అ అంటే ………
టపా తేదీ మార్చి 11, 2008 ద్వారా gsnaveen
అ అంటే అశాంతి అని
ఆ అంటే ఆవేశం అని
ఈ అంటే ఈర్ష్య అని
అక్షరాభ్యాసం చేశాను
ఎంత చింతించి ఏమి లాభం
అ అంటే అందమని
ఆ అంటే ఆనందమని
ఈ అంటే ఈశుడని
దిద్దుకునే లోపే ఆలస్యమైపోయింది
చెరిపి మళ్ళీ వ్రాయటాని ఇది పలక కాదు
ఇది ……………. జీవితం
———-౦౦౦౦::~O~::౦౦౦౦————
మరికొన్ని తవికలు:
: నందు ఉంచబడ్డది; తవికలు | అఁటిఁచబడ్డవి: kavita కవిత కవితలు kavitalu
అమలాపురం అనుకున్నానే! :)
నవీన్,
నీ ఈ కొత్త అవతారమేంటి? నీ వ్యాఖ్యలు, టపాలు చదువుతున్నాను.
What’s up?
ఏమి చేసినా చెయ్యకపోయినా సమయం గడిచిపోతుంది.
మనకి ఉన్న దాన్ని మనం సద్వినియోగం చేస్తే చాలు మన జన్మ ధన్యం.
@కొత్తపాళీ గారు,
అలా అనుకోవాలనే పేరు అలా పెట్టాను. అలాగైనా జనాలు నా సైటుకొచ్చి టపా చదువుతారు కదా :)
@లలిత గారు,
>> నీ ఈ కొత్త అవతారమేంటి?
నా అవతారమేమిటో ఇప్పుడిప్పుడే కాస్త అర్థమౌతున్నట్లుంది. ఐనా ఇవన్నీ జనాలు గమనిస్తూంటారని ఊహించలేదు :)
>> What’s up?
దీని గురించే ఇంకా ఆలోచిస్తూన్నాను. బ్లాగిన సమయానికి సార్థకం ఉండాలి కదా.
>>మనకి ఉన్న దాన్ని మనం సద్వినియోగం చేస్తే చాలు మన జన్మ ధన్యం.
ఇది చాలా చాలా నిజం. ఆ “సద్వినియోగం” చేసుకోవడం ఎలానో తెలుసుకుంటే ఇంకా ధన్యం.
మీ టపా చదువుతొంటే మున్నాభాయ్ సినిమా చివరి పాటలో ఆ డాన్సర్ వ్యాఖ్య గుర్తొస్తొంది.
“हे पागल.. ये ना देख की जिंदगी में कितने पल हैं. ये देख की एक पल मे कितना जुंदगी हैं”
కరక్టే కదా..
@Ravi Kiran
>> “हे पागल.. ये ना देख की जिंदगी में कितने पल हैं. ये देख की एक पल मे कितना जुंदगी हैं”
నిజమే…ఇలా ఆలోచిస్తే, గతం గురించి చింతించడానికి సాహసించరు :)