ఐకమత్యమే మహాబలం ? – 1

రెండు సంవత్సరాల నుండి తెలంగాణావాదం ఊరూ వాడల్లో హోరెత్తుతోంది. ఒక్క రాజకీయ నాయకులే కాక ఎంతో మంది మేథావులు ఈ వాదాన్ని సమర్ధిస్తున్నారు. ఈ వాదానికి ఎంతో చరిత్ర ఉన్నా….ఆంధ్రా నుండి తెలంగాణా వేరైతే ఏ ప్రాంతంలోనూ ఏ సమస్యలూ తీరిపోవని నాకు నిన్న గట్టిగా అనిపించింది. ఐ.ఐ.టీ కోసం మెదక్ & అదిలాబాద్ జిల్లాలు(?) పోట్లాడుకోవడం చూస్తే ఎవరికైనా ఇలా అనిపించక మానదు. రేపు ప్రత్యేక తెలంగాణా వచ్చాక ఉత్తర తెలంగాణా..దక్షిణ తెలంగాణా అని పొర పొచ్చాలు రావని గ్యారంటీ ఏమిటి?
ఒక వేళ రేపు తెలంగాణా వస్తే, కావేరి జలాలకోసం కర్ణాటకా తమిళనాడు కొట్టుకున్నట్లు, కృష్ణా-గోదావరి జలాలకోసం అంధ్రా, రాయలసీమా, తెలంగాణ ల మధ్య ఎప్పటికీ ఆరని చిచ్చు రేగడం ఖాయం. కేసీయార్ కు, బీజేపీకి ఇతర కుహనా రాజకీయ నాయకులకు వారు చిన్నప్పుడు తెలుగువాచకంలో చదువుకొన్న “ఐకమత్యమే మహాబలం” పాఠం గుర్తు చెయ్యాలి. గులాబి జెండాలకు ఖర్చు పెట్టడానికి లక్షలుంటాయి…కానీ బాధితుల కన్నీళ్ళు తుడవడానికి ఒక చిన్న రుమాలు కూడా వారి దగ్గర ఉండదు.
ప్రజల అసలు సమస్యలు అర్థం చేసుకొని వాళ్ళ కన్నీళ్ళు తుడిచి ఎవరి కాళ్ళ మీద వారు నిలబడేలాగ చెయ్యాలి. అప్పుడే అందరూ సంతోషంగా ఉండగలిగేది.

(సశేషం)

ప్రకటనలు

5 thoughts on “ఐకమత్యమే మహాబలం ? – 1

 1. నా అబీప్రాయమూ ఇదే!
  ఉమ్మడీ కుటుంబం నుండి ఒక జంట విడిపోతే అభివృద్ది సాద్యమేమొ గానీ (భార్యాభర్తలు ఇంకనూ విడదీయలేని చిన్న యూనిట్ గనుక) ప్రాంతాల మద్య అది సాద్యం గాదు. తెలంగాణా, రాయల సీమ, కోస్తా అనేవి మిధ్యా హద్దులే తప్ప నిజమైనవి కాదు.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 2. All this so called movement started only for political gains and it is evident that TRS is no more interested in movement but they want to win majority seats in 2009 assembly elections. What they do after winning, only god knows.
  Till then they just want to pass time by arranging press meets and shouting something or the other. If people forget Telangana issue as it happened many times before, then there is no future for TRS so they just want to keep it alive by doing emotional background.
  పదవి లో వున్నప్పుడు ఏమీ గుర్తురావు కానీ ఇప్పుడు మాత్రం ఫ్లోరైడ్ సమస్యలూ, కరెంటూ అన్నీ గుర్తుకు వస్తాయి.
  ఏం మనం పన్నులు కడ్తలేమా అంటడు. కడ్తున్నం నాయనా. సామాన్య ప్రజానీకం అందరూ పన్ను కడుతున్నారు. పన్నులు కోట్లకు కోట్లు ఎగ్గొట్టేది రాజకీయ నాయకులే. మేము దేశాన్ని ఉద్ధరిస్తామంటే వినే స్థితి లో ప్రజలు లెరు. విన్నా నిజం తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టదు

 3. వీటి వల్ల సామాన్య ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదు. వీరంతా అధికారం కోసం పందికొక్కుల్లా కొట్టుకుంటున్నారు. మన దేశంలో కూడా చైనాలో లాగా పూర్తి కమ్యూనిష్టు పాలన ఎంత బాగుంటుందో!

 4. బాగా చెప్పారు. భవిష్యత్ లో తెలంగాణ పరిస్తితి ఎమిటో ఈ కుహనా రాజకీయనాయుకులు కు అర్ధం కాక కాదు. ఎవరి స్వప్రయోజనాలు వారివి. వారి స్వార్ధం కోసం రాష్త్రాన్ని కుక్కలు చించిన విస్తరి చేయదలుచుకున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s