రావణ”బ్రహ్మ ముహూర్తం”లో రాజశేఖర రెడ్డి

లోకంలో అందరూ ఆదమరిచి నిద్రపోతున్న వేళలో … ఆ బ్రహ్మ ముహూర్తంలో …
వైఎస్‌ యోగాభ్యాసం చేస్తున్నాడు. ప్రజా సంక్షేమం గురించి గొప్ప గొప్ప ఆలోచనలు ఆ సమయంలోనే ఆయనకి తడుతూ ఉంటాయి. పల్లెబాట, నగరబాట, పొలంబాట, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్ళు లాంటి అమోఘమైన అయిడియాలు ఆ బ్రహ్మ ముహూర్తంలో ఉద్భవించినవే. కానీ, ఆ రోజు మాత్రం వైఎస్‌ యోగాభ్యాసం చేస్తున్న మనసంతా ముందురోజు అసెంబ్లీలో జరిగిన సంఘటన గుర్తొచ్చి కుతకుత లాడిపోతోంది.

అయినా, తనన్న మాటలో తప్పేముంది? పనికిమాలిన పేపరోళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేస్తే, బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు దాన్ని పట్టుకుని అసెంబ్లీలో ప్రస్తావిస్తాడా? తన కుటుంబ సభ్యుల మీద అంతలేసి అభాండాలేస్తాడా? తనకి కోపం వచ్చిందంటే రాదూ మరి! “మీకూ బుద్ధిలే, వాళ్ళకీ బుద్ధిలే … కూర్చో!” అని గద్దించాల్సి వచ్చిందంటే ఆ తప్పంతా ముమ్మాటికీ చంద్రబాబుదే… అయినా, అంత చిన్న మాటకి అంత పెద్ద రాద్ధాంతం చేస్తారా? వాళ్ళ గొడవ భరించలేక తాను అన్న మాటలు విత్‌డ్రా చేసుకోవాల్సి వచ్చింది. “బుద్ధి అంటే నా ఉద్దేశంలో విజ్ఞత అని అర్థం” అని మాటమార్చి తప్పించుకోవాల్సి వచ్చింది. ఇస్సీ … ఎంతటి అవమానము, నిండు సభలో ఎంతటి పరాభవము? దీనికి తగిన ప్రతీకారము శాయవలె …”

వైఎస్‌ మనసు పరిపరివిధాలా పోతోంది. చివరికి ఆ బ్రహ్మ ముహూర్తంలో ఆయనకి చిన్నప్పుడెప్పుడో చదివిన జోకు గుర్తొచ్చింది. దాన్ని ప్రతిపక్షాల మీద ప్రయోగించాలని నిర్ణయించుకున్నాడు. అప్పటిగ్గానీ వైఎస్‌ మనసు శాంతించలేదు.
***
మర్నాడు, అసెంబ్లీలో తన ఛాంబర్‌లో ప్రతిపక్ష నాయకుల్ని ‘టీ’కి ఆహ్వానించాడు వైఎస్‌. ఎంతైనా సిఎం కదా అని చంద్రబాబు, దేవేందర్‌గౌడ్‌, లక్ష్మణ్‌, నోముల నర్సింహయ్య ఇత్యాది ప్రతిపక్ష నాయకులు వైఎస్‌ ఛాంబర్‌కి వెళ్ళారు.
“రండి, రండి … నిన్న నేనన్న మాటల మీద పెర్సనల్‌గా వివరణ ఇద్దామని పిలిచాను” అన్నాడు వైఎస్‌.
“ఇంకా వివరణ ఏమిటంటే … విత్‌డ్రా చేసుకున్నట్టే చేసుకుని, తెలుగులో తిట్టిన తిట్టుని సంస్కృతంలోకి మార్చారు.. నిజానికి అది కూడా మాకు నచ్చలేదు .. పోనీ కదా అని వదిలేశాం…” కోపంగా అన్నాడు చంద్రబాబు.
“మా తమ్ముడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తే నాక్కోపం రాదా? అయినా తమ్ముడంటే ఎవరనుకున్నారు. వివేకానంద రెడ్డి కాదు … సాక్షాత్తూ స్వామీ వివేకానందుడు … చేతులు కట్టుకోని వివేకానందస్వామి … అంతటి మహనీయుడి మీద లక్ష తిన్నాడు, రెండు లక్షలు తిన్నాడు అని చీప్‌గా నిందలేస్తారా?” బల్లగుద్ది ప్రశ్నించాడు వైఎస్‌. (ఈయన గారు హైరరాబాదులో మస్తు భూకబ్జాలు చేస్తడంట. వీడు స్వామి వివేకానంద ఏంది.)
“మరేం … అంత చీప్‌గా లక్ష, రెండు లక్షలు అంటే ఏం బావుంటుందీ? అనుకోడానికైనా కోట్లు అని అనాలని కాబోలు మరి ఆంతర్యం” ఎకసెక్కెంగా అన్నాడు నర్సింహయ్య. “ప్రతిపక్షాలన్నాక ప్రభుత్వాన్ని నిలదీస్తామండీ … అలా కాదూ, కూడదూ అంటే మాకో డోలూ, సన్నాయి ఇప్పించండి … తానతందాన, రాజాధి రాజా అంటూ పొగుడుతూ కూర్చుంటాం” ఎగతాళి చేశాడు దేవేందర్‌ గౌడ్‌.
“మీరంతగా అడుగుతుంటే కాదనగలనా? ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు చేయమని రోశయ్య గారికి చెప్తా” అన్నాడు వైఎస్‌.
చంద్రబాబు అసహనంగా కదిలాడు. “మహానుభావా! ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు?”
“అదే చెప్పబోతున్నా! మీకు బుద్ధి లేదు అని నిన్న అన్నా కదా! అది తప్పే … మీ అందరికీ బుద్ధి లేదు అని చెప్పడం కాదు నా ఉద్దేశం … మీలో సగం మందికి మాత్రమే బుద్ధి లేదు అని నా ఆంతర్యం” వివరణ ఇచ్చాడు వైఎస్‌.
ప్రతిపక్ష నేతలంతా ఒంటి కాలిమీద లేచారు. బుద్ధిలేని సగం మంది ఎవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసలు బుద్ధి లేదు అన్న పదప్రయోగమే ఛండాలంగా ఉందని ధ్వజమెత్తారు. వైఎస్‌ వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఇక్కడే ధర్నా చేస్తామని బెదిరించాడు.
వైఎస్‌ వారిని సముదాయించాడు.
“శాంతించండి, శాంతించండి … నేనన్న మాట సవరించుకుంటున్నాను. మీలో సగం మందికి బుద్ధి లేదనడం కూడా తప్పే. ఆ మాట విత్‌డ్రా చేసుకుంటున్నాను. మీలో సగం మందికి మాత్రమే బుద్ధి ఉంది … సరేనా?”
ప్రతిపక్ష నాయకులు ఒకరిమొహం ఒకరు చూసుకుని విరగబడి నవ్వారు.
“ఇప్పుడు మీరన్నదానికి మేం పొంగిపోయి చంకలు గుద్దుకుంటూ విజయగర్వంతో వెళ్ళిపోతామనుకుంటున్నారా? మాక్కూడా ఆ జోకు తెలుసు సారూ! ఈ శషభిషలు కట్టిపెట్టి క్షమాపణ చెప్తారా, లేదా ధర్నా ప్రారంభించమంటారా?”
వైఎస్‌ ఇబ్బందిగా మళ్ళీ సారీ చెప్పి, తానన్న మాటలు విత్‌డ్రా చేసుకుని, వాళ్ళని శాంతింపచేశాడు. చంద్రబాబు వెళ్ళిపోతూ వైఎస్‌తో అన్నాడు.
“వైఎస్‌ గారూ! ఈ మధ్య మీరు తరుచూ పప్పులో కాలేస్తున్నారు. మాకు బుద్ధి లేదంటున్నారు గానీ అసలు మీకు బుద్ధి ఉందో లేదో ఓసారి చెక్‌ చేసుకోండి … ఎందుకైనా మంచిది.”
వైఎస్‌ గతుక్కుమన్నాడు.
***
లోకంలో అందరూ ఆదమరిచి నిద్రపోతున్న ఆ వేళలో … ఆ బ్రహ్మముహూర్తంలో …
వైఎస్‌ యోగాభ్యాసం చేస్తున్నాడు. హఠాత్తుగా చంద్రబాబు అన్న మాటలు గుర్తొచ్చాయి. యథాలాపంగా మంచం వైపు చూశాడు.
మంచం మీద ఓ ఆకారం పడుకున్న భంగిమలో కనిపించింది. అదిరిపడ్డాడు వైఎస్‌.
“ఏయ్‌ … ఎవర్నువ్వు? నా మంచం మీదికి ఎలా వచ్చావు?”
“నేనూ .. నీ బుద్ధిని … మంచి నిద్రలో లేపావు …” ఆ ఆకారం ఆవలిస్తూ విసుక్కుంది.
“అదేమిటి? నువ్వు నాతో ఉండకుండా అలా బజ్జుంటావేం? వచ్చెయ్‌ .. నాలో ప్రవేశించు” కంగారుగా అన్నాడు వైఎస్‌.
బుద్ధి అటువైపు ఒత్తిగిల్లి బద్ధకంగా చెప్పింది.
“అసలు ఏ రోజు, ఏ బ్రహ్మ ముహూర్తంలో లేచి నీతో ఉన్నానని ఈ రోజు నన్ను రమ్మంటున్నావు. ఇన్నాళ్ళూ నువ్వు గమనించలేదు గానీ బ్రహ్మ ముహూర్తంలో వేచి నీ పాట్లు నువ్వు పడుతున్నప్పుడు నేనిక్కడ గుర్రుపెట్టి నిద్రపోతుంటా!” “అంటే … బ్రహ్మ ముహూర్తంలో నేను ఆలోచనలు చేసేటప్పుడు, నేను నిర్ణయాలు తీసుకునేప్పుడు నువ్వు నాతో ఎప్పుడూ లేవన్నమాట” తెల్లబోతూ అడిగాడు వైఎస్‌.
“అన్న మాటేగా .., ఇక పడుకుల్టా … ళిద్దస్తోళ్ది …” ఆవలిస్తూ చెప్పింది బుద్ధి.

(రాజగోపాల్ రచన, ఆంధ్రజ్యోతి)

ప్రకటనలు

2 thoughts on “రావణ”బ్రహ్మ ముహూర్తం”లో రాజశేఖర రెడ్డి

  1. మొత్తం చదివే ఓపిక ఇప్పుడు లేదండీ, కానీ ఈ వీడియో చూడండి, మన రాష్ట్రంలో అడిగేవాడు లేక పోతే ఎవరు కావాల్సింది వాళ్ళు చేసేస్తారు, ఎవరన్న అడిగితే తొక్కేస్తారు, అడగాల్సిన వాళ్ళు అడిగితే ఇలా గుటకలు మింగుతుంటారు,
    గమనిక: నాకు ఎవరిమీదా ఏ దురుద్దేశమూ లేదయ్యో!
    http://www.ibnlive.com/videos/33865/devils-advocate-ysr-reddy.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s