కన్నీటి నుంచి కంటి వెలుగు దాకా

ఎండిపోయి మెట్టైపోయిన 10 ఎకరాలు, అరవై వేలు అప్పు చేసి మూడు బోర్లు వేసినా పడని చుక్క నీరు, చేతిలో డబ్బు లేదు, నెత్తి మీద పుట్టెడు అప్పులు, వాటికి వడ్డీలు, సంపదనా మార్గాలు మృగ్యం. ఇటువంటి పరిస్థితి కారణంగానే గత 10 యేళ్ళగా వేలాది రైతులు ఆత్మహత్య చేసుకొంటున్నారు. కానీ మనసుంటే మార్గముంటుందని చింతకాంపల్లి రత్నప్ప నిరూపించాడు. మెట్టలో నుంచే బంగారు జలాలను పొంగించాడు. రాష్ట్రంలోని లక్షలాది రైతులకు ఆదర్శంగా నిలచిన రత్నప్ప కథను [...]