• టాజా షరుకు

  • ఉట్టమ టపాళు

  • పాట షరుకు

  • వర్గాలు

  • Blog Stats

    • 242,082 హిట్లు

పాపం సీతారామరావు…

“కొంత మంది ‘సంఘ సంస్కరణ విప్లవం’ అంటూ తిరుగుతూంటారు. ఎదో బ్రహ్మాండమైన పని చేస్తునట్టు వాళ్ళు రొమ్ములు విరుచుకొని కేకలు వేసుకొంటూ తిరుగుతూంటే, వాళ్ళని చూచిన కొద్దీ జాలి వేసేది సీతారామారావుకి. ఏమిటి వీళ్ళు చేసేది? సంఘానికి పరిపక్వదశ అనేది లేదు గదా! మరి దేనికోసం వీళ్ళ ఆరాటం?ఒక సమస్యని పరష్కరిస్తే, ఆ సమస్యా పరష్కరంలో నుంచే మరొక సమస్య పుట్టుకొస్తుందని పెద్దలు చెబుతుంన్నారు. ఇదే ప్రపంచ పరిణామం అని కూడా అంటున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు మానవుల్ని బాధ పెట్టే సమస్య ఎదో ఉంటుంది. కొంత మంది మానవులు బాధపడుతూనే ఉంటారు. ఇక వీళ్ళు చేసేదేమిటి?……”

ఇది నే రాసినది కాదండీ బాబు… గోపీచందు వ్రాసింది. ప్రొద్దున్నె “అసమర్థుని జీవయాత్ర” చదువుతూ కూర్చున్నాను. 60 పేజీలు చదివేసరికే తల వేడెక్కిపోయింది. రాత్రయినా సీతారామారావు నన్ను ఆవహించుకొన్నాడాయె.. ఇంకా అతని గురించి ఆలోచనలు పోలేదు…పూర్తి నవల చదివితే ఆ హాంగోవర్ దిగటానికి నెల పడుతుందో ..జీవితమే కావాలో…ప్రతి సాహితీ అభిమాని వద్దా ఉండవలసిన పుస్తకం.

3 స్పందనలు

  1. చిన్నప్పటినుంచి వింటున్నాను ఈ నవల గురించి. నవలాస్రవంతి పేరిట ఆకాశవాణిలో ప్రతివారం కొంతభాగం చదివేవాళ్లు కూడా. నేనప్పుడు చిన్నవాణ్ణి, పూర్తిగా వినలేదు. ఈ నవల అంతర్జాలంలో వుంటే దాని లింక్ ఇస్తే కృతజ్ఞుణ్ణి.

  2. గత వారమే ఈ నవల చదివాను. మరీ అంత గొప్పగా వుందని నాకనిపించలేదు. ఏమో ఎంతోమంది ఎన్నో చోట్ల దీని గురించి చెప్పగా విని తెప్పించుకొని చదివాను. సీతారామారావు తార్కికత చాలా చోట్ల సబబుగానే వుంటుంది. అయితే అన్నిటికీ తలమానికం రామయ్య తాత చెప్పే చివరి నీతి. ఈ చివరి నీతి చదవకుండా మొదటి తర్కాలన్నీ వింటూ వాటికి అనుకూలంగా మొగ్గుతూ పోతే కష్టమే.
    అయినా సీతారామా రావుని చాలా త్వరగా పిచ్చివాన్ని చేశాడు గోపీచంద్ అనిపించింది. త్వరలో నా బ్లాగులో దీని మీద నా అభిప్రాయం మరింత విపులంగా చెబుతాను.

    –ప్రసాద్
    http://blog.charasala.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: