పర్యావరణ నష్టాలకు కొత్త సాక్ష్యం

అడవుల కొట్టివేత, కరిగే మంచుపర్వతాలు, కిక్కిరిసిపోతున్న నగరాలు – ఈ సమస్యలు కొత్తవీ కావు, అంత తొందరగా పరిష్కారమయ్యేవీ కావు. కాకపోతే, వీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని గూగుల్‌ చిత్రాలు గుర్తు చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్‌ఇపి), గూగుల్‌ కలిసికట్టుగా చేపట్టిన ఒక ప్రాజెక్టులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటున్న 100 ప్రాంతాలను ఎంపిక చేసి గూగుల్‌ ఎర్త్‌లో ఉంచారు. ఈ ప్రాంతాలు కొన్ని దశాబ్దాల క్రితం ఎలా ఉండేవి? ప్రస్తుతం ఎలా ఉన్నాయి? అన్న విషయాన్ని ఈ చిత్రాలు కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాయి. ఈ చిత్రాల్లో అమెజాన్‌ అడవులు, ధ్రువప్రాంతాలు, మధ్య ఆసియాలోని ఆరల్‌ సముద్రం, ఆఫ్రికాలోని చాద్‌ నది, అమెరికా నగరం లాస్‌వెగాస్‌, చైనాలోని షెంజీన్‌ నగరం, థాయ్‌లాండ్‌, మలేషియాల్లో తరిగిపోతున్న వెదురు సంపద మొదలైనవి ఉన్నాయి. వీటిని చూడాలంటే http://www.google.earthలోకి వెళ్లి Featured Content ను క్లిక్‌ చేయాలి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s