నాయకులంటే వీళ్ళేరా

ఆహా గాంధీ, లాల్ బహుదుర్ శాస్త్రీ వంటి వారు ఉండుంటే, ఈ సంఘటన చూసి సంతోషం పట్టలేక గుండాగి రెండో సారి చస్తురు కదా!!!! అమ్మల్లారా….అయ్యల్లారా …. చూడరండీ ఆంధ్రదేశంలో అపర గాంధీ వారసుల్ని.
“బొత్సా సత్యనారాయణ” పేరు గుర్తుందా? ఆయనేనండీ….”వోక్స్ వాగన్ పోనాది..ఇంకేటి సేత్తాం” అన్నారు…గుర్తొచ్చిందా. అదే…అసలు ఆ కంపెనీ వాడో కాదో చూసుకోకుండా ప్రభుత్వ ఖజానా లో నుంచి 10 కోట్లిచ్చేశారు. అయనే అప్పటి పరిశ్రమల శాఖా మంత్రి..ఇప్పటి మార్కెటింగ్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈయనగారీ సతీమణీ ఈ మధ్యే బొబ్బొలి నియోజక వర్గానికి ఎంపీ గా ఎన్నికైయ్యారు. ఆమె రాజీనామాతో ఖాళీ అయ్యిన జిల్లా పరిషత్‌ ఛైర్మన్ స్థానానికి తన తమ్ముడు బొత్సా అప్పల నర్సయ్యను నిలబెట్టాలని చూస్తున్నారు. ఇదే జరిగితే మూడు ముఖ్య పదవులు ఒకే కుటుంబం వారు అనుభవించినట్లవుతుంది.

ఇంతకు విషయమేంటంటే విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఎన్నికపై రాష్ట్ర మంత్రివర్గంలో చిచ్చురేగింది. ముఖ్యమంత్రి వైఎస్‌కు సన్నిహితులైన ఇద్దరు మంత్రులు బొత్స సత్యనారాయణ, శత్రుచర్ల విజయరామరాజు పంతాలు, పట్టింపులతో రాజీనామాలకు సిద్ధపడ్డారు. తన తమ్ముడు అప్పలనర్సయ్యకు జడ్పీ ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టేందుకు పార్టీ అంగీకరించకపోవడంతో అలిగిన మార్కెటింగ్‌ శాఖ మంత్రి బొత్స తాను రాజీనామా చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రికి తెలియజేశారు. అయితే రాజీనామా లేఖను మాత్రం ఇవ్వలేదు. బొత్స కోరినట్లు ఆయన కుటుంబానికి జడ్పీ ఛైర్మన్‌ పదవిని కేటాయిస్తే తాను రాజీనామా చేస్తానని అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విలేఖరుల ఎదుట ప్రకటించారు. ఇద్దరు మంత్రివర్గ సహచరుల మధ్య నెలకొన్న ఈ వివాదం ముఖ్యమంత్రికి ఇబ్బందికరంగా పరిణమించింది. ఇంత గందరగోళం నడుమ విజయనగరం జడ్పీ ఛైర్మన్‌ పదవికి ఎన్నిక జరగబోతోంది. ఈ పరిస్థితిని శ్రీ రమణ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు… చదవండి మరి
****************************************************

బొత్స కుటుంబం వొకరికి ఇద్దరు ముగ్గురు సేవారంగంలోకి దూకడానికి వుద్యుక్తులైతే ఆపడానికి మనమెవరం? ఒక మంత్రి పదవి, ఒక పార్లమెంటు సీటు, ఒక జిల్లా పరిషత్తు- ఈ మూడు వొక కుటుంబంలో ఉంటే ఎంత సుఖం?

తలపై రూమీ టోపీ, మోకాళ్లు దిగేదాకా పసుపు పచ్చ షేర్వాణీ, కొంచమే కనిపిస్తున్న తెల్లటి పైజామా, సహజ సిద్ధమైన గెడ్డంతో, అలవాటుగా సలాముల్లా దణ్ణాలు పెట్టుకుంటూ పాత బస్తీలో ఆ విధంగా ఆయన ముందుకు పోతావుంటే- ఉర్దూ ఘజల్‌ నడిచి వెళ్తున్న భావన కలిగింది. చార్మినార్‌ నాలుగు మినార్‌లను ఆసక్తిగా వాల్చి మరీ చూసిం ది. చంద్రబాబునాయుడుగా గుర్తించాక తేలిగ్గా ఊపి రి పీల్చుకుంది చార్మినార్‌! యిది పాత విషయం. ప్రస్తుతం కొత్త విషయాలు అనేకం ఉన్నాయి మాట్లా డుకోడానికి. అయితే వొక్కటి మాత్రం సత్యం. చంద్ర బాబు వేషధారణ చూసి వైయస్‌గాని కెసిఆర్‌గాని వారివారి రంగుల్లో షేర్వాణీలు కుట్టించుకోగలరే మోగాని, ఆ విధంగా దుస్తులకు నప్పేవిధంగా సహ జసిద్ధమైన ముఖకవళికలను సాధించడం దుస్సా ధ్యం. టోపీలంటారా ఎవరైనా పెట్టగల సమర్థులే. ఇవన్నీ కాదుకానీ ముఖ్యమంత్రిని వోటు హక్కు గల ఒక పౌరునిగా ఒక ప్రశ్న సూటిగా అడుగుతు న్నాను.

ఒక హిందూ అవిభక్త కుటుంబం- మూకు మ్మడిగా, కలసి కట్టుగా, సమష్టిగా, అంకితభావంతో ప్రజాసేవకు పునరంకితమవుతామంటే అడ్డుకునే హక్కు వైయస్‌కి ఎవరిచ్చారు? ఒకే కుటుంబం నుం చి యిద్దరకు మించి ప్రజాసేవలో జొరబడకూడదని భారత రాజ్యాంగంలో ఎక్కడైనా అభ్యంతరం ఉందా? బొత్స కుటుంబం వొకరికి ఇద్దరు ముగ్గురు సేవారంగంలోకి దూకడానికి వుద్యుక్తులైతే ఆపడా నికి మనమెవరం? అడ్డుకోవడానికి అధిష్ఠానానికి మాత్రం హక్కు ఎవరిచ్చారు? ఒక మంత్రి పదవి, ఒక పార్లమెంటు సీటు, ఒక జిల్లా పరిషత్తు- ఈ మూడు వొక కుటుంబంలో ఉంటే ఎంత సుఖం? హైదరాబాదు, ఢిల్లీ, బొత్స సొంత జిల్లా మొత్తం ఒక గొడుగుకిందకు వచ్చినట్టు అవుతుంది. ప్రజాసేవ కూడా సులువు అవుతుంది.

ప్రజలక్కూడా ఢిల్లీ హైదరాబాదు అందిపుచ్చుకున్నట్టుగా ఉంటుంది. జోడు పదవులు కొన్నాళ్లు నడిచాయి. ఇటీవల ప్రజాసేవకి డిమాండ్‌ పెరగడంతో ‘వొక తలకి వొక పదవి’ ఖాయం చేశారు. కొన్నాళ్లు లాభసాటి పదవు లు, వొట్టి కీర్తి ప్రధాన పదవులు అంటూ చర్చ నడి చింది. కానీ బొత్స సత్యనారాయణ అడిగిన దానిలో న్యాయం ఉంది. కావాలంటే, తన మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేస్తానని అన్నారు. అనడ మే కాదు, రాజీనామా యిచ్చారు కూడా. అయితే, వైయస్‌ బొత్సని వదులుకోగలరా? అవతల శత్రు చర్ల. ఆయన మాత్రం తక్కువా. సేవానిరతిని కొలబ ద్దగా తీసుకుంటే ఎవరికి వారే సాటి. వారిద్దరినీ బేరీజు కట్టగల షరాబు లేడుగాక లేడు. మొత్తం మీద చినికి చినికి గాలివాన అయింది. గయోపాఖ్యానంలో ఆఖరి సీనులా మారింది. గతాన్ని తవ్వుకుంటే అక్క రలేని అవశేషాలు బయటపడతాయని, కొంచెం గుం భనంగానే ఎవరికి వారు ఉండిపోయారు.

