ఫైర్‌ఫాక్స్ 3.0 డౌన్లోడ్ చేద్దాం…రా

మంట నక్క అని ముద్దుగా పిలుచుకొనే FireFoxకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోజిల్లా వారు ఒక గిన్నీసు రికార్డును స్థాపించాలని సంకల్పించారు. ఆ రికార్డు ఏమంటే…24 గంటల్లో ఎక్కువ సార్లు Download చేసుకున్న softwareగా FireFox3.0ను నిలపాలను. పద్నాలుగు వేల మెరుగులు దిద్ది ఉచితంగా అందరికీ అందించబోతున్న FireFox3.0 ను అందరూ Download చేస్తారు కదూ? ఆ తేదీ ఎప్పుడన్నది త్వరలో తెలియజేస్తారు.

పూర్తి వివరాల కోసం ఈ లింకును చూడండి: http://www.spreadfirefox.com/en-US/worldrecord/

7 స్పందనలు

  1. నేను డౌన్లోడ్ చేసాను. తెలుగు ఇప్పుడు IE తో సమానంగా కనపడుతోంది. Good Job FireFox.

  2. ఎట్టకేలకు పూతరేక్స్ వచ్చాయన్నమాట.. విస్తరితో సహా లాగించేస్తా

  3. @రవి వైజాసత్యా,
    మూడు నెలల నుంచి చూస్తున్నా, ఎవరైనా పూతరేక్స్ బొమ్మ గురించి అడుగుతారేమో అని. ఇన్నాళ్ళకు నువ్వు దాన్ని గమనించి ప్రస్తావించడం సంతోషంగా ఉంది. ఇంట్లో BSNL broadbandకు అప్లై చేశాను. అది వస్తే గనక బండి రహదారిలోకి వచ్చినట్లే అనుకో :)

  4. నవీన్‌,

    ఎటూ పూత రేకులు గురించి వచ్చింది కదా అడుగుతున్నా. నువ్వుండేది మదనపల్లి కదా ఈ పూత రేకులు గురించి పరిచయమెలా జరిగింది? అదే బ్లాగుకు పేరు గా ఎందుకు పెట్టావ్? నేనయితే పాకం పప్పు అనో బొరుగుంట అనో పెట్టేవాడిని :-)

    – విహారి

  5. XP లో బానే వుంది కానీ విస్టా ఫైరు ఫాక్సులో తెలుగు సరీగా కనిపించడం లేదు.

    – విహారి

  6. @విహారి
    మొత్తానికి మదనపల్లోడనిపిచ్చినావ్. పూతరేకులు మన పక్క చెయ్యడం కాదు కదా… కనీసం అదంటే ఏందో కూడా తెలియదు. నేను జీవితంలో ఒకే సారి దాని రుచి చూశాను. అదీ ఇంజనీరింగ్‌లో ఉండంగా. దాని పేరే ఎందుకు పెట్టానంటే………………………పబ్లిక్‌గా ఎందుకు కానీ, నీకు మాత్రం సెపరేటుగా చెప్తా :)
    పాగంపప్పు పూతరేకుల కంటే చానా రుచిగా ఉంటాది కదా…బెల్లం బెల్లమే….చక్కెర చక్కెరే.
    >> XP లో బానే వుంది కానీ విస్టా ఫైరు ఫాక్సులో తెలుగు సరీగా కనిపించడం లేదు
    నా ఒక్క సైటు మాత్రమేనా లేక యూనీకోడు సైట్లన్నీనా…చెప్పగరా? లేదా వర్డ్‌ప్రెస్ సైట్లన్నీనా?

  7. Telugu cinima.com

ప్రత్యుత్తరమిమ్ము