కొన్నిఅంతే

1) చేయ్యి ఖాళీ లేనప్పుడే వీపు దురదపెడుతుంది
2) రాంగ్ నంబరుకి ఎప్పుడు పోన్ చేసినా ఎంగేజే రాదు, అవతలి వాళ్ళు ఠక్కున పోన్ తీసుకొంటారు
3) తొమ్మిది ప్రశ్నలు చదివి పదోది వదిలేస్తే,పరిక్షలో అదే ప్రశ్న అడుగుతారు
4) చెయ్యిలో నుంచి జారిన రూపాయి, ఎప్పుడు సులువుగా అందని చోటే పడిపోతుంది
5) నుంచున్న క్యూ త్వరగా కదలట్లేదని పక్క క్యూకి వెడితే,మొదటిదే వేగంగా కదులుతుంది
6) స్నానానికీ, టాయిలెట్కి ఎప్పుడు వెడుతామో అప్పుడే మనకు ఫోన్ వస్తుంది. (ఇప్పుడు సెల్ ఫోన్లతో ఈ సమస్య కొంత తీరింది లెండి)
7) టీవీలో ఇష్టమైన సినిమా వస్తూన్నప్పుడే కరెంటు పోతుంది.
8 ) సమాధానం తెలియనప్పుడే క్లాసులో జవాబు చెప్పే ఛాన్స్ వస్తుంది.
9) ఆఫీసుకి ఎప్పుడు ఆలస్యంగా వెడతామో ఆ రోజే బాసు తప్పకుండా మన కన్నా ముందొచ్చేస్తాడు
10) ఇల్లు విడిచిన తర్వాతే, మనకు తీసుకెళ్ళాల్సిన వస్తువులు గుర్తొస్తాయి

ఇలాంటివి మీ అనుభవంలో కోకొల్లల్లు ఉంటాయి. సరదాగా వాటిని మీ ఫెల్లో బ్లాగర్లతో పంచుకోండి.

ప్రకటనలు

3 thoughts on “కొన్నిఅంతే

 1. నిజానికివేవీ నిజాలు కాదు.
  “తగిలిన వేళికే తగులుతుంది” అనే సామెత కూడా వుంది.
  నిజమేంటంటే తగలని వేలికి తగిలినప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోతాం, అదే తగిలిన చోట తగిలినప్పుడు బాధ ఎక్కువ గనుక వెంటనే అయ్యో అక్కడే మళ్ళీ తగిలిందే అని ఆశ్చర్యపోతాం.
  అలాగే ఎన్నోసార్లు రాంగ్‌నంబరుకు చేసినప్పుడు ఎంగేజ్ వచ్చి వుండవచ్చు కానీ అప్పుడు అది రాంగ్‌నంబర్‌కు వెళ్ళిందనే విషయమే మనకు తెలియదు.
  అలాగే ఎన్నో చదివిన ప్రశ్నలున్నా చదవని ప్రశ్న వచ్చిందని మాత్రమే మనం గుర్తు పెట్టుకుంటాం.

  అలాగే మిగతావీ.

  –ప్రసాద్
  http://charasala.com/blog/

 2. ప్రసాద్ గారు చెప్పింది లాజికల్ గా నిజమే కావొచ్చు కాని, నిజ జీవితంలో ఇలా ప్రతి ఒక్కరు ఫీల్ అవకుండా ఒక్కసారి కూడా ఉండరు. అందుకే నాకు ఈ లిస్ట్ బాగా నచ్చింది. ఇలాంటివే మరి కొన్ని.
  1.మనకి బాగా ఆకలేసినప్పుడే సమయానికి ఇంట్లో తినడానికి ఏమీ వుండవు.
  2.ఎన్ని పెన్నులు ఇంటి నిండా ఉన్న, సరిగ్గ రాసే అవసరం వచ్చినపుడు ఒక్కటీ కనిపించి చావదు.
  3.కావల్సిన బస్ కోసం ఎదురు చూస్తుంటె అది తప్ప అన్నీ వస్తాయి
  4.మనం పనిలో ఉన్నపుడు మంచి పాటలు వినిపించే రేడియో, తీరిగ్గా ఉన్నపుడు ప్రశాంతంగా విందాం అంటే అన్నీ డొక్కు పాటలే వస్తాయి ఎంటో!!
  5.వరసగా రోజూ కరంట్ పోతోంది కదా అని కొవ్వొత్తి, అగ్గి పెట్టె దగ్గర పెట్టుకున్న రోజు చచ్చినా కరంట్ పోదు

 3. దీనికే ఇంగ్లీష్ లో ఓ పదం ఉంది, resistentialism (అంటే మనకు అవసరమొచ్చినప్పుడే వస్తువులు ఠక్కున ఎదురుతిరుగుతాయని చెప్పడమ్మన్నమాట )

  నవీన్ గారు, బాగా రాసారులెండి. ప్రసాద్ గారి తర్కం కూడా నాకు నచ్చింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s