ఎవరి దండుని వారు సమీకరించుకుని, రాజకీయ సంప్రదా యాలకు అనుగుణంగా లాడ్జి గదులు కిటకిటలాడి పోయాయి. అన్నట్టు లాడ్జి అంటే గుర్తుకు వచ్చింది. టిఆర్‌ ఎస్‌ కార్యాలయాన్ని లాడ్జి చేసుకోవలసి వస్తుందని, నోరు అదుపులో పెట్టుకోమని కెసిఆర్‌పై బాణం వేశా రు తెలుగు దేశంవారు. అంటే అంతకు ముందు కెసి ఆర్‌ నోరు జారారు. ఇంతకు ముందు కాలు జారారు. టిడిపి ఆఫీసుకి టులెట్‌ బోర్డు పెట్టాల్సి వస్తుంద న్నారు. కెసిఆర్‌కి చిన్నప్పుడు వస ఎక్కువ పోశారని, దానివల్ల తెగ జారుతూ ఉంటారని అనాదిగా ఆయ నని యెరుగున్నవాళ్లు అంటుంటారు. పంచతంత్రం కథ వొకటుంది. చెరువులో నీరు యింకిపోతుంటే, అందులో వున్న తాబేలు రోజూ నీటిమట్టం చూసుకుని బెంగపడుతూ ఉండేది. ఆ చెరువు వొడ్డున ధ్యానం చేస్తూ, చేపల్ని తినే రెండు కొంగలు తాబేలుకి బాగా పరిచయం.

రోజూ లోకాభి రామాయణం మాట్లాడుకుంటూ వుండేవి. తాబేలు ఒక రోజు తన సమస్య చెప్పింది. కొంగలు రెండూ తాబేలుని వేరే నీళ్లున్న చెరువుకి చేరుస్తామని వాగ్దా నం చేశాయి. తాబేలు కొంచెం వాగుడుగా యని వాటికి తెలుసు. అందుకని దానికి చెప్పాయి. కొం గలు ఒక కర్రముక్కని అటూయిటూ ముక్కున పట్టు కున్నాయి. మధ్యలో కర్రపుల్లని గట్టిగా పట్టుకోమని తాబేలుకి చెప్పాయి. ఎగరబోయే ముందు కూడా నోరు విప్పవద్దని హెచ్చరించాయి. తీరా ఎగిరి వెళ్తుం టే, ఒక గ్రామవాసులు ఈ విచిత్ర దృశ్యం చూసి ఆశ్చర్యంగా అరవడం మొదలుపెట్టారు. తాబేలు నిగ్రహించుకోలేక, కొంగలకు ఏదో చెప్పబోయింది. అంతే! కెసిఆర్‌ మాటలు విన్నప్పుడల్లా ఆ తాబేలు నాకు గుర్తుకు వస్తుంది. కొంగలెవరో మాత్రం నేను చెప్పనుగాక చెప్పను.

( శ్రీరమణ)

ప్రకటనలు

4 thoughts on “నాయకులంటే వీళ్ళేరా

  1. మన అర ఇంగ్లీషు నాయకుడు కేకే కీ, ఇప్పుడు తన ఇంట్లో తీరిగ్గా గోళ్ళు గిల్లుకొంటూ కూర్చున్న యెం. సత్యనారయణ రావుకీ కొంగలయ్యే అర్హత లేదంటావా రామనాథమూ? ఏమంటావు?

  2. ఏమైనా! నా అభిమాన రచయత ‘ శ్రీరమణ గారి ‘ శైలే వేరు. చక్కని ఉపమానము తొ భలే చురకలు అంటించారు. మన రాజకీయనాయకులకి ఈవేమి పట్టవు…’ దున్నపొతు మీద వడిగళ్ళ వాన ‘ చందానా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s