థూ..ఈ సారి నిద్ర లేపితే సంపేత్తానొరేయ్

60 యేళ్ళ తెలుగు సినీ జగత్తులో పది అతి గొప్ప పాటలు తీసుకుంటే,సీతారామ శాస్త్రి రాసిన క్రింది పాట ఖచ్చితంగా అందులో ఉంటుంది. సినిమా పాటంటే ఒక్క సాహిత్యమే కాదు, అందులో దర్సకుని మరియు సంగీత దర్సకుని ప్రతిభకూడా ఉంటుంది. ఈ సినిమాలో హీరో పరమ బద్దకస్తుడు, పొద్దున్నెజాలర్లు, పనోళ్ళు, గృహిణిలు, పిల్లలూ…పల్లంతా మేలుకొని వారి వారి పన్లోకి వెడుతూంటే, మన హీరో మాత్రం వారిని విసుక్కోంటూ ముసుగు తన్ని పడుకొనే ఉంటాడు. ఇప్పటికైనా ఇది ఏ సినిమాలోదో తట్టిందనుకొంటా!! లేదంటే చెప్పండి… సమాధానం రాసేస్తా

———————————-
సూర్యుడు సూదులెట్టి పొడుస్తున్నాడు… లేద్దు
వెంకటరత్నంగారి కోడి కూత పెట్టేసింది… లేద్దు

హైలెస్సా..హైలెసా ..హైలెస్సా..హైలెసా ..

జాలరోళ్ళు అప్పుడే గోదాట్లోకి వెళ్ళిపోతున్నారు.. లెమ్మంటుంటే

వేటాడందే ఒళ్ళోకొచ్చి చేప చేరదు
రెక్కాడందే గూటిలోకి కూడు చేరదు
తెల్లారే దాకా ఏ గొడ్డూ కునుకు తియ్యదు
గింజా గింజా ఏరకుంటే పూట తీరదు

ఇంత సోమరిగా ఉంటే ఎలా
బద్దకమే ఈ జన్మకు వదిలిపోదా
గురకలలోనే బ్రతుకే చెడును కదా
దుప్పటిలోనే నీ బ్రతుకు చిక్కినదా

లేవర లేవర…….అబ్బా పోరా
సుందర సుందర…..తంతానొరేయ్
చాలును నిద్దర……థూ..ఈ సారి నిద్ర లేపితే సంపేత్తానొరేయ్

గోదారమ్మ సల్లంగా దారి సూపవే
సల్లని తల్లి నీ పాపల కాపు కాయవే
వయ్యారంగా మా పడవల ఊయలూపవే
హైలెస్సా హుషారుగా బతుకు నడపవే

కోటిపల్లి కూనవరం వేరేవైనా
జడునునెట్టి చెరలు కట్టి సేరేవమ్మా
అద్దరికి ఇద్దరికీ ఈ మధ్యన
ఏ పొద్దూ బద్దకమే ఉండదమ్మా

యెయ్యర యెయ్యర
జోరుగ జోరుగ
హైలెస్స హైలెస్స హైలెస్స

మీ పడవలూ పాటలూ తగలెయ్యా
పొద్దున్నే నిద్దర చెడగొట్టేసారు కదరా

అల్లి బిల్లీ అల్లరాటకు
చలాకీగా తృళ్ళిపడే ఈతలాటకు
ఒప్పులకుప్పా చకా చకా చిందులెయ్యవే
కిందా మిందా సూడకుండా మొగ్గలెయ్యరా

ఆటలలో పాటలలో విసుగులేదు
ఆయాసం మాకెప్పుడూ అడ్డేరాదు
సోంబేరికి ఈ గుణమే ఎప్పుడు రాదు
మొద్దులలో సావాసం మాకు వద్దు

చెమ్మా చెక్కా…..సుందులు పాడండెహె
చూడర కుప్పా…..సప్పుడు చైకండహె
వెయ్యర మొగ్గ…..థూ..రేయ్ నా నిద్ర చెడగొట్టొద్దన్నానా

ఎర్రబడే తూరుపు మందార మొగ్గలు
నవ్వులతో ముంగిట ముత్యాల ముగ్గులు
చెట్టూ చేమా పూచే ఈ వెలుగు పువ్వులు
కిలా కిలా తృళ్ళిపడే కోటి నవ్వులు

చెమటలలో తళుకుమనే చురుకుదనం
కండలలో పొంగిన బంగారు జలం
పాటకిదే దొరికినదే అసలు సుఖం
సోమరులకు తెలియనిదీ తీపి నిజం

ప్రకటనలు

11 thoughts on “థూ..ఈ సారి నిద్ర లేపితే సంపేత్తానొరేయ్

  1. మిమ్మల్ని ఇంకా విసిగించదలుచుకోలేదు. ఇప్పటికే జవాబివ్వడంలో ఆలస్యం చేసాను.

    ఈ పాట వంశీ దర్శకత్వం వహించి, తనికెళ్ళ భరణి మాటలు రాసి, సిరివెన్నల గారు పాటలు రాసి మరియు ఇళయరాజా సగీత దర్శకత్వం వహించి పెట్టిన చిత్రం “లేడీస్ టైలర్”. ఈ పాట ఆ సినిమాలో ఎక్కడుందబ్బా? అని ఆశ్చర్యపడకండి, ఈ పాట, సినిమా పేర్లు పడేటప్పుడు వస్తుంది. సామాన్యంగా మనందరి దృష్టి సినిమా పేర్ల మీద ఉంటుంది తప్పితే, ధ్యాస పాట మీద ఉండదు. అంతే కాక, ఎందుకనో సినిమా క్యాసెట్టులో కూడా ఈ పాటను రికార్డ్ చెయ్యలేదు. అలా ఈ పాట జనాల చెవులకు దూరమైయ్యింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s