నేనూ పనికొస్తాను బాబూ!

    గ్లోబల్‌ వార్మింగ్‌ అన్న సమస్య ఉనికిలోకి వచ్చినప్పటి నుంచీ Co2భూమి పాలిట శత్రువైపోయింది. కానీ ఇటలీ శాస్త్రవేత్తలు మాత్రం, ”పాపం! Co2ను అంతగా నిందించాల్సిన పని లేదు, దాన్నించి కూడా మన ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చు.” అని ఓదార్పు మాటలు చెబుతున్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ వంటి శిలాజ ఇంధనాలను మండించినప్పుడు Co2 విడుదలవుతుంది. దీంతోపాటు మరికొన్ని విషవాయువుల కారణంగా భూగోళం వేడెక్కుతోందని అంచనా. ఫలితంగా వాతావరణం అతలాకుతలం అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాతావరణంలోకి విడుదలయ్యే Co2వాయువు మోతాదును తగ్గించడం ద్వారా గ్లోబల్‌ వార్మింగ్‌ను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. Co2నే ఇంధనంగా మార్చేందుకు కూడా గతంలో కొన్ని విఫలయత్నాలు జరిగాయి. అయితే ఇటీవల ఇటలీలోని మెస్సినా విశ్వవిద్యాలయ పరిశోధకులు Co2ను హైడ్రోకార్బన్లుగా మార్చడంలో విజయం సాధించారు. ఈ పరిశోధన ఎలా జరిగిందంటే…

నీటిని విడగొట్టటంతో మొదలు
శాస్త్రవేత్తలు సౌరశక్తి సాయంతో టైటానియం డయాక్సైడ్‌ సమక్షంలో నీటిని విడగొట్టడంతో ఈ పరిశోధన మొదలైంది. ఈ ప్రక్రియలో నీరు కాస్తా… ఆక్సిజన్‌, ప్రోటాన్‌, ఎలక్ట్రాన్లుగా విడిపోయింది. వీటిని ప్రోటాన్‌ త్వచంతోపాటు ఒక తీగ గుండా పంపించారు. ఆ తరువాత నానో ఉత్ప్రేరకం (ప్లాటినమ్‌, పెల్లాడియం) సమక్షంలో వీటినిCo2తో చర్య జరిపించారు. ఫలితంగా హైడ్రోకార్బన్లు ఉత్పత్తి అయ్యాయి. వాడిన ఉత్ప్రేరకాన్ని బట్టి ఈ కొత్త ఇంధనంలో ఎనిమిది, తొమ్మిది కర్బన పరమాణువులు చేరాయి. పెట్రోలు, డీజిల్‌, సహజవాయువు వంటి ఇంధనాల్లో ఈ స్థాయిలోనే కర్బన పరమాణువులు ఉంటాయి. నానో ఉత్ప్రేరకాన్ని వాడటం ద్వారా సంప్రదాయ ఉత్ప్రేరకాల కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందగలిగారు. అయితే ఈ ప్రక్రియలో కేవలం ఒక్క శాతం Co2 మాత్రమే ఇంధనంగా మారింది. ఇదో సమస్య కాదని, ఉష్ణోగ్రత, ఉత్ప్రేరక ఉపరితల విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా ఎక్కువ మోతాదులో హైడ్రోకార్బన్లను తయారుచేయవచ్చునని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన గాబ్రియేల్‌ సెంటి అంటున్నారు. నీటిని విడగొట్టే ప్రక్రియను మెరుగుపర్చడంతో కూడా ఉత్పత్తిని పెంచవచ్చునని ఆయనంటున్నారు.రానున్న పదేళ్లలో వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న Co2ను ఇంధనంగా మలిచే యంత్రాన్ని తయారుచేయడం వీలవుతుందని అన్నారు. ఇటీవల జరిగిన అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ సమావేశంలో సెంటీ ఈ పరిశోధన వివరాలు తెలిపారు. ఇతర శాస్త్రవేత్తల నుంచి దీనికి మంచి స్పందనే లభించింది.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s