గడచిన కాలం..గోడకు సున్నం

కాలం…చానా చిత్రమైనది. నన్ను సరిగ్గా ఉపయోగించుకోవడం నీ వల్ల కాదోయి అని ఎప్పుడూ మనకు సవాలు విసురుతుంది. ఈ సవాలులో చాలా మందిది ఎప్పుడూ ఓటమే. జీవితంలో ఏ సమయం ఎలా గడపాలో అలా గడపము…అదే సమయం గడచిపోయిన తరవాత దాని గురించి భాధపడతాము.
చిన్నప్పుడు కారు బొమ్మలతో ఆడుకోవాలని చాలా ఆశగా ఉండేది. నా స్నేహితుడి మామయ్య ఎక్కడ నుండో వానికి కారు బొమ్మలు తెచ్చాడు. ఆ కార్లు పట్టుకొని కొద్దిగా వెనక్కి లాగితే..జుయ్య్య్ మని ముందరికి దూసుకెళ్ళేది. ఆ కార్లను వాడు తప్ప ఎవ్వరినీ తాకనిచ్చే వాడు కాదు. అది చూసినప్పట్టి నుండి నాకు ఆ కార్లు కావాలని విపరీతమైన ఆశ, కానీ తల్లి తండ్రులతో కొనివ్వమని అడగాలని తెలియదు. మా నాయన ఏది కొనిస్తే దానితో ఆడుకోవడమే…కిమ్మనే వాడిని కాదు. కానీ లోపల వాటితో ఆడుకోవాలన్న ఆశ మాత్రం చాలా ఉండేది. ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పలేదు. ఎవరైనా కారు బొమ్మలతో ఆడుకొంటూంటే చాలా అసూయగా ఉండేది. నా వయసు పెరిగే కొద్దీ ఆ కోరిక నాలోనే సమాధి అయిపోయింది.
ఈ మధ్యే ఒక స్నేహితుని పాప కోసం బొమ్మలు తేవడానికి ఒక షాపింగ్ మాల్ వెళ్ళాను. ఎన్ని రకాల బొమ్మలో…అన్నీ ఆటోమేటెడే …. ఆడేటివి ..పాడేటివి..పరిగెత్తేవి..గెంతేవి..ఎగిరేవి…చిత్రమైన చేష్టలు చేసేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత…ఎప్పుడో సమాధైపోయిన ఆ కారు కోరిక మళ్ళీ గుర్తొచ్చింది. ఏమి లాభం…ఇప్పటికే ఒక జీవితకాలం లేటైపోయింది. ఇప్పుడు అలాంటి కార్లు వెయ్యి కొనగల్ను..కానీ అదే ఆనందం పొందుతానన్న నమ్మకం నాకు లేదు. ఏ వయసులో కోరిక ఆ వయసులో తీరిపోతేనే అనందం. ఎవరికైనా ఇది చాలా చిన్న విషయంగా సిల్లీగా అనిపించవచ్చు…కానీ చాలా దుఃఖం వేసింది. కోరికున్నప్పుడు కార్లు లేవు….కార్లున్నప్పుడు కోరిక లేదు. అలాగే ఇంకా ఎవేవో కోరికలుండేటివి..వర్షంలో నీటి గుంటలలో దూకాలని..ఇసుకలో పొర్లాడాలని..తూనిగల్ని పట్టుకోవాని..మా ఇంట్లో ఉన్న నీటి తొట్టే లో మునకెలెయ్యాలని…. ఇప్పుడు నేను గుంటల్లో దూక గలనా? ఇసుకలో పొర్లగలనా? అలా చేస్తే..బ్యాక్టీర్యా చే ఇన్ఫెక్షన్ వస్తుంది …జబ్బు చేస్తుంది అన్నంతగా విఙ్ఞానం సంపాదించాను మరి, ఎలా చెయ్యగలను? ఒక వేళ చేస్తే..నన్నో మెంటల్ కేసుగా ముద్రెయ్యటం ఖాయం.

       ఏది ఏమైనా…కాలాన్ని సద్వినియోగపరచుకుని..సదా ఆనందంగా ఉండే వారు ధన్య జీవులు.

ప్రకటనలు

8 thoughts on “గడచిన కాలం..గోడకు సున్నం

 1. నాక్కూడా వాచీ కోరిక ఉండేది

  అదేమిటో గానీ నాకు డబ్బులు వచ్చిన తర్వాత కొన్న ఏ వాచీలూ రెండు నెలల కన్నా ఎక్కువ నా దగ్గర ఉండట లేదు :(

  అదృష్టం లేదు, వ్యామోహం ఉండకూడదు అని సర్దిచెప్పుకొని వాచీ పెట్టుకొవడమే మర్చిపొయినాను

 2. అబ్బ ఏం చెప్పారండి. నాకూ ఇలాంటి అనుభవాలు ఎన్నో. చెప్పుకోగలిగేవి కొన్ని, చెప్పలేనివి (చెప్పుకోలేనివి) కొన్ని. ఆలాంటివి అన్నీ గుర్తుకు వచ్చాయి.
  ఇది ఇంతే, అది అంతే అని సరిపెట్టుకోవడం తప్ప ఏం చెయ్యలేం. గడిచిన కాలాన్ని తేలేము కదా.

 3. నిజమే కదా గడిచిన కాలం మళ్ళి తితిగి రాదు కదా..దాన్నే చూస్తూ ఉంటే ఉన్న ఈ నిమిషం కుడ వెళ్ళిన ఆ నిమిషం తో చేయి కలుపుతుంది కదా.. అందుకే ఇప్పటికైనా ఏదైన కోరికలు ఉంటే తీర్చేసుకుంటే పోలే :)

 4. అంతే మరి. మీలాగే నాకూనూ shoes వెయ్యాలని తెగ ఆరాటం వుండేది నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో. అదేదో ఒక GK మాసపత్రికలో క్విజ్ సరిగ్గా పూరిస్తే shoes ఇస్తామంటే ఎన్నోసార్లు పూరించి పంపాను కానీ కోరిక తీరలేదు.
  ఇప్పుడిక వెయ్యి షూలు కొనగలిగినా చెప్పులు కొనాలనే కోరిక కూడా లేదు.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 5. నిజమేనండి.ఇలాంటి చిన్న చిన్న కోరికలు అందరికి ఉంటాయి కాని తీర్చుకునే అద్రుష్టం అందరికి ఉండదు.అది ఆర్ధిక ఇబ్బందుల వల్లనో లేక తల్లిదండ్రులుకు తమ కోరికలు చెప్పుకునే స్వతంత్ర్యం లేకనో ఏదైనా కావచ్చు.మీరు చెప్పిన సంగతి వింటుంటే సారీ చదువుతుంటే అలా తీర్చుకోకుండా మిగిలిపోయిన ఎన్నో కోరికలు గుర్తుకువచ్చాయి.

  శ్వేతరామచంద్ర

  http://swetharamachandra.blogspot.com

 6. నాకు చిన్నప్పటి నుండి టేపు రికార్డరు, వాక్‌మన్ అంటే మహా పిచ్చి. ఎక్కడ షాపులో కనిపించినా బిచ్చపోడిలా చూస్తుండే వాడిని. చివరకు ఒక రోజు మా నాన్న ఖరీదయినది ఒకటి కొనిచ్చి నన్ను ఆనందపరిచాడు.. నా ఆనందం వర్ణించలేను. ఆ తరువాత కారు పిచ్చి ఉండేది. ఈ మోటారు సిటికి (డెట్రాయిటు) వచ్చిన తరువాత ఆ కోరిక కూడా తీరిపోయింది….

 7. పిల్లల పేరు మీద మనం కొన్ని (అన్నీ కాదు :)) ) సరదాలు ఇప్పడు కూడా తీర్చుకోవచ్చు. నేనైతే మా అబ్బాయికోసం బ్లాకులూ, కార్లూ కొని నేను కూడా ఆడుకుని సరదా తీర్చుకున్నా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s