వారుణి వాహిని

“వారుణి వాహిని” అనగానేమి? దీనికీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఉన్న సంబంధమేమి?

ప్రకటనలు

11 thoughts on “వారుణి వాహిని

 1. వారుణి వాహిని అంటే పాకెట్లలో అమ్మే నాటు సారా అనుకుంటా. రామారావుకు ఉన్న సంబంధం ఖచ్చితంగా తెలియదు కానీ ఆయన కాలములో ఈ పేరు బాగా వినిపించినట్టు గుర్తు

 2. అన్నగారి హయాంలో మెదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సారా దుకాణాలకు ఈ పేరు పెట్టి విచ్చలవిడిగా అమ్మారు.మళ్లీ 94లో ముఖ్యమంత్రి అయినప్పుడు మద్యనిషేదం మీద మొదటి సంతకం చేసి ఆ పాపాన్ని కడిగేసుకొన్నాడనుకోండి!
  రానారె, అది “వారుణి” నే!(చూ.waaruNi n. class. 1 west, region of Varuna. 2 alcoholic liquor.)ఇక “వాహిని” విషయానికొస్తే నది అని అర్థం (చూ.waahini n. class. 1 river. 2 army.) అంటే అక్షరాలా సారా నదీమ తల్లి పరవళ్లెత్తుతూ ప్రవహించిందన్న మాట!

 3. ఓహో…….ఇంత త్వరగా సమాధానాలు వస్తాయని అనుకోలేదు. సమాధానాలు వ్రాసిన అందరికీ నా కృతఙ్ఞతలు. “శ్రీదేవి పెళ్ళి” అనే మిమిక్రీ క్యాసెట్టు వింటూంటే.. ఈ పదం వినిపించింది. అందులో గుమ్మడీ రావు గోపాల రావు గారితో “తాగించడానికి మెక్-డోవెల్ బ్రాందీ లేకపోయినా పర్లేదు, కనీసం రామారావుగారి వారుణి-వాహిని అయినా ఇప్పించండి” అని అడుగుతాడు.
  సత్యాసాయి గారు, మీ బ్లాగు చూసి మీరు విజిటింగ్ ప్రొఫెసరని తెలుసుకొన్నాను. మీకు నచ్చిన సబ్జెక్ట్ (తెలుగులో ఏమంటారు?)లో http://te.wikipedia.org లో వ్యాసాలు వ్రాయవసిందిగా నా ప్రార్థన.

 4. ఏమాటకామాట చెప్పుకోవాలి, అన్నగారికి తెలుగంటే వీరాభిమానం. ఆయన ఎన్నికల ప్రచారంలోనూ, తరవాత అధికార హయాంలోనూ తెలుగు ఒక్క వెలుగు వెలిగింది. సంస్కృతాన్ని అక్కడక్కడా ఇలా పేర్లు పెట్టాటంలో ఉపయోగించినా, తెలుగుకే ప్రాముఖ్యత ఇచ్చేవాడుట. రామారావుని గురించి నాకు తెలీని ఇంకో విషయం – తెలుగు మాటలతో (వీటిల్ని మంత్రాలు అనొచ్చో లేదో) పెళ్ళి జరిపింఛే వాడుట. ఈ విషయం కవీ, ఆయనకి సన్నిహితుడూ అయిన నాగభైరవ కోటేశ్వరరావు గారు చెప్పారు.
  రామారావుకి ముందు ప్రభుత్వం సప్లయి చేసే మద్యం “ప్రసాదు”ల్లో (ప్రభుత్వ సారాయి దుకాణం) అమ్మేవారు. అప్పటికి పేకెట్లు కూడా లేవనుకుంటా. పీపాల్లో సప్లై అయితే దుకాణదారు తాగేవాళ్ళకి గ్లాసుల్లో కొలిచి పోసి అమ్మేవాడు. కల్తీ, కొలతల్లో తేడాల్ని అరికట్టటానికి ప్లాస్టిక్ సంచుల పేకింగ్ తో, ప్రసాదులకున్న negative image ని మార్చటానికి వారుణ వాహిని పేరుతో ఈ కొత్త కార్యక్రమం మొదలైంది.
  అవును నవీన్ గారూ, నా దగ్గర ఈ మిమిక్రీ కేసెట్ ఉండేది. ఎవరో తీసుకుని ఇవ్వలేదు. ఇంకా దొరుకుతోందా మార్కెట్లో? చాలా ఫన్నీగా ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s