రేపు రాష్ట్ర బంద్‌ అంట

వార్త: కోటాపై స్టేకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర బంద్‌
వ్యాఖ్య:
యెదవలకు పనీ పాటా లేకపోతే సరి. కుల ప్రాతిపదికన రిజర్వేషన్ అనే మోపి  ముండ బిల్లును సుప్రీమ్ కోర్టైనా ఆపిందిరా (స్టే) అనుకొంటే….ఈ బేవార్సు రాజకీయ నాయకులు బంద్ అని ఇదని తెగ గోల పెడుతున్నారు. ధర్మాసనమిచ్చిన తీర్పును గౌరవించలేని వీళ్ళు నాయకులేనా? నా స్నేహితుడికి EAMCETలో 200లోపల ర్యాంకు వచ్చింది. వాడి మెరిట్ కు తగిన విధంగా RECలో Electronics & Communications శాఖలో సీటు వచ్చింది. వాని పక్కనే కుర్చునే ఒకడికి 18,000+ ర్యాంకంట. కులానికి వాడు వెనకబడినోడేమో కానీ డబ్బులో కాదు కదా! వాడికి ఊర్లో వానికి పెంట్రోలు బంకులు, థియేటర్లు, రైస్ మిల్లులు ఉంటాయేమో యెవడికి తెలుసు. 200 పైన 18000 లోపల ర్యాంకు వచ్చిన పేదవాళ్ళందరికీ అన్యాయం జరిగినట్లే కదా! ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా ఉందా?

ప్రకటనలు

8 thoughts on “రేపు రాష్ట్ర బంద్‌ అంట

 1. రాజకీయ పార్టీ ల మధ్య, దేనికీ లేని సంఘీభావం, ఏకాభిప్రాయం ఈ విషయం లో మాత్రం వెంటనే వచ్చింది. ఒకడు దగ్గరుండి బంద్ అంటే, ఒకడు ప్రభుత్వ సెలవు అంటున్నాడు.
  వెధవలు, వోట్ల కోసం ఐ యస్ ఐ కి మద్దతివ్వమన్నా ఇస్తారు.

 2. మన ఘనత వహించిన నాయకులు చాలా తెలివిగా రాజ్యాంగం రచించారు. పేద, ధనిక అనే రెండే జట్లు వుంటే ఆట మజా వుండదని, వేల జట్లు తయారయ్యేలా కులాల పరంగా వాటాలు ఇద్దామని నిర్ణయించారు. ఈ వాటాలు ఇప్పుడు ప్రధాన రాజకీయమై కూర్చుంది. పార్లమెంటు మీద దాడి చేసిన వాడినే వురి తియ్యలేని కొజ్జా ప్రభుత్వాలు మనవి. ఇక సుప్రీమ్ మాట ఏం వింటారు ? ప్రధాన న్యాయ మూర్తులే కళ్ళ నీళ్లు పెట్టుకుని బెంచి నుంచి వైదొలగడం మరిచారా?

  వినరా వినరా దేశం మనదేరా? కనరా కనరా కలలే కనరా? కేవలం కలలే కనరా…

 3. చాల బాగా చెప్పారు…

  ఈ ఆర్టికల్ చూడండి:
  http://www.andhrajyothy.com/archives/archive-2007-4-2/editshow.asp?qry=/2007/apr/1edit3

  తమిళనాడు ని ఆదర్శం గా తేసుకోవాలంట… అంటే అక్కడిలాగ కులాల ప్రాతిపదిక మీద కొట్టుకోవాలనా?
  http://en.wikipedia.org/wiki/Anti-Brahmanism#In_Tamil_Nadu

 4. ప్రజలకు సుపరిపాలనా అందించాల్సిన ప్రభుత్వాలు, న్యాయస్తానాల తీర్పులను గౌరవించి, వాటిని శిరసావహించి అమలుపర్చాల్సిన ప్రభుత్వాలు, అవగాహనలేమితోనున్న సామాన్య ప్రజలకు, సర్వోత్తమన్యాయస్తానం వెలువరించే తీర్పులను, వాటి అంతరార్దలని విడమరిచి, విశిదికరించి చెప్పాల్సిన భాధ్యతకల్ల ప్రభుత్వాలే తెగబడి కోర్టుతీర్పులకు వ్యతిరేకంగ బందు పిలుపులివ్వటం లేదా మద్దతివ్వటం అంటే కంచే చేను మేసినట్లు కాదా? ఎక్కడకుపోతుంది మన రాజకీయవ్యవస్త?. ఈలాంటి అపహాస్యపు పనులకు గాను, ఇకనైనా సుప్రీం కోర్టు పూనుకొని ఆయా ప్రభుత్వాధినేతలుకు కఠినశిక్షలు విధించి, అవి అమలుపరిచేటట్లు చూస్తేగాని, ఈ రాజకీయనాయకులకు బుద్దిరాదు.

 5. రేప్పొద్దున సుప్రీం కోర్టు మీద దాడి చెయ్యరని నమ్మకముందా? అసలు అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పిందో ఈ రోజు రోడ్ల మీద స్వైర విహారం చేసే ఒక్కడికైనా తెలుసా?
  దేశం ఎప్పుడో కళేబరంగా మారింది. ఇప్పుడంతా వాటా రాజకీయమే.
  బలహీనుల్లో కూడా పెద్ద బలహీనుడు, చిన్న బలహీనుడు ఉన్నారిప్పుడు. దేశాన్ని మొత్తం స్థంభింప చేస్తున్నారు. అదీ ప్రభుత్వాల సహాయంతో. ఎవరు బలవంతులో అర్ధం కావటం లేదు

 6. నాకయితే, అసలు ఈబందు ఎందుకోసమని ఇది తలపెట్టినవారిలో ఒక్కరైనా ఆలోచించారా అనే సందేహం కలుగుతుంది. జాతీయ కాలేజీలలో చదవడానికి మన రాష్ట్రంనుండి మహా అయితే సంవత్సరానికి 10000 మంది వెల్తారేమో. ఈ 25% రిజర్వేషను వల్ల ప్రభావితమయ్యేది కేవలం 2-3 వేల మంది మాత్రమే. దీనికోసం 10 కోట్లమంది జీవితాలు స్థంబింపచెయ్యాలా? సంవత్సరాని 2-3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే నాధుడే లేడుగాని, ఇలాంటి బుర్రలేని పనులు చేయడానికి మాత్రం రాజకీయనాయకులంతా కట్టగట్టుకు బయలుదేరారు.

  మన ముఖ్యమంత్రిగారు శాసనసభలో ఒకసారి వాడిన పదాలలోనే చెప్పాలంటే, బందు పిలుపునిచ్చిన ఆ సంఘాలవారికి బుద్దిలేదు. వారు అలా పిలుపివ్వడమే ఆలస్యం సై అంటే సై అని బయలుదేరిన ఈ రాజకీయ నాయకులకు అంతకంటే బుద్దిలేదు.

 7. వెధవలు…
  కాలాన్ని వృధా చెయ్యడానికి ఏదో ఒక సాకు కావాలి. ఇన్నాళ్ళకు సుప్రీం కోర్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని చెడదొబ్బే వరకూ మనశ్శాంతి ఉండదు వీరికి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s