తోలు తిత్తి ఇది, తూటులు తొమ్మిది

తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది
తుస్సుమనుట ఖాయం
ఒ జీవా తెలుసుకో అపాయం ||తోలు||

ఉప్పు తప్పుదై
ఉరుకులు తీయ్యకు
గబ్బు మేను జీవా
ఔను గబ్బిలాయి జీవ  ||ఉప్పు||
ఎంత పెట్టినా ఏమి కట్టినా
కట్టెలపాలౌ పాడు కట్టెరా ||తోలు||

మూడు రోజులా  ముచ్చటరా
ఈ చింత కట్టె దేహం
గాయం గుబిలిపోవు ఖాయం    ||మూడు||
నీవు కట్టుకపొయేదొట్టిదిరా
మట్టిన పుట్టీ మట్టిన కలిసి ||తోలు||

వెలుతురుండగా తెరువు చూసుకో
తలచి రామ నామం
జీవా చేరు రంగధామం ||వెలుతురు||

పట్టుబట్టి ఈ లోకకపు గుట్టు
రట్టుచేసె ఈ రంగదాసుడు ||తోలు||

————————————————————————————
ఈ పాట యెన్.టీ.ఆర్ పుండరీకుడుగా నటించిన పాండు రంగ మహత్యంలోనిది. కానీ పాట చిత్రీకరణ మాత్రం మహా నటుడైన కస్తూరి శివరావు మరియు బాలకృష్ణ (ఇప్పటి హీరో బాలకృష్ణ కాదు, హాస్య నటుడు బాలకృష్ణ) మీద చిత్రీకరించడం జరిగింది. ఈ పాట ఎందుకు ఆదరణకు నోచుకోలేదో నాకర్థం కాదు. ఈ పాత పాట సాహిత్యం కోసం ఎన్నో చోట్ల వెతికాను. www.oldtelugusongs.com లో కూడా “సన్నుతి సేయవే మనసా…” పాట ఉంది తప్పితే, ఇది కాని “అమ్మా అని అరచినా…ఆలకించవేమమ్మా” పాటకానీ లేదు.ఎక్కడెక్కడో వెతకడం, ఎవరో ఈ పాట upload చేసేంతవరకు వేచి ఉండడం దండగ అనిపించి, నేనే ఈ సినిమా DVD కొనేసి, ఒకటికి ఇరవై సార్లు పాట విని లేఖిని సహాయంతో సాహిత్యాన్ని బ్లాగేశా. ఎంతో పెద్ద పెద్ద పుస్తకాలలో చెప్పిన తత్వాన్ని చాలా తేలికకగా కొన్నే లైన్లలో చెప్పిన రచయితకు నిజంగా నా ప్రణామాలు. సాహిత్యాన్నైతే బ్లాగా కానీ గాయకుల గొంతులోని మాధుర్యాన్ని కానీ, సంగీతంలోని కమ్మదనాన్ని గానీ ఆస్వాదించాలంటే, ఈ సినిమా చూడాల్సిందే.

ప్రకటనలు

4 వ్యాఖ్యలు

  1. అద్భుతం, అత్యద్భుతం, మహాద్భుతం, పరమాద్భుతం… ఇంక పదాలు దొరకడం లేదు.

  2. ఈ క్రింది పాట కూడా చదవండి..మీకు తప్పక నచ్చుతుంది
    https://gsnaveen.wordpress.com/2006/08/18/కన్యాశుల్కం/

  3. its simply tells what life is! all quarrles in the world ends

  4. avunu. nijame. chaalabaguntundi ee pata. kani vichitram emitante aakshaname aa vairagyam. taravata mamule.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: