జంధ్యాల మెచ్చుతునకలు

“మనిషి జీవితం బాధల, సమస్యల మయమై ఉంటుంది. అలాంటి మనిషి థియేటర్‌కు వచ్చినపుడు అతనికి కాస్త నవ్వులు పంచి నవ్వించాలన్నదే నా ధ్యేయం. అందుకే నేను ఎక్కువగా హాస్యరస ప్రధానమైన చిత్రాలు రూపొందించడానికే ఇషపడతాను. రచయితగా నేను హాస్యమే రాశాను. దర్శకుడగా హాస్యాన్నే పంచుతున్నాను. అయితే హాస్యం రాయడం, హాస్య చిత్రాన్ని రూపొందించడం చాలా కష్టమైన పనులు. కొంచెం శృతి మించితే హాస్యం అపహాస్యమవుతుంది. హాస్యానికి, అపహాస్యానికీ మధ్య రేఖా మాత్రమైన భేదం మాత్రమే ఉంటుంది. నేను నా శక్తివంచన లేకుండా హాస్యాన్ని హాస్యంగా ఉంచడం కోసమే ప్రయత్నిస్తున్నాను…” ఇవి ఎవరి మాటలో అందరికీ అర్థమయ్యే ఉంటుంది.

నవ్వడం భోగం
నవ్వించడం యోగం
నవ్వకపోవడం రోగం

అంటూ తెలుగుచిత్ర సీమలో 1976 నుంచి 2000 వరకూ రారాజుగా వెలిగిన నవ్వులరాజు జంధ్యాల వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్యశాస్త్రివి! ఆయనకి రచయితగా మూడువందల యాభై చిత్రాలు, దర్శకుడిగా 39 చిత్రాలు ఆయన సృజనాత్మకతకు శాశ్వత చిరునామాలుగా నిలిచి వెలుగుతున్నాయి. నవ్వుకోసమే జీవించిన జంధ్యాల… మెచ్చుతునకల్లాంటి ఎన్నో హాస్యగుళికలు అందించారు. వాటిల్లో జీవిత సత్యాలు, బోలెడు ప్రాసలు, సినిమా నటీనటులకు సంబంధించినవి… ఎన్నో ఉన్నాయి. తెనాలి రామలింగ కవి హాస్యాన్ని పోలిన హాస్యోక్తులు మనకు ఎన్నో కనిపస్తాయి.

* ఆ నవ్వేమిటమ్మాయ్… ఆడపల్ల కాలు గడపదాటకూడదు. నవ్వు పెదవి దాటకూడదు… తెలుసా? కారణం లేని నవ్వు, తోరణం లేని పందిరి, పూరములని బూరె పనికి రాదన్నాడు శాసకారుడు. మీకివమి తెలియవు! మీ ఇంగ్లీషు బళ్ళలో లింకన్ ఎప్పుడు పుట్టాడు? డంకెన్ ఎప్పుడుచచ్చాడు! ఇవే తప్ప… రాముడవరు, కృషుడవరు ఇవి చెప్పి తగలడరు!

* గత దశాబ్దంగా తమ ఒంపు సొంపులతో, ఆటపాటలతో ఆంధ్ర పేక్షకుల గుండెకాయల్ని వేరు శనక్కా యల్లా తినేస్తున్న సోదరీమణులు జ్యోతిలక్ష్మి, జయమాలినిల గురించి మనం చెప్పుకుందాం… ఈ సోదరీమ ణులిదరూ ఆంధ్రులపాలిట ఇషదవాలు. ఆవకాయ, గోంగూర లాంటివారు. ఈ పచ్చళ్లలో ఏదో ఒకటి లేనిద్ద్టే ఎౖ తెలుగువారి భోజనం ఎలా ఉండదో, వీరిదరిలో ఏ ఒక్కరెనా లేకుండా తెలుగు సినిమాయే అసలు ఉండదు.

* భర్త భార్యను ప్రేమించే పదతికి, భార్యభర్తను వేధించే పదతికి సరెన నిర్వచనం నా కవితారూపంలో ఇస్తా…

పెళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క
ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లంచక్క-నీ పీక నొక్కో

* పన్నెండళ్ల దాకా ఆడది ఇండియా లాంటిది అందరూ ఎత్తుకుని ముద్దు పెట్టాలనుకుంటారు పన్నెండు నుంచి పదనిమిది దాకా ఆడది అమెరికాలాంటది ప్రతివాడు ఆ అందాన్ని అందుకోవాలని, పొందాలని చూస్తారు. 18 నుంచి 40 దాకా ఆడది ఇంగ్లాండ్ లాంటిది దూరం నుంచి చూసి ఆనందిస్తుంటారు 40 నుంచి 60 దాకా ఆడది ఆఫ్రికా లాంటిది చూడగానే జడుసుకొని పారిపోతారు!

* కృష్ణ గోదావరుల్లో ప్రవహించది నీరుకాదు, కన్నీరు… కట్నమిచ్చుకోలని కన్నెపలల కన్నీరు.

* ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను. “క”తో ఇస్తా ఏకాకి… కాకీక కాకికకాక కోక… ఆ కాకీక కాకికి కాక కోకికా కుక్కకా…!? ఇందులో 24 “క”లున్నాయి… ఎలా ఉంది?

* పోనీ ఇంకోటిస్తా… “న” మీద
నాని నాని… నీనూనె నీనూనె నానూనె నూనె… నేనై నేను నీనూనె నా నూనేనని, నానూనె నీనూనననీఎ నిన్న నేనన్నానా ..నోనో.. నేన్నానా నున్నని నాన్నా… నెననై…ఇందు లో 56 ‘నాలున్నాయి లెక్కచూసుకో కావాలంటే.

* మొక్కుబడకి బుక్కులన్ని చదివినా కుక్కగొడుగు మొక్కలా, చెదలు కొటేసన చెక్కముక్కలా, కుక్కపీకేసన పిచ్చిమొక్కలా, బిక్కుమొహం వేసుకుని, వక్కనోట్లో కుక్కుతూ బొక్కుతూ డెక్కుతూ చుక్కలు లెక్కపెడుతూ, ఇక్కడే ఈ ఉక్కలో గుక్కపెట్టి ఏడుస్తూ, ఈ చుక్కల చొక్కా వేసుకుని డొక్కు వెదవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపనుగులా చక్కిలాలు తింటూ, అరటి తొక్కలా, ముంగిట్లో తుక్కులా, చిక్కుజుట్టు వేసుకుని ముక్కు పొడి పీలుస్తూ, కోపం కక్కుతూ, పెళ్లాన్ని రక్కుతూ, పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కినక్కి ఈ చెక్కబల్లమీద బక్కచిక్కి ఇలా పడుకోకపోతే ఏ పక్కకో ఓ పక్కకు వెళ్ళి పిక్క బలం కొద్ది తిరిగి, నీడొక్క శుద్దితో వాళని ఢక్కాముక్కీలు తినిపంచి, నీలక్కు పరీక్షించుకుని ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకొని, ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి. ఇందులో 56 ‘క్కా లు ఉన్నాయి తెలుసా?

* శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహారాజు, కళా హృదయుడు తన మహామంత్రికి ‘అప్పాజీ’ అని పేరు పెట్టు కున్నాడంటే.. అప్పు ఎంత విలువనదో గ్రహించండి. ఇంగ్లీష్‌లో కూడా ‘డౌన్’ కంటే ‘అప్’ ఉన్నతమైన కాదా?

* మన భారతదశం చేసన పనే మనమూ చేయటం తప్పు కాదుకదా… మనదశం అహింసను పాటిస్తే మనమూ పాటిస్తాం. మనదశం క్రమశిక్షణ పాటిస్తే మనమూ అనుసరిస్తాం. ఇప్పుడు మనదశం ఏం చేస్తోంది? పరాయి దేశాలనుంచి వీరలెవల్లో అప్పులు చేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకు హెచ్చొ మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటది భారతదశం అయితే రెండోది బెల్జియం. అంచేత అప్పు చేయటీం తప్పు చేయటం కాదు. అసలా మాట కొస్తే అప్పుచయటం భారతీయుడి జన్మహక్కు, ప్రథమ కర్తవ్యే మూనూ…. ఏషియాడ్‌లో మన గుర్తు గున్నాఎనుగు పేరు ఏమిటి? ‘అప్పూ’… మన వెజాగ్‌లో ఉన్న సింహాచలం దేవుడి పేరు ఏమిటి? సింహాద్రి “అప్ప”న్న.

* డబ్బు పెరిగినా, జబ్బు పెరిగినా ఆ తేడా ముఖంలోనే తెలుస్తుంది.

* ఫస్ట్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ది లాస్,ట ఇన్ బిట్వీన్ టు జీరోస్ అంటే ఏమిటో చెప్పండి? ఫస్ట్‌లో మొదటి అక్షరం ‘ఎఫ్’, లాస్‌లో మొదటి అక్షరం ఎల్. ఇన్ బిట్వీన్ ట్టూ జీరోస్ అంటే ఫూల్!

* కుంతీ సెకండ్ సన్ బూన్… అదే భీమవరం… గారెన్‌కర్రీ… అదేనమ్మ తోటకూర

* ఈ మధ్య నేను కొన్ని కవితల్ని వ్రాశాను. మచ్చుకి ఒకటవిస్తాను వినండి.

”ఆకాశం రంగు నీలంగా ఎందుకుంటుంది?
ఎర్రగా ఉంటే బాగుండదు కనుక…
రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది?
నీలంగా ఉంటే బాగుండదు కనుక…
మలెతలగానే ఎందుకుంటుంది?లేల
నల్లగా ఉంటే బాగుండదు కనుకా
-ఇదివిన్నాక కూడా నేనెందుకు బ్రతికే ఉన్నాను
నాకు చావు రాలేదు కనుక!

ఇటువంటి హాస్యోక్తులు, ఛలోక్తులు, పేరడీలు, ప్రాసలు వందలకొద్దీ రాసిన జంధ్యాల రచయితగా ఎంత విజయం సాధించారో దర్శకుడిగానూ అంతే ఘనవిజయం సాధించారు.

ప్రకటనలు

17 వ్యాఖ్యలు

 1. నవీన్- జంధ్యాల గురించి చాల చక్కగా రాశారు.
  మీ గురించి ఒక page create చేసి అందులో రాయండి.

 2. జంధ్యాల గురించి మంచి విష్యాలు తెలియబర్చారు.
  చాలా బాగుంది.
  –ప్రసాద్
  http://charasala.com/blog/

 3. జంధ్యల గారి హాస్య చిత్రాల తో పాటూ అందించిన “ఆనందభైరవి” కూడా మరిచి పొలేని సినిమా.

  జంధ్యాల గారు మన మధ్య లేరని తెలిస్తే గుండే కల్లుక్కుమంటుంది. ఈ మధ్య వచ్చే వెకిలి చేష్టలు, వికారపు సినిమాలు చూస్తే అది మరింత రెట్టింపవుతుంది. ఆయన పరిచయం చేసిన హాస్య నటులెవరూ కూడా ఆయన అభిరిచులకు తగ్గట్టుగా నడుచుకోకపొయినా ఇలాంటి కంపు సినిమాల నెందుకు ఒప్పుకున్నారబ్బా అనిపిస్తుంది.

  నవీన్ గారు, జంధ్యాల విషయాలినందులో పొందు పరిచి నందుకు మీరు చాలా అభినందనీయులు.

  విహారి
  vihaari.blogspot.com

 4. ఏమి చేద్దామండీ, మళ్ళీ మళ్ళీ పాత సినిమాలు చూడటం తప్పితే, ఆ స్థాయిలో ఉండే కొత్త సినిమాలేవి? ఈ మధ్య ఒక కొత్త సినిమా పేరు విన్నా..”పోరంబోకు”. మీరు సరిగ్గానే చదివారు ఆ సినిమా పేరు పోరంబోకు. ఇడియట్, స్టుపిడ్, పోకిరి చాల్లేదు కాబోలు. ముందు ముందు “దొంగ నా కొడుకు”, “అష్ట దరిద్రుడు”, “ముష్టి జాతకుడు”, “బేవార్స్” లాంటి పేర్లు పెట్టినా ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.
  – naveen

 5. చాలా మంచి వ్యాసం. ఒకసారి మళ్ళీ నవ్వుకున్నాం. మరోలా భావించద్దు- చాలా ‘రాళ్లు’ (అక్షర దోషాలు) ఉన్నాయి కొద్దిగా సవరించండి.

 6. జంధ్యాల గురించి మంచి విష్యాలు తెలియబర్చారు.
  thanks

 7. చాలా బాగా రాశారండీ. “శ్రీవారికి ప్రేమలేఖ” సినిమాలో శ్రీ లక్ష్మిగారు అందరినీ సినిమా కథలు చెప్పి బెదరగొడుతుంటారు.. అందులో ఒక సందర్భంలో ఒక సస్పెన్స్ సినిమా అని చెబుతారు. సినిమా మొదలయ్యాక, “శుభం” కార్డు పడుతుందిట. సినిమా కథ ఏంటా అని అందరూ సస్పెన్స్ లో ఉంటారుట. మీ టపా చదవగానే, నాకు ఈ సీన్ గుర్తు వచ్చింది. అసలు ఆ సినిమా సూపర్. ఎన్ని సార్లు చూసినా, మళ్ళీ మళ్ళీ చూడాలనే ఉంటుంది. గుర్తు తెచ్చినందుకు ధన్యవాదాలు. :)

 8. బాగుంది. జంధ్యాల రాసిన హాస్య సంభాషణలు పండి నవ్వులు వెదజల్లడానికి సరైన నటులు ఆ సమయంలో తెలుగు తెరకెక్కడం కూడా ఒక కారణమనుకుంటా, సుత్తి వేలు వీరభద్దరావుల ద్వయం, శ్రీలక్ష్మి, చివర్లో కోట శ్రీనివాసరావు, ఇత్యాదులు.. ఆనందభైరవి సినిమాలో పుచ్చాపూర్ణానందం అనే వృద్ధుడు చాలా ఏళ్ళ విశ్రాంతికి విశ్రాంతినిచ్చి తిరిగి నటించడం, రుసరుసలాడుతుండే గిరీష్ కార్నాడ్ పాత్రకి తండ్రిగా అనుక్షణం నవ్వుతూ నవ్విస్తూ అద్భుతంగా చేశారు. ఆ సినిమాలో నటించిన కొద్ది కాలానకే ఆయన పోయినట్టు గుర్తు.

 9. Excellent..jandhyala aa peru vinnna anna ventane mokham meeda navvu vastundi.that is JANDHYALA.enta cheppina takkuve.alanti vyakti marala raaru.aa mahanuchavunaki satakoti namaskaramulato…(nenenta,samudram lo neeti bottanta) chaitanya.

 10. jandyala…. telugu vaariki labinchina oka aanimuthyam………

 11. YOU ARE GIVEN VERY BEAUTIFUL INFORMATION AND FRESH UP THE MAIND & BODY.

  THANKING YOU

 12. నిజంగ జంధ్యాల గారి హస్యపు జల్లులతో హ్రుదయం పులకరించిపొతుంది.ప్రత్యెకించి వారు చెసినన్ని ప్రయోగాలు తెలుగు చిత్రసీమలో యెవరూ చెసుంఢరు.బహుశ భార్యల అమాయత్వపు పనులు యేవిదంగ నవ్వు తెప్పిస్తాయొ యెంతొ అద్భుతంగా చిత్రీకరించారు.మీరు ఆ మహా వ్యక్తిని తలుచుకోవటం అభినందనీయం.

 13. he is gretest dricter and writer.he is comedy king in film industry

 14. Jandhyala is God’s gift to Telugu cinema. He is unparallelled in his humour. With him fresh and clean humour has vanished from Telugu movies. He is immortal in his works. My his soul rest in peace

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: