డబ్బింగ్ చిత్రాల పరాకాష్ట

ఈ నెలలో “పోకిరోడు” అనే చిత్రరాజం విడుదల అవుతుంది. పొరపాటున దానికి వెళ్ళేరు. నా మాట వినకుండా వెళ్ళారంటే మీ తలను ముందు సీటుకేసి ఠపీ ఠపీ అని బాదుకోవలసి వస్తుంది. మన రవితేజా నటించిన ‘ఇడియట్’ సినిమా ను శింబు (అదే శిలంబరసన్..టి.రాజేందర్ కొడుకు) హీరోగా పెట్టి తమిళంలో తీసారు. దాన్నే మళ్ళీ “పొకిరోడు” పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇలా చెయ్యటం మొదటి సారేమీ కాదు…”నరసింహ నాయుడు” సినిమాను తమిళంలో “ఏళు మళై” గా తీస్తే..దాన్నే “సింహ బలుడు” అని తెలుగులోకి డబ్బింగ్ చేసారు. తెలుగు సినిమాకు ఏమి పొయ్యేకాలం వచ్చిందో, మన సినిమాలను అదే కథతో తమిళ వాసనలతో చూడాల్సి వస్తోంది. చాలా కోపంగా ఉంది..ఎవర్ని తిట్టాలో ఏమని తిట్టాలో తెలీటం లేదు. మళ్ళీ పేరు “పోకిరోడు” అంట. చూస్తూండండి..క్రింద చెప్పిన సినిమాలు కూడ త్వరలోనే వస్తాయి.
* పోకిరి అల్లుడు
* పోకిరి దొంగ
* ముద్దుల పోకిరి
* మా ఊరి పోకిరి
* నా ఊపిరి ఈ పోకిరి
* ఈ పోరడు పోకిరోడు
* నేను సైతాన్ – నువ్వు పోకిరి
* పోకిరి పిల్ల
* మా ఆయన పోకిరి
* పిరికోడు కాదు పోకిరోడే
* బంగారు పోకిరి
* ఘరానా పోకిరి
* నా మన్ను – నీ మశానం

ప్రకటనలు

7 thoughts on “డబ్బింగ్ చిత్రాల పరాకాష్ట

  1. మన పూరీజగన్నాథుని సినిమాల పేర్లు చూడండి – నిన్న “పోకిరి”, ఇవాళ “దేశముదురు”, రేపు “కంత్రి” (కొణిదల రాంచరణ్‌తేజ). ఏమైతే’నేం’ సినిమాలు బాగా ఆడి నలుగురికి తిండిదొరికితే సంతోషమేకదా.

  2. అన్నిటి కన్నా ఆఖరి పేరు చాలా బాగుంది…

    ఈ మధ్య లో ఒక సినిమా హిట్ ఐతే ఇలా పేర్లు వాడుకోవడం అలవాటు అయిపోతోంది.

    మనకు అనిపించింది వాళ్ళకు ఎందుకు అనిపించదో నాకు అర్థం కాదు…

    ఎప్పటికి మారేనో ఈ లోకం….

  3. “పోకిరి” పేరు బాగుందా బాగోలేదా అన్నది వేరే విషయం. నేను చెప్పేదేమిటంటే…ఒక్క సినిమా హిట్టయితే చాలు..ఆ పేరునే అటూ ఇటూ చేసి సినిమాలు వదులుతారు మన సినిమా ప్రజ. ఉదాహరణకు “నువ్వే కావాలి” విజయవంతం అయ్యింది. “నువ్వు” ను ముందు వెనకా తగిలించి ఎన్ని సినిమాలు వచ్చాయో నేను చెప్పక్కర్లేదనుకొంటాను. సినిమాలో సత్తా ఉండాలికాని..పేరు ఏదైతేనేమి విజయవంతమవడనికి. ఈ విషయం మన నిర్మాతలకు ఎప్పుడు తెలిసొస్తుందో కదా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s