అన్న బ్లాగాడోచ్……

చిన్నప్పుడు రెండవ తరగతిలో ఉండంగా బడి వార్షికోత్సవానికి మా చేత కొన్ని పాటలు పాడించి, నాటకం వేయించాలనుకున్నారు. దాని కోసం నేను, ప్రసాదు, ప్రశాంతు, రెడ్డెప్ప, వెంకటేశ్వర రెడ్డి, సునిత, ఇంకొందరు ఐవోర్లు, మిద్దె పైకి వెళ్ళి సాధన చేస్తున్నాము. ఇంతలో ఎందుకో మిద్దె పైన నుంచి క్రిందకు చూచాను. మా అమ్మ నాన్న కలసి బడి లోపలికి వస్తున్నారు. ఇద్దరినీ బడిలో చూడటం అదే మొదటి సారి. ఆనందమో..ఆశ్చర్యమో….వెంటనే కళ్లలో నుంచి నీళ్ళు వచ్చేశాయి. పది నిముషాలు అలాగే ఎడ్చాను. బహుశా అది తట్టుకోలేని ఆనందం వలన కావచ్చు.

ఇన్నాళ్లకు మళ్ళీ అటువంటి రోజు వచ్చింది. నాకు భలే సంతోషంగా ఉంది ఈ రోజు. వందకు పైన టపాలు, వందల వ్యాఖ్యలు , వికీలో వేల వ్యాసాలు వ్రాసి / దిద్దిన తరువాత….మొట్టమొదటి సారిగా అన్న దగ్గర్నుంచి అపురూపంగా ఒక్క వ్యాఖ్య వచ్చింది. ఆనందమో..ఆశ్చర్యమో…..వెంటనే కళ్లలో నుంచి నీళ్ళు తేలాయి. బహుశా అది తట్టుకోలేని ఆనందం వలన కావచ్చు.

ఎప్పుడూ ఇంగ్లీషులో వ్రాసే అన్న తెలుగులో వ్రాయటం భలే ముచ్చటగా ఉంది. రెడ్ కార్పెట్ లేక పోయినా చెప్పేస్తున్నా “సోదరా…….బ్లాగ్లోకానికి స్వాగతం సుస్వాగతం“. ఈ రోజైతే పండగ జరుపుకోవలసిందే :)

_________________________________________________________________
50% తాజాదనం ( ఏమిటిది? )

15 స్పందనలు

  1. అన్న ప్యాంటేస్తే మాస్ అన్నట్టుంది. wishing good luck to him.

  2. ఆనందమానందమాయే..మది ఆశల నందనమాయే..బ్లాగ్సోదరులనమాట మొత్తానికి సాధించావయ్యా నవీన్..ఈనాడు వ్యాసంలో పూతరేక్స్ అన్నయ్యను లాక్కొచ్చిందంటావా??

  3. మాకు పూతరేకులు ఎప్పుడిస్తారు

  4. కరెక్ట్ గా చెప్పరండి రవి గారూ..

    దాదాపుగా నవీన్ మొదలు పెట్టినప్పటినుంచి ఎంకరేజ్ చేస్తూనే వున్నాడు. చివరికి వాడి బ్లాగ్ విజయం ఈనాడు లో రావడం నాకు స్పార్కుని/స్పూర్తిని ఇచ్చింది.

  5. అశ్విన్ గారు, ఈ సారి బెబ్లాసకు రండి తప్పకుండా ఇస్తాను :)

    @శ్రవణ్, భలే…ఇక నుంచి నేను అన్న బ్లాగేస్తే మాస్ అనాలేమో :)

  6. అన్న’దమ్ములు ఇద్దరికీ శుభాకాంక్షలు. పార్టీకి సంబంధించిన ఒక విన్నపం – మందు తాగినప్పుడు బండి నడపరాదు.. :-P

  7. బ్లాగ్సోదరులకు బహుబ్లాగాకాంక్షలు!

  8. కంగ్రాట్స్.
    గమనించారా- ఇది కూడా రికార్డు కెక్కాల్సిన విశేషమే. మొదటి తెలుగు బ్లాగ్సోదరులు వీరేనేమో.

  9. మీ బ్లాగు ఇప్పటికే చాలా పాపులర్. Good work. Keep it up.

  10. (ఈ టపాకి సంబంధించిన వ్యాఖ్య కాదు)

    అయ్యా నవీన్ గారు,
    మీరడిగినట్లే తెలుగు సినిమా ప్రశ్నలని చాలా ఉంచాను కాని, మీరు ఒక్కటి కూడా ప్రయత్నించరేమి?

  11. నేను అడిగిన వెంటనే మీరు శ్రమపడి తెలుగు పరిశ్రమకు సంబంధించిన ప్రశ్నలు అడిగినందుకు నిజంగా చాలా సంతోషం అయ్యింది. ప్రశ్నలు తయారు చెయ్యడం ఎంత శ్రమో నాకు తెలుసు. మీరు టపాయించిన టపాలు చూస్తున్నాను. వాటికి సమాధానం ఇవ్వకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి.
    ౧. నాకు వచ్చిన ప్రశ్నలకు జనాలు ఇది వరకే జవాబు ఇచ్చి ఉండటం
    ౨. నాకు ఇక్కడ అబూధాబిలో పిచ్చ పిచ్చగా పని వచ్చి పడింది. పచ్చిగా చెప్పాలంటే..పది మంది కలసి….@#$%…చేసినట్టుంది :( …నాకిష్టమైన వికీలో ఒక వ్యాసం వ్రాసి రెండు నెలల పైన అయిపోయిందంటే నమ్మండి.
    కానీ మీ ప్రశ్నల ప్రవాహాన్ని అలా ప్రవహింపజేస్తూండండి..దాహం తీర్చుకోవడానికి తప్పకుండా వస్తాను :)

    ..ఇక్కడికి వచ్చి మరొక్కసారి గుర్తుచేసినందుకు ఇంకా సంతోషం (నన్ను గుర్తెట్టుకున్నారుగా మరి:)

ప్రత్యుత్తరమిమ్ము