నా బ్లాగుకి బ్రేకులు

అమెరికాలో నేను ఒంటరి అన్న భావన రాలేదంటే దానికి కారణం..మన కూడలి. స్వతహగా నేను ఎక్కువ మందితో కలవను. నా లోకమే నాది.  నన్ను ఏ స్నేహితుడు కలసినా పలకరింపు తిట్లతోనే మొదలవుతుంది. “ఏమిరా మమ్మల్ని మరచిపోయావా, కనీసం mail అన్నా చెయ్యొచ్చు కదరా” అని అడుగుతారు. నేను mail పంపిస్తే తెలుగు గురించే అయ్యుంటుంది. అది చదివే ఓపికా సమయం ఎవ్వరికీ ఉండదు. పంపిన mailకు ఒక్క సమాధానం కూడా రాదు. అందరికీ తెలుగుకు సంభందించిన mail పంపి వాళ్ళను హింస పెడతన్నానా అనిపించేది. కొండొకచో మా అల్లూరి రఘు, ప్రవీణ్ దగ్గర నుండి ఒక అభినందన వచ్చేది. దానికే నాకు చాలా సంతోషం అనిపించేది. ఎందుకంటే..నేను ఇష్టపడ్డ సాహిత్యాన్నో..వ్యాసాన్నో అతను కూడా ఇష్టపడ్డందుకు. ఇక తెలుగు గురించి చర్చింద్దామంటే నా స్నేహితులెవ్వరికీ దాని మీద అంత పట్టింపు లేదు. నలుగురిలోనూ తిరుగుతూ తలలో నాలుకలా వుండటం కూడ ఒక రకమైన అదృష్టం అనిపిస్తూండేది.

మదనపల్లెలో నా గదిలో పడుకొని…చుక్కల సింగయ్య శెట్టి వ్రాసిన “భట్టి విక్రమార్క”, “సహస్ర శిరశ్చేద అపూర్వ చింతామణి కథ”, “విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు” చదువుతూంటే ..ఆ అనందమే వేరు. కానీ అది పంచుకోవాలంటే ఎవ్వరూ కనపడేవారు కాదు.

అమెరికాకొచ్చాక నా పరిస్థితి మారింది. తెలుగు బ్లాగర్లతో పరిచయం ఏర్పడింది. నా లాంటి అభిరుచే ఉన్న స్నేహితులు ఎంతో మంది దొరికారు. కోతికి కొబ్బరి చిప్ప వచ్చినట్లు నాకు ఈ తెలుగు బ్లాగు మరియు కూడలి దొరికాయి. నేను రాసే ప్రతి  మాటను ఎంతో మంది స్నేహితులు చదువుతారు. నిజంగా ఇది కూడలే. మంచి తెలుగు పాటలు గుర్తు చేసేవారు కొందరైతే….కమ్మటి వంటకాలు పరిచయం చేసేవారు మరి కొందరు. చక్కటి కవితల్ని వ్రాసే వారు కొందరైతే..అద్భుతమైన నీతి కథలను పరిచయం చేసే వారు మరి కొందరు. రాజకీయాల్ని తెగనాడే వారు కొందరైతే…జాతీయవాదాన్ని సమర్దించే వారు మరికొందరు.  ఇలా అభిప్రాయాలు, విమర్శలు, విశ్లేషణలు, కథలు, కవితలు, వంటకాలు, సాహిత్యాలతో కూడిన కూడలి నిజంగా మృష్టాన్న భోజనమే.

ఈ రెండు నెలలు తెగ బ్లాగాను. నా పోస్టుల వేగానికి కళ్ళెం పడే రోజొచ్చింది. ఈ వారాంతం బెంగళూరుకి వెడుతున్నాను. ఇక్కడున్న Internet సౌకర్యం, సమయం అక్కడ ఉండవు. అసలు మళ్ళీ బ్లాగును తెరుస్తానో లేదో తెలియదు.

good bye America

ప్రకటనలు

9 వ్యాఖ్యలు

 1. బెంగళూరులో మీ ఉద్యోగరీత్యా సౌకర్యం, సమయం ఉండకపోయినా.. ఏదో కాస్త వీలు చూసుకుని బ్లాగుతారని ఆశిస్తాను. అమెరికాకు చెప్పండి గుడ్‌బై, బ్లాగుక్కాదు. బ్లాగు కౌగిలికి చిక్కి బయటపడగలగడం అంత తేలికా!?

 2. మీరు మీ ఇంటికి కారు చౌకగా ఇంటర్నెట్ పెట్టించుకోవచ్చు మన దేశంలో..పెళ్ళికయినా బ్రేకు వెయ్యచ్చేమో గాని పెదవులకు, పెన్నుకు బ్రేకు ఎప్పుడు వేసే ఆలోచన చెయ్యకండి..ఇది తెలుగు బ్లాగు మిత్రులందరి తరపున నా విన్నపం, సలహా…:-)

 3. పైగా పూతరేకులు కావాలా అని అడిగి, తీస్కోమని చెప్పి, ఊరించి, ఇవ్వనంటే ఎలా? :-)

 4. ఎందుకండి ఎంచగ్గ నిన్న మాట్లాడుకున్నట్టు BSNL broadband పెట్టించుకోండి అంటే బ్లాగటం.

 5. ప్రవీణ్,
  ఒంటరితనాన్ని దూరంచేసిన బ్లాగుమిత్రులను నీకు దూరం చేయగల విఘ్నమేదీ లేదని త్వరలోనే తెలుస్తుంది చూస్తుండు.

  “… ఎందుకంటే..నేను ఇష్టపడ్డ సాహిత్యాన్నో..వ్యాసాన్నో అతను కూడా ఇష్టపడ్డందుకు. …. నలుగురిలోనూ తిరుగుతూ తలలో నాలుకలా వుండటం కూడ ఒక రకమైన అదృష్టం అనిపిస్తూండేది.” — ఇక్కడ కొట్టావ్ దెబ్బ. నేను మెచ్చిన పాట, సినిమా, పుస్తకం ఇలా ఏదైనా మనస్పూర్తిగా తానూ మెచ్చే వ్యక్తి దొరకడం అదృష్టం. ఆ వ్యక్తి భాగస్వామేగనక ఐతే జీవితమే సఫలమూ… రాగసుధాభరితమూ…

 6. ayyo amtamaata anesaremitandi.elagola veelu cuusukuni vastumdamdi.

 7. మీ బ్లాగు పేరే ఒక సంచలనమైందే ! బెంగళూరు వెళ్తున్నారా? అయితే మదనపల్లి కి మా హైదరాబాదు కి కూడా రాకూడదా?

 8. నాకు అత్యంత ఇష్టమైన బ్లాగులలో మీది ఒకటి. బ్లాగడం అసలు తగ్గించరాదు… అనే సామెత మీరు విన్నారు కదా :)

 9. emiti ee anavasaramina sodhi
  edaina upayogapadedi bloggandi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: