• టాజా షరుకు

 • ఉట్టమ టపాళు

 • పాట షరుకు

 • వర్గాలు

 • Blog Stats

  • 247,429 హిట్లు

ఇది ఫార్వర్డ్ చెయ్యండి డబ్బులొస్తాయి (?)

రాధికగారు తెలియని తెలుగు బ్లాగర్లు ఉండరేమో. ఉత్తమ బ్లాగర్ల పోటీ ఉన్నట్టే…ఉత్తమ వ్యాఖ్య అనో లేక ఉత్తమ కవిత అనో పోటీ ఉంటే తప్పకుండా రాధిక గారు ఆ అవార్డు గెలుచుకొంటారు. రాధిక గారి వ్యాఖ్యకు నోచుకోని తెలుగు బ్లాగున్నదా? నాకు తెలిసి లేదు.

ఇప్పుడు అసలు విషయానికొస్తా…అదేదో బ్లాగులో రాధిక గారు ఈ విషయాన్ని అడిగినట్లు గుర్తు. “నాకు కళ్ళు పోయాయి….నాకు కిడ్నీలు పాడయిపోయాయి …ఇది ఫార్వర్డ్ చెయ్యండి డబ్బులొస్తాయి. ఒక్కొక్క మెయిల్ ఫార్వర్డ్ కు ఒక్కొక్క డాలరు” అని వస్తాయి. వాటికి నిజంగా డబ్బులొస్తాయా అని.

ఇదంతా శుద్ద అపద్దం. ఒక ఈమెయిల్ ను పట్టుకొని దాని పూర్తి చరిత్ర కనుక్కోవడం అసాధ్యం (It is technically impossible to track history of email). కాబట్టి ఇలాంటి చెత్త మెయిల్స్ వస్తే నిశ్చింతగా డెలీట్ చేసెయ్యండి. బ్యాండ్ విడ్త్ ఆదా చేసుకొన్నవాళ్ళౌతారు.

ప్రకటనలు

4 స్పందనలు

 1. మరీ ఎక్కువ చెప్పేసారండి.ఇలా కామెంట్లు రాసే అలవాటు నేను స్పందన ప్రసాదు గారిని చూసి నేర్చుకున్నాను.ఆయన ఈ మధ్య తగ్గించేసారు గానీ ప్రతి బ్లాగులో ప్రతీ పోస్టులో మొదటి కామెంటు ఆయనదేవుండేదండి.ఒక కామెంటు ఎంత ఆనందాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుందో నేను స్వయం గా అనుభవించానుకాబట్టి ఇలా అన్ని చోట్లా కామెంట్లు రాస్తున్నాను.ఇప్పుడు ఖాళీ వుండట్లేదండి.అన్నట్టు నా అనుమానం తీర్చినందుకు థాంక్స్.ఇన్నాళ్ళూ ఇలాంటివి ఒక 50 మెయిల్స్ ఫార్వర్ద్ చేసుంటాను అయ్యో పాపం అనుకుంటూ..

 2. ఈ మెయిళ్ల వెనక కొన్ని కొంటె, చెత్త వుద్దేశాలు వుంటాయి. ఉదాహరణకు ఒక కోలా కంపనీ మరొక కంపనీని దెబ్బ తీసే ప్రయత్నంలో ఒక hoax లేఖ సృష్టించవచ్చు. లేదా జబ్బులను అడ్డం పెట్టుకుని దాతలను వెతికే ప్రబుద్ధులు కూడా ఈలాంటివి చెయ్యొచ్చు.

 3. రాధిక గారూ,
  ఇంతకుముందిన్ని బ్లాగులుండేవి కాదు గనుక అన్నీ చదవడం అన్నిటికీ తోచిన కామెంట్లు రాయడం వీలయ్యేది. ఇప్పుడు అమ్మో అన్నీ చదవాలంటేనే సమయం సరిపోవటం లేదు.
  నా నుంచీ కామెంట్లు వ్రాసే స్పూర్తి పొందినందుకు ఆనందంగా వుంది.

  –ప్రసాద్
  http://blog.charasala.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: