మా తెలుగు తల్లికీ ముళ్ళపూదండ!

‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ … మా కన్నతల్లికీ మంగళారతులు …’ టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ ఆఫీసు ‘జై తెలంగాణ భవన్‌’లో అడుగుపెట్టేసరికి టేప్‌ రికార్డర్‌ నుంచి ఈ పాట మారుమోగిపోతోంది.
‘ఎవడ్రా … ఈ పాట పెట్టిందీ?’ కేసీఆర్‌ గావుకేక పెట్టాడు. అనుచరుడు టక్కున పాట కట్టేసి, కేసీఆర్‌ దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు.
‘నేనే సార్‌! మనం ఎలాగూ తెలంగాణ తల్లి విగ్రహాలు పెడదామనుకున్నాం కదా … తెలంగాణ తల్లి మీద కూడా ఈ రకంగా ఓ పాట కూడా రాసేస్తే ఓ పనై పోతుంది కదా అని ట్రయ్‌ చేస్తున్నా’ విన్నవించాడు అనుచరుడు.
కేసీఆర్‌ మెచ్చుకోలుగా అతడి భుజం తట్టి చెప్పాడు. ‘అయిడియా బాగానే ఉంది గానీ మళ్ళీ మనకి ఆ దిక్కుమాలిన కాపీ బాణీలు ఎందుకూ? మన గడ్డమీద గడపకో కవి, వీధికో మ్యూజిక్‌ డైరెక్టరు ఉన్నారు కదా! వాళ్ళకి ఈ పని అప్పజెబుదాం .. నీకెందుకూ ఆ శ్రమ?” ఇంతలో నరేంద్ర వచ్చాడు. ‘కేసిఆర్‌ గారూ! మన తెలంగాణ తల్లి విగ్రహాల డిజైన్లు రెడీ అయ్యాయి. ఏదో ఒకటి మనం ఇప్పుడు ఫైనలైజ్‌ చేసేస్తే విగ్రహాల తయారీ మొదలై పోతుంది. అవతల కరీంనగర్‌ ఉప ఎన్నిక ముంచుకొస్తోంది. ఆలస్యం చెయ్యకూడదు మరి …’ అంటూ హెచ్చరించాడు.

తల ఊపాడు కేసీఆర్‌. ఇద్దరూ డిజైన్లు పరిశీలించే పనిలో పడ్డారు.
అనుచరుడు వాళ్ళకి చాయ్‌లు అందిస్తూ అన్నాడు. ‘సార్‌! మీరు తెలంగాణ తల్లి విగ్రహాలు పెడతామన్న దగ్గర్నించి మన కేడర్‌లో కొత్త ఉత్సాహం వచ్చిందంటే నమ్మండి. మీరు జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు పెడితే … మిగతా ఊళ్ళల్లో జిల్లా తల్లి విగ్రహాలు పెడతామని పోటీలు పడుతున్నారు. ఉదాహరణకి పాలమూరు తల్లి … వరంగల్‌ తల్లి … కరీంనగర్‌ తల్లి …’
కేసీఆర్‌ అతడి వైపు చిరాగ్గా చూశాడు. అనుచరుడు నోర్మూసుకున్నాడు. ఇంతలో ఒక డిజైన్‌ చూసిన కేసీఆర్‌ కెవ్వుమన్నాడు.
‘ఇదేమిటి? ఈ విగ్రహంలో విజయశాంతి పోలికలు కనిపిస్తున్నాయి…’
‘భలే కనిపెట్టేశారే! అలా గియ్యమని నేనే ఆర్టిస్టుకి చెప్పా!’ కిసుక్కున నవ్వాడు నరేంద్ర. కేసీఆర్‌ మొహం అప్రసన్నంగా మారడంతో నరేంద్ర వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
‘ఎంతైనా విజయశాంతి మన పిల్లే కదా! విగ్రహం అందంగా ఉంటుందని అలా చెప్పా … పైగా ఆవిడ పార్టీ పేరు తల్లి తెలంగాణ కూడానూ …

