నవీనుడేతెంచెను

గత 3 రోజులనుండి నిద్రపోయింది 2 గంటలే. ఎందుకంటారా….బెంగళూరికి వచ్చే ముందు రోజు అపార్ట్మెంటు ఖాళీ చేసి శుబ్రం చేసే సరికి తెల్లారైపోయి సమయం అయిపోయింది. తరువాత 32 గంటలు..4 విమానాశ్రయాలు..3 విమానాలు. అందేమి విచిత్రమో కానీ మదనపల్లె నుండి కల్లూరికి వెళ్ళే ఆర్డినరీ ఎర్ర బస్సులో గురకి పెట్టకుండా గాఢంగా నిద్రపోయే నాకు విమానం లో పట్టుమని పది నిముషాలు కూడ నిద్ర పట్టలేదు. సోమవారం 12:30 A.M  బెంగళూకొచ్చాను. నేను బయట వచ్చేసరికి అమ్మా నాన్నా కనిపించారు. అక్కడి నుంది బంధువుల ఇంటికొచ్చాము. రెందు రోజులనుంది కూడలిని మరియు నా బ్లాగునీ చూడకపోవటంతో కళ్ళు మరియు చేతులు దురద పెట్టాయి. నిద్ర లేవంగానే నా బ్లాగును చూసి (బంధువుల ఇంట్లో ఉన్న #Windows XP# కు కృతఙ్ఞతలు ) ..మిత్రుల comments చదివిన తరువాత నేను ఆ పోస్ట్లో చివరి వాక్యాలు వ్రాసి పొరపాటు చేసాననిపించింది.

ఎలా అయితేనే…కూడలిని మళ్ళీ పలకరించగలగడం ఆనందంగా ఉంది.

ప్రకటనలు

5 thoughts on “నవీనుడేతెంచెను

  1. రామనాథమూ మత్తు వదిలేంతవరకు ఆగలేకపోయా. ఇంకా ప్రయాణ బడలిక (jet lag) అలాగే ఉంది. ఆఫీసుకి వచ్చీ రాంగానే..బండెడు పనిని నెత్తి మీద పెట్టారు. అందుకె ఇంటికి వెళ్ళడం గంట ఆలస్యం చేసి…కూడలిని దర్శించుకొన్న తర్వాత వెడుతున్నా.

    సుధాకర్ గారు..మీ టూల్ బార్ ఇక్కడ వీర విహారం చేస్తోంది….:)… టూల్ బార్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే “కటారి కత్తి” అన్న మాట. మీరిచ్చే ప్రోత్సాహానికి నాకు చాలా ఆనందంగా ఉంది

    రాధిక గారు…మీ అభిమానానికి కృతఙ్ఞతలు.

    cbrao గారు…ఇక్కడికి వెచ్చే ముందు రోజే “మాల్ ఆఫ్ అమెరికా”కి వెళ్ళాను. అదీ ఒక మామూలు మాల్ అనుకొన్నాను కానీ, మీరు చెప్పేంత వరకు అది అమెరికాలోనే అతిపెద్ద మాల్ అని నాకు తెలియదు. మొత్తానికి మీరిచ్చిన టిప్పణి వల్ల దాన్ని చూడగలిగాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s