సి(నీ)తార

ఈ పాట వ్రాసిన అతనికి
సంగీతం అందిచిన వ్యక్తికి
పాడిన గాయకులకు దర్శకుడికి

నమస్కరించడం కాదు, సాష్టాంగ పడి దండం పెట్టాలనుంది. తమాషా కాదు, నిజంగానే…ఈ పాట అంత అద్భుతంగా ఉంది మరి. నేను ఇక్కడ వ్రాసేది పాట మాత్రమే. నేను పొందిన రసానుభూతిని మీరూ పొందాలంటే..ఈ పాట వినాల్సిందే. అన్నట్టు సినిమా పేరు చెప్పడం మరిచాను..పేరు “సితార”.

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి ||కిన్నెరసాని||
విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల పావడ కట్టి
కొండ మల్లెలే కొప్పున పెట్టి
వచ్చే దొరసాని ….
మా వన్నెల కిన్నెరసాని ||కిన్నెరసాని||

ఎండల కన్నే సోకని రాణి
పల్లెకు రాణి పల్లవ పాణి
కోటను విడచి పేటను విడచి
కోటను విడచి పేటను విడచి

కనుల గంగ పొంగే వేళ
నదిలా తానే సాగే వేళ
రాగాల గోదారి పూదారి ఔతూంటే
ఆ రాగాల గోదారి పూదారి ఔతూంటే ||కిన్నెరసాని||

మాగాణమ్మ చీరలు నేసె
మలిసందెమ్మా కుంకుమ పూసె
మువ్వల బొమ్మ ముద్దుల గుమ్మా
మువ్వల బొమ్మ ముద్దుల గుమ్మా

గడప దాటి నడిచే వేళ
అదుపే విడీచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తూంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తూంటే ||కిన్నెరసాని||

2 స్పందనలు

  1. ii paatea kaadu ii movie loni anni paatalu baaguntay.asalu vamsi gari anni cinemalaloa prati paata aanimutyamea kadandi.

  2. నిజంగానండీ… ఇప్పటికీ ఎన్నిసార్లు విన్నా కొత్తదనం ఉంటుందీ పాటలో.. అదిఏమిటో మరి..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: