ఉత్తమ బ్లాగరి పోటీ

ఉత్తమ బ్లాగ్ పోటీలో పాల్గొంటున్న అందరికీ నా శుభాకాంక్షలు.

నేను బ్లాగడం మొదలెట్టి ఐదు నెలలు కావస్తోంది. ఓ ఐదు పోస్టులు చేసిన తర్వాత కూడా ఈ అలవాటును కొనసాగిస్తే గొప్ప అనుకొన్నాను. బ్లాగు/వికీ మిత్రులు నా బండికి ఎక్కడా బ్రేకులు పడనివ్వలేదు. ఈ బిజీ బిజీ జీవితంలో ఏలానో ఒక లాగా సమయం చూసుకొని బ్లాగేటట్టు ఉత్సాహం కలుగచేశారు. రోజుకు 12 గంటలు ఆఫీసులోనే మగ్గిపోయి జీవితంలో కళాపోసన లేదేంట్రా అనుకొనే నాకు, బ్లాగడం మొదలెట్టాక ఒక మంచి తోడు దొరింకింది. నా బుర్రలో తిరిగే ఆలోచనలు మరియు నాకు నచ్చే వార్తలు వ్రాయటం, అంతకన్నా ఆసక్తిగా జనాలు వ్రాసిన వ్యాఖ్యలను చదవటం….రోజువారీ కార్యక్రమం అయిపోయింది.

ఇక అసలు విషయానికొస్తే, నేనూ పోటీలో పాల్గొందామనుకొన్నా. నా బ్లాగులోని 112 పోస్టులు, 200 పైగా వ్యాఖ్యలు, 5000 పైగా హిట్లు ఈ ఆలోచనకు మరింత ఊతమిచ్చాయి. తర్వాత ఆలోచిస్తే ఉత్తమ బ్లాగర్ అయ్యేంత సీను నాకు లేదనిపించింది. ఎంతో మంది ఉత్తమ బ్లాగర్లున్నారు, నేను ఉత్త బ్లాగరు మాత్రమే. నేనే వారికి ఓటు వేసటప్పుడు, మళ్ళి నేను వేరే వారిని ఓటడగడం సమంజసం కాదు. కాబట్టి “వీడి బ్లాగును నామినేట్ చెయ్యాలా?” అని ఆలోచించకండి. “నామినేట్ చెయ్యద్దనేకాడికి పోస్టెందుకురా నాయనా” అంటే…బ్లాగి వారమయ్యింది, ఏదో నా మదిలో రేగుతున్న ఆలోచనలు పోస్టులోకి వంపేస్తామని అంతే.

పోటీ సంగతెలా ఉన్నా జనాలకు యూనీకోడు తెలుగు గురించి, తెవికీ గురించి, తెలుగు బ్లాగుల గురించి చెప్పడం మాత్రం మానను. నా పోరుపడలేక తెలుగు బ్లాగు మొదలు పెట్టిన ప్రవీణ్ క్రమం తప్పకుండా బ్లాగడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

శ్రీరస్తు-బ్లాగస్తు-శుభమస్తు

ప్రకటనలు

5 వ్యాఖ్యలు

  1. నవీన్ చక్కగా మనసులో మాట చెప్పేశారు. నిర్మొహమాటానికి మరోపేరు నవీన్ :)

    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. ఉత్తమ బ్లాగరు లక్షణాలివే :-)

  3. మీకేంటండి సూపర్… ఆదరగొట్టేయండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: