నాకు నచ్చిన 10 తెలుగు సినిమాలు

నిన్న ఆపరేషన్ దుర్యోధన సినిమా రివ్యూ చదివిన తరువాత….ఎలాంటి సినిమా పరిశ్రమ ఇలా
తయారయ్యిందేమిరా అని అనిపించింది. నాకు నలుపు-తెలుపు సినిమాలంటే బొత్తిగా
ఇష్టముండేది కాదు. చిన్నప్పుడు ఇంటి వద్ద చూస్తూంటే..ఎలా చూస్తార్రా ఈ సినిమాలను
అని అనుకొనే వాడిని. ఇప్పుడు నాకు నచ్చిన 10 తెలుగు సినిమాలు తీసుకొంటే..అన్నీ
నలుపు-తెలుపు సినిమాలే ఊన్నాయి :)
1) గుణసుందరి కథ
అద్భుత జానపద సినిమా యిది. దర్శకబ్రహ్మ కె.వి.రెడ్డి సృష్టించిన చిత్రరాజం. ఈ
సినిమాలో మొదట చెప్పుకోవలసింది గోవిందరాజుల సుబ్బారావు నటన. ముగ్గురు కూతుర్లకు
తండ్రిగా, ముఖస్తుతికి సంతోషపడే [...]