అబ్బయో అమ్మాయో ప్రతీ దానికీ చెయ్యి ఎత్తేస్తూ ఉంటే మాస్టారు…వీడు తప్ప ఇంకెవరయినా సమాధానం చెప్పాలి అని అడిగినట్టు…ఆస్ట్రేలియా కాకుండా ఇంకెవరు గెలుస్తారు అని చూడాలి ఇక నుండి. ఇక పై బూస్ట్ ఏడ్ కి ఆస్ట్రేలియా టీం ని వాడుకుంటారేమొ!!’బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనెర్జీ”….అంటే…పక్క నుండి బంగ్లా దేశ్ టీం…’ఔర్ ఎనెర్జీ’ అని చీర్స్ చెబుతుంది.
ఆస్ట్రేలియా బౌలర్లు బాటింగ్ మాత్రమే చేసేట్టు, బాట్స్మెన్ బౌలింగ్ మాత్రమే చేసేట్టు నిబంధన విధించాలి
“ఇదంతా కుదరకపోతే ఇక నుంచి ప్రపంచ కప్ పోటీలు నిర్వహించే సన్నాహక రోజునే ఆస్ట్రేలియాకు కప్ ప్రధానం చెయ్యాలి. తరువాత రెండవ స్థానం కోసం పోటీలు నిర్వహించాలి”
నాకీ ఆలోచన చాలా బాగా నచ్చింది..
హహహ…
ఆస్ట్రేలియా ని ఓడించలేక జనాలు ఇలా ఆలోచిస్తున్నారన్నమాట, నేను ఎప్పుడో వీటన్నిటినీ మించిపోయి ఆస్ట్రేలియా ని సపోర్ట్ చెయ్యడం నేర్చుకున్నా :)
ఈ చివరి కామెంటు నాకు నచ్చింది. మనమంతా ఆస్ట్రేలియా అభిమానులుగా మారితే సరి!
–ఫ్రసాద్
http://blog.charasala.com
అలాగే అంటూ వుండండి. మా సింహళ వీరులు కప్పు కొట్టేసి ఆ కప్పు మూతతో రికీ పాంటింగ్ టీం నెత్తి మీద షట గోపం పెడతారు :-)
జయ జయ…సూర్య
జయ జయ.. వర్ధనే
సింహళ విహారి. :-)
నా ఓటు కూడా సింహళ విహారికే. ఆస్ట్రేలియా ఏమీ అప్రతిహతం కాదు. ఆ విషయం రేపే తేలిపోనుంది. Hard luck Australia. Advanced wishes to Srilanka.
విజయ గారి కామెంట్ భలే ఉంది.
’బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనెర్జీ”….అంటే…పక్క నుండి బంగ్లా దేశ్ టీం…’ఔర్ ఎనెర్జీ’ అని చీర్స్ చెబుతుంది.
విహారిగారి మాట భలే ఉంది. లంకగెలవాలని ఒంటికాలిపై తపస్సు మొదలెట్టేసినట్టుంది.
ఇంత మాత్రం దానికి ఒంటికాలిపై తపస్సు వరకూ ఎందుకండి? Law of averages ప్రకారం ఈ రోజు ఆస్ట్రేలియా ఒటమి ఖాయంగానే అనిపిస్తోంది.