‘మీకూ, ఆవిడకీ బిజెపి లింకులు ఇంకా ఉన్నట్టున్నాయి. నేను కనిపెడుతూనే ఉన్నాలెండి’ అంటూ కేసీఆర్‌ నవ్వేసి, ఆ డిజైన్‌ను బుట్టలో పడేశాడు. నరేంద్ర మొహం మాడ్చుకున్నాడు. అనుచరుడు మళ్ళీ రంగప్రవేశం చేశాడు. ‘సార్‌ .. మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఎక్కడ పెడదామంటారు? ఇప్పుడున్న తెలుగుతల్లి విగ్రహాన్ని తీసేసి అక్కడే పెడదామంటారా?’ అడిగాడు.
‘ఆ పని మనం తెలంగాణ వచ్చిన తర్వాత చేద్దాం గానీ … ఇప్పుడెక్కడ పెడితే బావుంటుందో నువ్వే చెప్పు’ అన్నాడు కేసీఆర్‌.
‘ఇప్పుడు తెలుగుతల్లి విగ్రహం ఫ్లయ్‌ ఓవర్‌ దగ్గర ఉంది కదా! దాని మూలాన ఆ ఫ్లయ్‌ ఓవర్ని కూడా తెలుగుతల్లి ఫ్లయ్‌ ఓవర్‌ అని పిలుస్తున్నారు. అలాగే మనం కూడా ఏదో ఒక ఫ్లయ్‌ ఓవర్‌ కింద తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టేస్తే సరి … అప్పట్నించి ఆ ఫ్లయ్‌ ఓవర్ని కూడా తెలంగాణ తల్లి ఫ్లయ్‌ ఓవర్‌ అని పిలుస్తారు.’
‘మంచి ఆలోచన’ అనుచరుణ్ణి మెచ్చుకున్నాడు కేసీఆర్‌. అధినేత అలా మెచ్చుకోవడంతో అనుచరుడు ఉబ్బితబ్బిబ్బై మరింత రెచ్చిపోయాడు.
“సార్‌ .. మన తెలంగాణలో మాట్లాడేది తెలుగే కదా! మరి ఆంధ్రా వాళ్ళు కూడా తెలుగుభాషే మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ భాష పేరు మార్చుకోమని డిమాండ్‌ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు ఆంధ్రులు కాబట్టి వాళ్ళ భాషకి ఆంధ్రభాష అని పేరు పెట్టుకోమందాం…’
‘వాళ్ళు ఒప్పుకోరు గానీ అసలు మనం మాట్లాడే భాషని అందరూ తెలంగాణ భాష అంటారు కాబట్టి అసలు మన భాష పేరుని కూడా తెలంగాణ అని మార్చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. మన తెలుగు వేరు … మన యాస వేరు కదా!’

నరేంద్ర విభేదించాడు. ‘ఎందుకైనా మంచిది. ఈ అంశం మీద జయశంకర్‌ గారి నేతృత్వంలో ఒక మేధావుల కమిటీ వేసి వారి నిర్ణయం ప్రకారం నడుచుకుందాం!’ అంటూ ప్రతిపాదించాడు.
‘అసలు తెలుగు వాళ్ళంటే మనమే నరేంద్ర గారూ! తెలుగుని ఒకప్పుడు తెలుంగు అనే వాళ్ళట. ఆ పదం నుంచి వచ్చిందే తెలంగాణ. అంటే తెలుగువాళ్ళు ఉండే నేల అని అర్థం’ విడమర్చి చెప్పాడు కేసీఆర్‌.
అనుచరుడు ఎగిరి గంతేశాడు. ‘మీరలా అంటుంటే నాకో బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది సార్‌! తెలంగాణలో, ఆంధ్రలో, రాయలసీమలో అందరూ తెలుగు వాళ్ళే ఉంటున్నారు కాబట్టి … అసలు ఈ రాష్ట్రం పేరునే మార్చేసి, ఆంధ్రప్రదేశ్‌ బదులు తెలంగాణ అని పేరు పెడితే ఎలా ఉంటుంది? అప్పుడిక ఏ గొడవా ఉండదు … మనకీ తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు ఉంటుంది … అదేమిటి అలా చూస్తున్నారు? తంతారా ఏమిటి కొంపతీసి?’

(కిండల్ కర్త రాజగోపాల్)

ప్రకటనలు

3 thoughts on “మా తెలుగు తల్లికీ ముళ్ళపూదండ!

  1. ఇణ్ణాళ్ళకి వ్యవధి దొరికే సరికి అసలు ఏంటా అని ఈ పోస్టు చదివా…కొంచెం పెద్దది అయ్యింది కాని…క్లైమాక్స్ చాలా బాగుంది..నిజంగా ఈ తెలంగాణా విషయానికి ఇంతకంటే మంచి ముగింపు ఉండదు.!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s