ఎవడ్రా..మమ్మల్ని భూబకాసురులన్నది ?

చూడు బాబూ…
నీ దగ్గర పెన్నుంటే నా దగ్గర గన్నుంది.
నీ దగ్గర మైకు గొట్టం ఉంటే నా దగ్గర తుపాగ్గొట్టం ఉంది.
నీ దగ్గర భూమి లేదు- నాదగ్గరుంది.
నా దగ్గరున్నదేదో ఇస్తా. పుచ్చుకుని కెమెరా మూసుకో.
నువ్వు మూసుకున్న కొద్దీ నా మనసు తెరుచుకుంటుంది.

సరేనా, ఏంటీ? అలా అవునో కాదో చెప్పకుండా ఏంటా మొహం? అసలు నేను ఇన్ని వేల ఎకరాలు ఎలా సంపాదించానో తెలుసా… చెబుతా విను.

దేశానికి మనమేమిచ్చామనేది కాదు, దేశం మనకేమిచ్చిందనేది ముఖ్యం. అలాగే తెలుగుదేశం నాకేమిచ్చిందనేది నాకు ముఖ్యం. ఏమీ ఇవ్వలేదు. మరి మా పార్టీ అలాంటిది కాదు. జనం దానికి అధికారమిస్తే, మా అధినాయకులు మాకు అవకాశమిచ్చారు. ఆ రకంగా చూస్తే జనమే మాకు అవకాశమిచ్చినట్లు లెక్క. ప్రజాస్వామ్యమంటే ఇదే. ప్రజలు కోరుకున్నది మా పార్టీ వాళ్ళంతా బాగుపడాలని. ఎన్నికల్లో తీర్పుని అర్థం చేసుకోకుండా మేమేదో తినేశాం, బకాసురులం అంటూ అరిచి గీపెడితే… ఊరుకోం. తింటూనే ఉంటాం.

భూ బకాసురులా? బకాసురుడన్నావ్‌ కాబట్టి చెబుతున్నా. నీకు రెండు ఫుల్‌మీల్స్‌ పెట్టిస్తా. తింటవా… తింటే చస్తావ్‌. మరి బకాసురుడో… తినకుంటే చస్తాడు. నేను బకాసురుణ్ణని నువ్వే చెప్పావుగదా? నేను తింటే చస్తనా, తినకుంటే చస్తనా? ఐపాయె. అందుకే తిన్న. దీనికోసం ఏందయ్యా ఈ రాద్ధాంతం? తిండిగలిగితె కండగలుగునోయ్‌, కండగలవాడేను మనిషోయ్‌… వినలేదా? మనిషిగ బతికేందుకే గదా ఈ తినుడు. తినకుంటే చస్తా. మనిషిగా చావమంటావా, బకాసురుడిగా బతకమంటావా?

మా పార్టీ ఒక్కటే కాదు. అందరూ చెప్పేదొకటే. కాబట్టే ‘భూమి కొరకు, భుక్తి కొరకు’ అన్నారు. నేను చేసేదీ ఉద్యమమే. నాదీ భూమి కొరకు, భుక్తి కొరకు సాగుతున్న ఉద్యమమే. మా నాయకులు, వాళ్ళ బంధువులు, దోస్తులు అందరూ చేస్తున్నది దోపిడీ కాదు… ఉద్యమం! ‘ఈ నేలెవడిదిరా… ఈ చెట్టెవడిదిరా…’ అంటూ మేం అక్కడున్న జనానికి విమోచన కల్పిస్తున్నాం. నేలను నమ్ముకున్న రైతులు మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ‘మరొక్క రైతు కూడా మా పాలనలో ఆత్మహత్య చేసుకొనే అవకాశం లేకుండా చేస్తామ’ని ఎన్నికల్లో చెప్పాం. మాట తప్పడం మాకు అలవాటు లేదు. గిట్టుబాటు కాని వ్యవసాయాన్ని, భూమిని నమ్ముకుని అన్నదాతలు కుమిలిపోతుంటే… వారిని రక్షించే మార్గమేమిటి? ఈ ఆలోచన… ఈ ఆలోచనే నన్నూ, మా పార్టీ వాళ్ళందర్నీ మేల్కొలిపింది. అందుకే… గిట్టుబాటుకాని వ్యవసాయం నుంచి రైతును వేరు చేస్తున్నాం. బువ్వ పెట్టని భూమి నుంచి రైతును ఇవతలకు ఈడుస్తున్నాం. ఇది రైతును బతికించే ఆలోచన కాదా? భూ పరిమితి చట్టాలున్నాయని యాభైనాలుగెకరాలే మేం తీసుకుంటే… రాష్ట్రంలోని మిగతా రైతులకు న్యాయం ఎలా జరుగుతుంది? ఉద్దేశాన్ని బట్టి మినహాయింపులుండాలి. మేం వేల ఎకరాలు కొనడం రైతు బాగుకేగదా? మీ కళ్ళకు ఇలాంటి కోణాలు కనిపించవా? మీ మనసుకు ఇలాంటి ఆలోచనలు తట్టవా? ‘దున్నే వాడిదే భూమి’ అనే అరుపులు బూజుపట్టి పోయినా… ‘కొనే వాడిదే భూమి’ ‘తినే వాడిదే భూమి’ అనే నినాదాలు పిక్కటిల్లుతున్నా మీకవి వినిపించడంలేదా?

మాది ప్రాథమిక హక్కులకు పెద్దపీట వేసే పాలన. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదు. కాబట్టి మేం ఎవరి ప్రాథమిక హక్కులకూ భంగం కలిగించడం లేదు. ఏనుగును పోషించలేనివాడి దగ్గర ఏనుగు ఉంటే ప్రయోజనమేమిటి? అలాగే, సొమ్ము చేసుకోవడం చేతగాని వాడిదగ్గర భూమి ఉండీ ఏం ప్రయోజనం? శమంతకమణి సత్రాజిత్తు దగ్గర ఉంటే మేలా, శ్రీకృష్ణుడి దగ్గర ఉంటే మేలా? నేలను నమ్ముకున్నవాడు తెలివైన వాడా, అమ్ముకునే, కొనుక్కునే, లాక్కునే విద్య తెలిసినవాడు తెలివైన వాడా? రాజ్యం వీర భోజ్యం కదా? భోజ్యం చేస్తున్న మా ‘రాజ‘ సంతతిని వీర గంధం పూసి సత్కరించాల్సిందిపోయి… ఏమిటీ యాగీ! ముందే చెప్పా… విను మరోసారి చెబుతున్నా. నీదగ్గర పెన్నుంటే నాదగ్గర గన్నుంది. నీ దగ్గర మైకు గొట్టం ఉంటే, నా దగ్గర తుపాకి గొట్టం ఉంది… రాజాధికారమూ ఉంది.
(రాసింది భూమిక, వేసింది ఈనాడు)

ప్రకటనలు

One thought on “ఎవడ్రా..మమ్మల్ని భూబకాసురులన్నది ?

  1. Dear bhuumika gaaru,
    మీ రచన అద్భుతంగ ఉంది. కాని కొద్దిగనన్న ఆబకాసురులు బుద్ది తెచ్చుకంటారని నాకైతే నమ్మక లేదు.ఎందుకంటే, కొంచెం పద్దతుల్లో తేడావున్నా ఈనాడు యజమానులు చేసింది అదేకదా.బుద్ది చెప్పే స్తానంలో ఉన్నవారు ముందు చాలా బుద్దిగా ఉండాలెగదా.ఐతే తమదగ్గర అలాంటి తప్పులేదనుకోవాలనే మీరు రాసినట్లాంటివికూడా ప్రచురిస్తారేమో.
    ప్రస్తుతానికి ఆసంగతి వదిలేసి మీ రచన విషయానికి వద్దాం.మీరు సంధించిన వ్యంగ్యాస్త్రాలు ఎవరెవరికి తగలాలని అనుకున్నరో వారికన్న తగిలుంటాయా? ఏదేమైనా మీ రచనా కౌశలాన్ని ప్రశంసించకుండ ఉండలేకపోతున్నాను. ఐతే మీ అస్త్రం క్రుతయుగం నాటి క్రుష్ణ పరమాత్మునికి కూడ తగిలినట్లున్నది. క్రుష్ణునంతటోడు శమంతకమణిని యుద్దంచేసి తీసుకోంగలేంది మేం కాస్త రౌడీఇజంచేసి,జబర్దస్తీఇచేసి తీసుకుంటే తప్పేంటి అని భూబకాసురులు అనుకునే అవకాశం ఉన్నట్లు మీకు తట్టలేదా?,లేకుంటే మరో అంతరార్ధం ,వ్యంగ్యార్ధం ఏదైనా ఉందా? ఏమైనా వ్యాసం చదువుతున్నంత సేపు భలే సంతోషం కలిగింది.
    బై.
    రాములు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s