బరువు తగ్గడానికి 10 ఉపాయాలు

ఈ మధ్య ప్రపంచీకరణ ప్రభావంతో రెస్టారెంట్లు, మెక్ డొనాల్డ్ లాంటివి పెరిగిపోయాయి. ఆధునిక జీవన శైలి వలన మనకు తెలియకుండానే బరువు పెరుగుతున్నాము. కూర్చొని పని చేసే ప్రతి ఉద్యోగి, వ్యాపారి కూడా తన బరువు మీద కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 35 దాటిన వాళ్ళు తమ బరువు మీద నియంత్రణ కలిగి ఉండాలి. బరువు పెరగటం వల్ల పొట్ట వద్ద, తొడల దగ్గర కొవ్వు పేరుకొని, గడ్దం క్రింద చర్మం వేలాడుతూ అసహ్యంగా తయారు అవుతాము. చర్మం కూడా బాగా సాగుతుంది. ఒక్క కేజీ బరువు పెరగటానికి ఎంతో సమయం పట్టదు. కానీ అదే ఒక్క కేజీ బరువు తగ్గటానికి వ్యాయామశాలకు వెళ్ళి, రోజు అర గంట పరుగెత్తి, కడుపును పస్తులు పెట్టి నానా అవస్థలు పడాలి. ఇన్ని అవస్థలు మనకు అవసరమా!! కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మనము బరువు చూసుకొంటూ ఉండాలి. మీరు స్థూలకాయస్తులా కాదా అనడానికి ఒక చిన్న లెక్క ఉంది. శివ 170cm పొడవు ఉన్నాడు, అతను ఎక్కువంటే (170 - 100 = 70Kgలు) ఉండవచ్చు. మన చేతి ఎముకలు సన్నవా, లావువా అని చూసి ఒక +/-5kgలు అటూ ఇటూ సర్దుకోవచ్చు. దాని దాటితే స్థూలకాయస్తుల జాబితాలో చేరినట్టే.
దీన్ని జయించాలంటే, రోజు వారిలో మనం కొన్ని అలవాటులు మార్చుకోవాలి. అంతే కాక మనస్సు రక రకాల రుచుల మీదకు పోకుండా నియంత్రించుకోవాలి. వాటి కోసం కొన్ని చిన్న చొట్కాలను పంచుకొంటున్నాను

1. చిన్న తట్టలో (పళ్ళెం) తినండి. మీకు తెలీకుండానే మీరు తక్కువ తినడం ప్రారంభిస్తారు.


2. భోజనానికి 30 నిముషాల ముందు నీళ్ళు బాగా త్రాగండి. ఆకలి ప్రభావం అంతగా తెలియదు. భోజనానికి రెండు గంటల తరువాత కనీసం 30 నిముషాలకు ఒక్కసారి నీళ్ళు త్రాగండి.


3. రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువ సార్లు తినండి. కప్పుడు అన్నంతో పాటూ ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు ఉండేలా చూసుకోండి. రాత్రి మాత్రం ఒక్క చపాతి చాలు. ఆకలేస్తే ఏ పచ్చి క్యారెట్టో, ఆపిలు పండో తినండి. (ఆహారపు అలవాట్ల గురించి విఫులంగా ఇంకో టపాలో వ్రాస్తా)


4. నోరు కట్టేసుకోవడం మా వల్ల కాదు అనేవాళ్ళు ఏదైనా తినండి ఐతే కొద్దిగా తినండి. తినేది ఒక్క బజ్జీయే అయినా నెమ్మదిగా తింటూ దాని రుచిని ఆస్వాదించాలి.
చిరు తిండ్లు, తీపి పదార్థాలు తినవలసి వస్తే…నిరభ్యరంతరంగా తీసుకోండి. ఐతే ఒకటికి మించి వద్దు. లేకపోతే [[అహ నా పెళ్ళంట]] సినిమాలో కోటాను అనుసరించాలి ;)


5. వారం మొత్తం నూనె పదార్థాలు లాంటివి పత్యం ఉన్నందుకు ప్రతిఫలంగా ఆదివారం మధ్యాహ్నం మీకిష్టమొచ్చింది తినండి. అంటే ఏదైనా స్పెషల్ తినల్ల అంటే ఆదివారం కోసం ఎదురు చూడాల్సిందే.


6. లిఫ్టు ఎక్కవద్దు, ఎన్ని అంతస్థులైనా సరే, ఎన్ని సార్లయినా సరే మట్లే ఎక్కండి. (కీళ్ళ వ్యాధులు ఉన్న వాళ్ళు వైద్యుని సలహా తీసుకోండి). బస్సు దిగాల్సిన స్థానం కన్నా ఒక స్థానం (stop) ముందే దిగెయ్యండి.


7. ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోండి. ఆత్రం వద్దు. ఆత్రంగా అన్నీ కుక్కేసుకోవడం కంటే, తినే ఒక్కదాన్నే తింటూ దాని రుచిని మెల్లగా ఆస్వాదించండి.


8. ఫలాల రోజు, కూరాగాయల రోజు, మొలకల రోజు లాంటివి ప్రతి నెలా జరుపుకోండి. ఆ రోజు తాజా పండ్లు, కూరగాయలే మాత్రమే తినండి .


9. నేను ఫలానా పది కేజీల బరువు తగ్గ దలుచుకున్నాను అని స్నేహితులు అందరికీ చెప్పండి. ఒక వేళ బరువు తగ్గాడానికి జాగ్రత్తలు తీసుకోకపోతే జనాలు అడుగుతున్నప్పుడైనా చురుక్కుమని తగిలి కర్తవ్యం గుర్తు వస్తుందిటి.


10. అన్నిటికన్నా ముఖ్యం, బరువు తగ్గాలన్న అత్యుత్సాహం వద్దు. అత్రుత్సాహం ఉంటే ఆరంభశూరుగానే మిగులుతారు. అలవాటులన్నీ మెల్లమెల్లగా మార్చుకోవాలి. ఇది ముఖలో మొదలుపెట్టి పుబ్బలో ముగించే కార్యక్రమంలా కాక, జీవితాంతం ప్రతి ఒక్కరోజూ పాటించే అలవాటుగా మార్చుకోండి.

ఇట్లాంటి ఉచిత సలహాలను ఎన్నని గుర్తు పెట్టుకోవాలి అనే అడిగేవారికి కొసరుగా మూడు గుడ్డి గుర్తులు
1) ఎప్పుడూ సగం కడుపుకే తినండి. అంట పొట్టలో సగం ఆహారం ఉంటే, మిగతా సగం గాలి, నీరు ఉండాలన్నా మాట.

2) సాధ్యమైనంతవరకు యంత్రాలు ఉపయోగించడం మానెయ్యండి.

3) వేపుళ్ళు, పాల ఉత్పత్తులు పూర్తిగా మానెయ్యండి, అస్సలు ముట్టుకోవద్దు.

(హెచ్చరిక: ఇది స్వయం అనుభవాలతో ఇస్తున్న సలహాలే కానీ వైద్యుని చికిత్సకు ప్రత్యామ్నాయాలు కావు)

_________________________________________________________________
65% తాజాదనం ( ఏమిటిది? )

27 Responses to “బరువు తగ్గడానికి 10 ఉపాయాలు”

  1. 95%

  2. బాగున్నాయి

    టీ వీ చూస్తూ తినకూడదు

    భోజనంలో పండ్లు ఉండవలెను.

    జాగింగ్ చెయ్యడం (రన్నింగ్?) మనవద్దు

    ఫీడ్ బాక్ తీసుకోండి మీ బాడీ నుండి :)

    70%

  3. పెరుగెత్తడం కన్నా కొద్ది దూరం జాగింగ్ చేస్తే మేలు అనుకొంటా. రోజూ మైళ్ల కొద్దీ పరుగెత్తే…దీర్ఘకాలంలో కీళ్ళ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఎక్కడో చదివా. అదీ కాక…కొన్నాళ్ళు చేసి, తరువాత నిలిపివేస్తే కూడా మంచి కాదు అని జనాలు చెప్పగా విన్నాను.
    పొట్ట తగ్గాడానికి యోగా బాగా పని చేస్తుంది అనుకొంటా. హలాసనం లాంటివి చేస్తే మంచి ఫలితం.

  4. అమెరికానుండి మొదట నేర్చుకోకూడని విషయమిదే..గాబరా తిండి (ఫాస్ట్ ఫుడ్).. బాబోయ్ దయచేసి మెక్‌డోనాల్డ్స్, సబ్వే, పిజ్జాహట్ లాంటి ప్రదేశాలలోని చెత్త తిండి తినవద్దు..దూరపు కొండలు నునుపు కానీ ఇడ్లీలు, పెసరట్లు తినక ఇదేం మాయరోగం..ఈ లెక్కన భారతదేశం కూడా అమెరికాలాగా ఫాట్సో నేషన్ అయ్యేట్టుంది (అందునా ముందే భారతీయులకు జన్యుపరంగా హృద్రోగ్రము సంభవించే అవకాశాలు మెండు)

  5. పాల ఉత్పత్తులు మంచివి కావా?

  6. నెయ్యి, వెన్న, పాలకోవా, స్వీట్లు, రసగుల్లా అన్నీ పాల ఉత్పత్తులే కదా.

  7. పాలు తప్పకుండా తాగాలి మనక్కావలసిన కాల్షియం, మెగ్నీషియం చాలామటుకు అందులోనుండే వస్తాయి కానీ పాలలో కొవ్వెక్కువ కాబట్టి కట్టె విరగకుండా పామును చంపాలంటే లో్‌ఫాట్ పాలు లేదా వెన్నతీసిన పాలు తాగండి. ఇక నెయ్యి, రసగుల్లా వగైరా ఆధునిక జీవనశైలికి తగవు (తింటే ఇక పరిగెత్తాల్సిందే)

  8. me suggetions chaala baagunnavi

  9. me salahalu chaala baagunnavi

  10. THEY R QUITE GOOD.

  11. Your suggestions are very good. Being a weight management consultant I also give same suggestions to my clients. If any person is already overweight and struggling to lose weight plez contact +91 9885407929.

  12. ఈ టపావల్ల నాకు అస్సలు ఉపయోగం లేదు. :-)
    “బరువు పెంచుకోవడం ఎలా?” అనేది చెప్పాలి.

  13. hi
    iam sufering with overwight of 25kgs
    plz suggest me to lost my overwight

  14. YOUR SUGGESTIONS ARE NORMAL . DAILY PLAY ONE HOUR VOLLEYBALL OR BASKET BALL OR SHUTTLE .PLEASE MAKE FRIENDSHIP WITH LEAN PEOPLE,

  15. hi,
    i’m unable to see this blog due to font problem pls tell me which fonts shall i load. i’m using firefox n safari.

    thanx

    regards
    seshu

  16. AYYA mallesh garu, ee blog loo edho andharu thipalu padee barvu ela tagalee dhanee valana labam emeetee anee discuss chestuvuntee. meru entee andee eee PANEKEMALEENA SELF SALES. ofcourse, there is nothing like free-lunch, MERU edheeiyna professional sandesam istee baghavundhee memu kuda metchukunevallam. eee paneekemaleena panulu (self sales) entee andee.

  17. i know everything about loss of weight.
    But unable to follow them. My mind always go to sweets and fast foods. When i try to control food, from then onwards i take more intake. Give me a good suggestion on control of mind, so that i can follow. All my friends are lean only. this also i maintained. helpme.

  18. nenu meru ichinna salahalu chadivanu .avvi bhaghane vunayye kani nenu vundavalasena bharuvukanna thakkuva vunnanu kabatti nenu bharuvu peragadam ela go cheppandi.

  19. Mee Suggestions chala chala bagunnayi.

  20. ఇది నాకు సరిపడదు. నేను కనీసం ఇంకా 10 కేజీల బరువు పెరగాలి
    అదేలగో చెప్పండి ప్లీజ్

  21. Mee Suggestions chala chala bagunnayi.

  22. బరువు తగ్గాలంటే కష్టం కాని, బరువు పెరగాలంటే చాలా సులువు.పైన వ్రాసిన పది పాయింట్లకు వ్యతిరేకం చెస్తే సరి :), ఏమంటారు?.

    ఇలా చెప్పినంత సులువు కాదులెండి.నాకు ఇది బాగా తెలుసు ఎందుకంటే నేను ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు ఇద్దరు స్నెహితులు తగిలారండి. ఇద్దరూ తెలుగువారే. ఇద్దరికీ ఒకటే ప్రొబ్లెం, వుండవలసిన బరువుకంటే తక్కువ బరువు వుండటం.ఎంత తిన్నా లావు కాక పోవడం.

    ఇద్దరి నడవడికలు దాదాపుగా ఒకటే అంటే నమ్మండి. బాచ్లర్ గా వున్నప్పుదు వీరితో 2 సంవత్సరాలు వున్నాను కాబట్టి వారిని చూసి నాకు (లావు పెరగాలంటే) అర్థం అయ్యింది ఇది:

    - ఎప్పుడూ ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవకూడదు.నా స్నెహితులకు ఏ చిన్నదానికైన చాలా టెన్షన్ ఫీల్ అయ్యేవారు.
    - కారం నొర్మల్ గా తినాలి. నా స్నెహితులకు భోజనానికి పచ్చి మిరపకాయలు లేనిదీ అన్నం దిగేదికాదు.
    - స్వీట్లు బాగా తినాలి.
    - పచ్చడి (ఉరగాయ) నొర్మల్ గా తినాలి. ప్రతిసారి భోజననికి 5 - 6 ఉరగాయ ముక్కలు తినడం లాంటివి చేయకూదదు.
    - చిన్నవాటికంతా ఎక్కువ ఆలొచించకూడదు.

    నెను అర్థం చెసుకున్నంత వరకు బరువు తక్కువ ప్రొబ్లెం కొంచం మైండ్ రిలేటెడ్ అనిపిస్తుంది.
    ఒక స్నేహితుడు మాత్రం పెళ్ళి ఐన సంవత్సరానికి కొంచం లావయ్యాడు :)

  23. రామ రామ ఆశోక్ గారూ, అంత పని చేయకండి బాబు..బరువెక్కాలని స్వీట్లు, నానా గడ్డీగాదం తింటే బరువెక్కుతారు..దానితో పాటూ కొవ్వెక్కుతారు కూడా..బరువు తగ్గటం ఎంత కష్టమైన పనో బరువు పెరగటం కూడా అంతే కష్టమైన పని (మా అవిడ బరువెక్కాలని ఆర్నెల్లనుండి తెగ కృషి చేస్తుంది..కానీ ప్రోగ్రెస్సు నిల్లు)
    ఆరోగ్యంగా బరువెక్కటానికి సరళమైన మార్గం మీ బరువు (కేజీల్లో) x 2 = గ్రాముల ప్రోటీను రోజూ తిసుకుని కాస్తైనా వ్యాయామం చెయ్యటం (దాంతో పాటు నీళ్ళు కూడా బాగా తాగాలండోయ్). బుజ బుజ బరువెక్కటానికి తిండి ఎంతకారణమో, ఉప్పూ అంతే కారణం

  24. remote vadakam tagginchi chettone tv ,cd operate cheyyli.mixer buduluga roti ni vadali. junk food tagginchali

  25. షేక్.అంజాద్ దన్యవాదములు

  26. Hello every body,

    Andharu yee krinda message chadavandhi….

    DRINK WATER ON EMPTY STOMACH

    It is popular in Japan today to drink water immediately after waking up every morning. Furthermore, scientific tests have proven its value. We publish below a description of use of water for our readers. For old and serious diseases as well as modern illnesses the water treatment had been found successful by a Japanese medical society as a 100% cure for the following diseases:
    Headache, body ache, heart system, arthritis, fast heart beat, epilepsy, excess fatness, bronchitis asthma, TB, meningitis, kidney and urine diseases, vomiting, gastritis, diarrhea, piles, diabetes, constipation, all eye diseases, womb, cancer and menstrual disorders, ear nose and throat diseases.

    METHOD OF TREATMENT
    1. As you wake up in the morning before brushing teeth, drink 4 x 160ml glasses of water
    2. Brush and clean the mouth but do not eat or drink anything for 45 minute
    3. After 45 minutes you may eat and drink as normal.
    4. After 15 minutes of breakfast, lunch and dinner do not eat or drink anything for 2 hours
    5. Those who are old or sick and are unable to drink 4 glasses of water at the beginning may commence by taking little water and gradually increase it to 4 glasses per day.
    6. The above method of treatment will cure diseases of the sick and others can enjoy a healthy life.

    The following list gives the number of days of treatment required to cure/control/reduce main diseases:
    1. High Blood Pressure - 30 days
    2. Gastric - 10 days
    3. Diabetes - 30 days
    4. Constipation - 10 days
    5. Cancer - 180 days
    6. TB - 90 days
    7. Arthritis patients should follow the above treatment only for 3 days in the 1st week, and from 2nd week onwards - daily.

    This treatment method has no side effects, however at the commencement of treatment you may have to urinate a few times.
    It is better if we continue this and make this procedure as a routine work in our life.
    Drink Water and Stay healthy and Active.

    This makes sense .. The Chinese and Japanese drink hot tea with their meals …not cold water. Maybe it is time we adopt their drinking habit while eating!!! Nothing to lose, everything to gain…

    For those who like to drink cold water, this article is applicable to you.
    It is nice to have a cup of cold drink after a meal. However, the cold water will solidify the oily stuff that you have just consumed. It will slow down the digestion.
    Once this “sludge” reacts with the acid, it will break down and be absorbed by the intestine faster than the solid food. It will line the intestine. Very soon, this will turn into fats and lead to cancer. It is best to drink hot soup or warm water after a meal.

    A serious note about heart attacks: Women should know that not every heart attack symptom is going to be the left arm hurting.
    Be aware of intense pain in the jaw line.

    You may never have the first chest pain during the course of a heart attack.
    Nausea and intense sweating are also common symptoms.

    60% of people who have a heart attack while they are asleep do not wake up.
    Pain in the jaw can wake you from a sound sleep. Let’s be careful and be aware. The more we know, the better chance we could survive…

    A cardiologist says if everyone who gets this mail sends it to everyone they know, you can be sure that we’ll save at least one life

  27. [...] బరువు తగ్గడానికి 10 ఉపాయాలు [...]

Leave a Reply