అప్పుడు ఆహా…ఇప్పుడు అబ్బా

అప్పుడు కళ…ఇప్పుడు వ్యాపారం
అప్పుడు కథ…ఇప్పుడు వ్యధ
అప్పుడు నటులు..ఇప్పుడు స్టార్లు
అప్పుడు ప్రేక్షకులు…ఇప్పుడు ‘అభిమానులు’
అప్పుడదో తపస్సు…ఇప్పుడిదో గారడీ
అప్పుడు తీపిగుర్తులు…ఇప్పుడు తలనొప్పులు
అప్పుడు సంతృప్తి…ఇప్పుడు లాభం
అప్పుడు నాటకరంగం…ఇప్పుడు వారసత్వం
అప్పుడు లంగాఓణీలు … ఇప్పుడు చెడ్డీబనీన్లు
అప్పుడు డ్రామా…ఇప్పుడు కోమా
(మనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వచ్చే తెలుగు సినిమాల మీద రాకేశ్వరా వ్రాసిన విమర్శనాత్మకమైన వ్యాసం చదివి పొంగిన భావజాలాన్ని పదాల రూపంలో ఇలా పేర్చాను.)

పడిపోయాను….

శరీరాన్ని తొడుక్కోవటానికి భూమి మీదకొచ్చాను
సంస్కారము వదిలేసి పాతాళానికొచ్చి పడ్దాను
( కొన్నాళ్ళు తవికల పేరిట నేను జరిపే హింసాకాండను పాఠకులు భరించాలి :) )

ప్రేమ కోసం శోధన

చిత్రమైన దేవుడు….మనకు
రెండు కళ్ళు
రెండు కాళ్ళు
రెండు చేతులు
రెండు చెవులు
ఇచ్చి ..గుండెను మాత్రం
తోడు వెతుక్కోమంటూ ఒంటరిని చేసేశాడు
(నా స్నేహితుడు వాడికి వచ్చున మెయిల్లో…మీ రెండో గుండెనెవరికిస్తారు (ఆంగ్లంలో) ..అని ఉంటే…అది సబబుగా లేదని…నా మనస్సుకు తోచింది వ్రాసేశా)
———-౦౦౦౦::~O~::౦౦౦౦————
నేను వ్రాసిన మరికొన్ని తవికలు:

మరో ప్రపంచం కోసం
ఐనా మనిషి మారబోడు
దేవుడా ..నీ తోటను చూడు
ఏమి ఈ జీవితము….ఈలా తయారయినదేమి?
ఓ రాజా!! మహీపతి!! చింతాక్రాంతులైయ్యుంటిరి ఎందు చేత?

జాన్ అప్పారావ్ 40+

ఈ సినిమా The 40 year old virgin కు ఫ్రీ మేక్ ఏమో అనిపిస్తోంది. ఇక రెండు రోజులాగితే….నిజమో కాదో తెలిసిపోతుంది. పోస్టర్లు..ట్రైలరు చూసి సినిమా మీద అంచనాకొచ్చే రోజులు పోయాయి. జనాలకు పోయే కాలమొస్తే తప్ప…తెలుగు సినిమాను మొదటి రోజే చూసెయ్యలన్న దుగ్ద..దురద పుట్టదు.
ఎందుకన్నా మంచిది…ఆగి…చూసి…వెళ్ళండి. అంటే… మొదటి రోజు ఆగి…రివ్యూలు చూసి…తరువాత వెళ్ళండి అని. నా మాట కాదన్నారా…ఇదిగో..ఇటీవలే వచ్చిన ఓ ఏడు సినిమాల రివ్యూ హెడ్డింగులను ఇక్కడ ఇస్తున్నాను.

‘Visakha Express’ [...]