రోడ్డు రోలరు మంత్రి!

 ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్నీ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. అన్నిట్లోనూ వారికి లోపాలే కనిపిస్తున్నాయి. పద్ధతి మార్చుకోకపోతే రోడ్డు రోలరుతో కుమ్మిస్తాం.

– రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

విధి సంకల్పంబుచే నొకానొకడు
తావిశ్వంబు బాలించుచో
బధిరంబెక్కువ, చూపు తక్కువ,
సదాభాషల్‌ దురుక్తుల్‌…
అని ఒక చాటువులో రాజుల అధికార మదాంధతపై కవి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అధికారం తలకెక్కితే విచక్షణ మోకాళ్లలోకి జారుతుంది అని కూడా విజ్ఞులు చెబుతారు. రాజులు అధికారం శాశ్వతం అనుకునే వారు. తాము దైవ స్వరూపులమని, తమను ఎవరూ ప్రశ్నించడానికి వీలు లేదని భావించేవారు. ఎవరయినా ఎదిరించి మాట్లాడితే కొందరు కన్నూ మిన్నూ కానకుం డా వ్యవహరించేవారు. ప్రజాస్వామ్యంలో అలా కుదరదు మరి. ప్రతిపక్షాలు ఉంటాయి. పత్రికలూ ఉంటాయి. ఏలినవారికి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రశ్నిం చే హక్కూ ఉంటుంది. అభ్యంతరాలు, ఆక్షేపణలు, విమర్శలూ అన్నీ ఉంటా యి. అధికారం కూడా శాశ్వతంకాదు. మళ్లీ ఐదేళ్లకు వారు వీరవుతారు. వీరు వారవుతారు. రోడ్డు రోలర్లు, బుల్డోజర్లు ఇప్పుడూ అప్పుడూ ఎప్పుడూ అం దరికీ అందుబాటులో ఉంటాయి. ఇంతలోనే మిడిసిపాటు ఎందుకు! మంత్రి పుంగవులు కాస్త తెలివిడితో మాట్లాడితే మంచిది!

***

ఒకవైపు వ్యాపారులు నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టిస్తుండగా, మరోవైపు ప్రభుత్వ విధానాలు కూడా ధరలను అదుపు చేయడంలో విఫలమయ్యాయి. అన్ని ధరలతోపాటు పాల ధరను కూడా పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపారు.

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ

మాటల్లో చిరుకోపం
చేతల్లో స్నేహజపం
వీధుల్లో పోరాటం
నగరాల్లో కోలాటం
వారెవ్వా ఏమి ఇజం
వర్ధిల్లె నపార్చునిజం
రాజకీయాలు రసాయనశాస్త్రం వంటివి అంటారు నిపుణులు. కలసి కొత్త అవతారం ఎత్తడమో, కలహించుకుని దేనికదిగా ఉండడ మో-రాజకీయాల్లో రెండే మార్గాలుంటాయన్న ది వారి ఉద్దేశం. కలసి ఉండడం, కలహించుకోవడం ఏకకాలంలో జరగవని దీని తాత్పర్యం. ఏకకాలంలో సమ్మతీ, అసమ్మతీ ఉండవు. ఏదో ఒక్కటే ఉం టుంది. రెండు నాల్కలు కనిపిస్తున్నాయీ అంటే ఏదో విచిత్ర వేషం వేస్తున్నారన్నమాటే! ఏదో ఆశించి రాజకీయ విన్యాసాలు చేస్తున్నారనే అర్థం! ఒకవైపు ప్రభుత్వంపై వీరోచిత పోరాటాలు చేస్తున్నట్టు ప్రకటిస్తూనే, మరోవైపు విశాఖపట్నం మహానగర ఎన్నికల కురుక్షేత్రంలో ఎంచక్కా ముందుగానే కాంగ్రెస్‌ రథం ఎక్కికూర్చున్నారంటే ఏమనుకోవాలి?పోరాటం చేసేవారూ, ప్రజలు పోరాటాలకు దిగడానికి కారణమైనవారూ ఒకే రథంలో ప్రయాణం చేయడం అవకాశ వాదం కాదూ! ఇది రాజకీయమా? ‘రాజీ’కీయమా!

***

ఈ ఏడాదిలోగా డిఎంకే మైనారిటీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. సీఎం పీఠాన్ని నేను అధిష్ఠించడం తప్పనిసరి. మేము అధికారాన్ని చేపడితే తొలిసంతకాన్ని స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించే ఉత్తర్వుపైనే చేస్తాం.

– తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత

ఎద్దు ఈనిందంటే దూడను కట్టెయ్యమన్నాడట వెనుకటికొగడు! ఆలూ లేదు చూలూలేదు అన్నట్టు, మాజీ ముఖ్యమంత్రి పైళ్లపై సంతకాలు పెట్టేదాకా వచ్చారన్నమాట! కరుణానిధి ప్రభుత్వంపై ఎంత అక్కసు ఉన్నా, ఆయన ఆరోగ్యం ఎంత ఇబ్బందికరంగా ఉన్నా, డిఎంకె మిత్రపక్షాల మధ్య ఎన్ని లుకలుకలున్నా గాలిలో మేడలు కడితే, అవి నిలవద్దూ! జారిపోయిన బలాన్ని, చెదిరిపోయిన సేనలను, మసకబారిన ప్రతిష్ఠను పునరుద్ధరించుకోవడానికి ఈ గాలిమేడలు ఉపయోగపడతాయా!
***

వై.ఎస్‌. కుటుంబం ఆక్రమించుకున్న పేదల భూములలో బయటపెట్టింది ఐదు శాతం మా త్రమే. మిగతా 95 శాతం భూములను కూడా బయటపెట్టి, పేదలకు పంచాలి. లేదంటే తెలుగుదేశం పార్టీయే ఆ పనిచేస్తుంది. వై.ఎస్‌.కు ఉన్న అక్రమ భూములన్నింటి నీ కబ్జాచేసి, పేదలకు ఇళ్లు కట్టిస్తాం.

– తెలుగుదేశం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు

ఉట్టికెక్కలేని పెద్ద మనిషి స్వర్గానికి ఎక్కుతారట! తొమ్మిదేళ్లపాటు అధికా ర చేలాంచలాలలో తిరుగులేని మొనగాళ్లలా చెలరేగిన తెలుగు తమ్ముళ్లెవరికీ అప్పట్లో రాజశేఖర్‌రెడ్డి భూములు, ఎస్టేట్లూ కనిపించలేదు. వాటి ఛాయల్లోకి కూడా తొంగిచూసే ధైర్యం కూడా వీరికి లేకపోయింది. ఇప్పుడు తొం డికో మొండికో ఆయన భూములు అప్పగించడం మొదలు పెట్టేసరికి, వీరు లేస్తే మనుషులం కాదని బీరాలు పోతున్నారు. బడాయిలు పోవడానికీ ఓ హద్దు ఉండొద్దూ!

(కట్టా శేఖర్‌రెడ్డి వ్యాసం, ఆంధ్రజ్యోతి)

ప్రకటనలు

One thought on “రోడ్డు రోలరు మంత్రి!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s