లలితగారి వ్యాఖ్యకు నా ప్రతి వ్యాఖ్య

ముందు ఈ టాపా చదవండి.

ప్రతివ్యాఖ్య:
మన వేదాలలో చెప్పిన వాటికీ ఎందుకు సామ్యాలు చూపించెయ్యడం?
లలితగారు, వేదాల్లో (ఆ మాటకొస్తే పురాతన పుస్తాకాలు కూడా) ఉన్న మాటల్ని అంత తేలిగ్గా కొట్టి పారెయ్యకండి. ఇది “మనం అప్పట్లోనే ఇంతకన్నా గొప్పగా ఉండే వాళ్ళమన్నమాట” అని రుజువు చేసుకొనే ప్రయత్నం కాదు. ఆ వ్రాతల్నిబట్టి అప్పటి నాగరికత పరిపక్వత గురించి తెలుసుకొనే ప్రయత్నం. ఉదాహరణకు ఒక శ్లోకంలో “భూగోళం” అని వ్రాసుందనుకొందాము. అంటే…ఆ శ్లోకం వ్రాసిన సమయంలోనే వారికి భూమి గోళాకారంలో ఉందన్న నిజం. తెలుసన్నమాట. విష్ణుసూక్తం లో జఠరాగ్ని గురించి, గుండె గురించి వివరింపబడి ఉంది. అంటే అప్పట్లోనే వారికి ఈ జీర్ణ ప్రక్రియ గురించి తెలుసన్న మాట. శ్రీ చక్రం జాగ్రత్తగా చూస్తే అందులో దాగున్న ఎన్నో గణిత శాస్త్ర సూత్రాలు తెలుస్తాయి. వీటి ద్వారా అప్పటి నాగరికత ఉన్నతమైనదని, శాస్త్రాల పట్ల అవగాహన ఉన్నదని చెప్పవచ్చు. గాంధారి గర్భంలో విచ్చిన్నమైన పిండాన్ని నూరు పిండాలుగా మార్చడాన్ని క్లోనింగ్ ను పోలుస్తారు కొందరు.వ్యాసుడికి క్లోనింగ్ అంటే ఏమిటో తెలియకపోవచ్చుగానీ ఆ ఊహైతే ఉంది కదా? పుష్పక విమాన ప్రస్తావన కూడా మనవాళ్ళు వేల సంవత్సరాల ముందు మనిషి గాలిలో ఎగరాలన్న దాని గురించి ఆలోచించారన్న దాని గురించి తెలియపరుస్తుంది. ఈ పోలికలు తేవడం అంతా ఒక శాస్త్రీయమైన అధ్యయనమే తప్ప…మన తృప్తికోసం కాదు. అమెరికా వాళ్ళు జీసస్ చనిపోయిన మూడు రోజుల తరువాత వచ్చాడని, ఆదాం..అవ్వ నిజంగానే ఉన్నారని, ఈ సృష్టి బైబిల్ లో చెప్పిన విధంగానే జరిగిందని చెప్పటానికి శాస్త్రీయమైన ఎన్నో అధారాలు చూపారు. (Watch NGC Channel Tuesday programs). ఆ పనులు వాళ్ళ మత విశ్వాసాలను తృప్తిపరుచుకోవటానికి అని అనుకోవాలా? శాస్త్రీయమైన అధ్యయనం అనుకోవాలా?

ఇవి కాకుండా వేరే దేశస్థులు , వేరే మతస్థులు “వాటర్” లాంటి సినిమాలలో చూపించిన తరాల వెనుకటి సాంఘిక దురాచారాల గురించి మనని నిలదీస్తే మనం కంగారు పడడం, మన గొప్పతనం ఏంటో వెతుక్కునేలోపు మనం వారి వాదనలకి లోబడిపోవడం జరుగుతుంది

ఈ విషయం గురించి కంగారు పడాల్సింది ఏముందండి? తప్పు తప్పే. విశ్వాసాలు చెత్తవే. మనల్ని నిలవదీసెంత ఉన్నత ఆచారాలు, విశ్వాసాలు వేరే ఏ దేశానికిగానీ, మతానికి గానీ లేవుగాకలేవు. కాబట్టి వారికి వివరణ ఇచ్చుకోవలసినంత శ్రమ మనం తోసుకోనవసరం లేదు.

ప్రకటనలు

15 thoughts on “లలితగారి వ్యాఖ్యకు నా ప్రతి వ్యాఖ్య

 1. “మనల్ని నిలవదీసెంత ఉన్నత ఆచారాలు, విశ్వాసాలు వేరే ఏ దేశానికిగానీ, మతానికి గానీ లేవుగాకలేవు”
  That’s exactly my point Naveen garu. Now, what exactly are those values?

  నేను చివరకు రాసింది ఇది.
  “కలిసి పూనుకుందా. సామాజిక దురాచారాలను దూరం చేసుకుందాం. మన సాంస్కృతిక, జ్ఞాన సంపదను కాదు.”
  ఇంకా ఏమన్నానంటే
  ఇప్పటి విజ్ఞానం ఇప్పటితో ఆగిపోయేది కాదు.
  అందుకని సామ్యాలు ఇప్పటి విజ్ఞానకి పోల్చి చూపించేసే ప్రయత్నాల మీద కంటే,
  అసలైన సంపద అయిన “జ్ఞాన” సంపదను వెలికి తీసే ప్రయత్నాలు చేద్దాము అని నా విన్నపం.
  నేను ఇచ్చిన ఉదాహరణలు
  “సత్యమేవ జయతే”
  “ఓం సహనావవతు….ఓం శాంతిః శాంతిః శాంతిః”

  సర్వజనీనమైన మంచిని వెతికి తీసి ఎక్కువ ప్రచారంలోకి తెస్తే, ఒక్క దెబ్బకి రెండు పిట్టలు లాగా – సాంఘిక దురాచారాలకీ పెట్టు, మన ఆత్మ గౌరవం మీద దాడి చేసే వాళ్ళనీ అడ్డుకోవచ్చు.

  ఒకప్పుడు “వాటర్” లాంటి వాటిల్లో చిత్రికరించిన వంటి సమస్యలను యుద్ధ ప్రాతిపదిక మీద ఎదుర్కోవలసిన అవసరం ఉండినది. ఇప్పుడు వేరే రకంగా స్త్రీలు ఇంకా ఎన్నో సంస్యలను ఎదుర్కొంటున్నారు. కాకపోతే ఆ సమస్యలను ఎదుర్కోవడానికి ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం అడ్డంకులు తగ్గాయి. అలాగే కుల వ్యవస్థ కూడా. సామాజిక దురాచారలను “ఒప్పేసుకుందాం”. అంతటితో ఏ సమస్యా తీరదు.

  ఒక స్నేహితురాలు చిన్నగీత, పెద్ద గీత ఉదాహరణ ఇచ్చి మనం మంచిని పెంచుకుంటూ పోయి చెడును తగ్గిద్దాం అంది. అది నాకు బాగా నచ్చింది. అప్పుడు గురజాడ వారి “మంచి అన్నది పెంచుమన్న” అన్న మాటలకు కూడ క్రొత్త అర్థాలు తోచాయి.

  ఆలస్యమెందుకు? ఇంతమంది బ్లాగర్లూ మంచి ఉద్దేశ్యాలతోనే ఉన్నారు. పోదాం ముందుకు. మంచిని వెతికి పట్టుకుందాం. పదిమందికీ పంచుదాం. ఇదీ నా పిలుపు. ఇదీ నా విన్నపం.

 2. ఎలా చూసినా నాకు ఇద్దరూ చెప్పింది ఒకటే అనిపిస్తుందేమిటి? నవీన్ గారు అక్కడ మీరు నీలి రంగులో రాసిన వాక్యాలు నాకు బాగా వర్తించేవి ఒక వారం క్రితం వరకు.ఇప్పుడు కాదులెండి.

 3. నవీన్ గారూ,
  మీ ఈ మాట “మనల్ని నిలవదీసెంత ఉన్నత ఆచారాలు, విశ్వాసాలు వేరే ఏ దేశానికిగానీ, మతానికి గానీ లేవుగాకలేవు” చదువుతూ వుంటే రాజకీయ నాయకులు తరచుగా అనే “నన్ను విమర్షించే నైతిక హక్కు నీకు లేదు” మాట జ్ఞప్తికి వచ్చింది. నేను చేసింది తప్పు అయితే అది తప్పు అని చెప్పడానికి సచ్చీలుడూ, సత్వవంతుడే రానక్కరలేదు.
  ప్రాధమికంగా వున్న ధర్మాలలో హిందూ ధర్మాన్ని నేనూ శ్లాఘిస్తాను అయితే ఎక్కడ కల్మశమూ, మురికి వున్నాయో వాటిని విమర్శించడానికీ వెనుకాడను. తల్లి తన బిడ్డ తప్పు చేసినా దండించినట్లే మన ఆచారవ్యవహారాల్లో తప్పులున్నా అంగీకరించాలి, సరిదిద్దుకోవాలి. అంతేగానీ ఏ ఇతర మతమూ మనకు సాటిరాదు అని ప్రతిదాన్నీ సమర్థిస్తూ పోజాలము.
  ప్రతి మతంలోనూ, సమాజంలోనూ మంచీ వుంది, చెడూ వుంది.
  మంచి ఎక్కడ వున్నా స్వీకరిద్దాం. చెడు ఎక్కడ వున్నా విసర్జిద్దాం.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 4. మొదటి పేరా వ్రాయడంలో ఓపిక కరిగిపోయి..సమయం తరిగిపోయి, రెండవ పేరా విపులంగా వ్రాయకపోవడం నా తప్పే. ఆ రెండవ పేరాను వ్రాయడానికి ప్రేరేపించిన వాక్యాలు ఇవి: “వెనుకటి సాంఘిక దురాచారాల గురించి మనని నిలదీస్తే మనం కంగారు పడడం, మన గొప్పతనం ఏంటో వెతుక్కునేలోపు మనం వారి వాదనలకి లోబడిపోవడం జరుగుతుంది”.

  నేననేది..అసలు కంగారు పడటం, వారి ముందు మనం తప్పు చేసిన వారిలా ఫీలవటం, ఈ దురాచారాలు నా మతంలోనే ఎందుకున్నాయిరా దేముడా అనుకోవడం ఎందుకు అని. నేనే చెప్పాను కదా “తప్పు, తప్పే” అని. అది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే. అసలు ఆ అనాచారాలు ఉన్నప్పుడు మనం లేము. వాటిని పట్టుకొని ఏ పరదేశో వచ్చి “హేరా….నీ బ్యాక్ గ్రౌండు ఇంత చెత్తదా!!! మీ ఆచారాలు ఇంత దరిద్రమైనవా…ఏమి జాతిరా మీది” అని అంటూంటే…మనం ఫీలవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే..ఆ ఆచారాలను ఇప్పుడు లేవు, ఇప్పుడు ఎవరూ పాటించడంలేదు.

 5. నవీన్ గారు, రాధిక గారు, ప్రసాద్ గారు,

  నేను రాసిన వ్యాఖ్యలో ముఖ్య విషయం ఎవరూ గ్రహించినట్లు లేదు.
  నేను ఈ సంభాషణను మరి ఒక్క సారి సందర్భ సహితంగా వివరిస్తూ నా బ్లాగులో రాసే ప్రయత్నం చేస్తాను.

  నా విన్నపం మరలా అక్కడ వినిపిస్తాను.

  లలిత.

 6. నారాయణం గారు,

  క్షమించాలి. నాకు మీరు చెప్ప దల్చుకున్నది అర్థం కాలేదు.

  నేను చెప్పదలచుకున్న దాంట్లో వ్యంగ్యం లేదు. చాలా తిన్నగా చెప్పాననే అనుకున్నాను. ఉత్తమ వైజ్ఞానికులను కూడా అబ్బుర పరిచే విషయాలు ఉన్నాయి మన సాహిత్యంలో, అవి వివరాలతో సహా పైకి తీసి ఎక్కువ ప్రచారంలోకి తెద్దాము అని నా ప్రార్థన. ఎవరికైనా తప్పులు తోస్తే క్షమించగలరు.

  నేను నా బ్లాగులో నా అభిప్రాయాలను పోగు చేసుకుంటున్నాను. ఆసక్తి ఉన్న వారు కూడలిలో ఆ టపా కనిపించినప్పుడు వచ్చి చూడ గలరు. అభిప్రాయాలు తెలుప గలరు. కాసిని మంచి విషయాలు తెలుప గలరు.

  లలిత.

 7. లలితగారు మీ ప్రయత్నం చాలా మంచిది. మీ అభిప్రాయాలతో నేను కూడా 100% ఏకీభవిస్తున్నాను. ఒక్క “సత్య హరిశ్చంద్ర” నాటకం గాంధీని మహాత్ముణ్ణి చేసింది. ఇలాంటివి మన వేదాల్లో, పురాణాలలో ఎన్నోఉన్నాయి.
  ఇక నారాయణగారు చెప్పదలచుకొన్నదేదో నాకు ఒక్క ముక్కా అర్థం కాలేదు. అందరూ అపార్థమో అర్థమో చేసుకునే లోపలే ఈ వ్యాఖ్యను ఆయనే డీకోడ్ చేస్తే మంచిది.

 8. లలితగారి వాదంలోని సారాంశం నాకు కొంచెం అర్థమైందనుకుంటున్నాను. అదేంటంటే-

  1. కులాలు ఉన్నాయి కాబట్టి ధర్మశాస్త్రాలు చెడ్డవి
  2. మూఢవిశ్వాసాలు ఉన్నాయి కాబట్టి హిందూమతం చెడ్డది, అది ఇతర దేశాలవారి ముందు ప్రదర్శించుకోవడానికి మనం సిగ్గుపడదగినది.(ఆ దేశాలవారికి ఏ మూఢవిశ్వాసాలూ లేవు. వారు మానవాతీతులు)

  3. ప్రపంచం black and white లో ఉంది. మరో రంగుకి తావు లేదు. స్త్రీలని అణిచివేసినవారు వేదాల్ని ప్రమాణంగా పేర్కొన్నారు కాబట్టి వేదాల్లో విజ్ఞానం ఉండడానికి గాని అది ఉందని ఒప్పుకోవడానికి గాని వీల్లేదు. ఒకవేళ ఉంది అని ఎవరైనా వాదిస్తే వారు సదరు అణచివేతను సమర్థిస్తున్నట్లు లెక్క.

  4. ఒక వ్యక్తి ఏం చెబుతున్నాడనేదానికన్నా ఆ వ్యక్తి ఏ కులం ఏది ? ఆ వ్యక్తి ఆడా ? మగా ? అనేది చాలా ముఖ్యమైన విషయం.

 9. సుబ్రహ్మణ్యం గారు,
  క్షమించాలి. చాలా పొరబడ్డారు. నేను కొన్ని ఉదహరిస్తాను నా టపా నుండి.
  అవి చూసి తరవాత మరలా నా టపా, దాని పై వ్యాఖ్యాలూ చదివి మళ్ళీ ఒక సారి మీ అభిప్రాయం తెలుపండి.

  “ఏ దురాచారాలకూ వేద పరమైన “sanction” లేదు అని నా నమ్మకం.”
  ” ఏది ఏమైనా, ఎంతో మంది మహామహుల చేత గొప్పగా అంగీకరించబడ్డ “ఆధ్యాత్మికత”, “సర్వే జనాః సుఖినో భవంతు!”, “సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్దుఃఖభాద్భవేత్!” వంటి సర్వ మానవాళి శ్రేయస్సును ఆకాంక్షించే మంచి మాటలు మనకే సొంతం, అది నిజం.”
  “ఇప్పుడు వాటిలో ఏవో ఉన్నాయని చెప్తున్నారు, అదంతా వట్టి మాటలే, ఫలానా చోట ఈ దురాచారం గురించి గొప్పగా రాసారు, అందువల్ల ఆ గ్రంథం మేము చదవం అని దూరం చేసుకోవడం తప్పంటాను నేను.”
  “అవకాశం ఇప్పుడు అందరికీ అందుబాట్లో ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకుని వీలైనంత తెలుసుకుందాం, పంచుకుందాం. ”
  “ఏది ఏమైనా, ఎంతో మంది మహామహుల చేత గొప్పగా అంగీకరించబడ్డ “ఆధ్యాత్మికత”, “సర్వే జనాః సుఖినో భవంతు!”, “సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్దుఃఖభాద్భవేత్!” వంటి సర్వ మానవాళి శ్రేయస్సును ఆకాంక్షించే మంచి మాటలు మనకే సొంతం, అది నిజం.”
  “ఇన్ని రకాలుగా అవే విషయాలు మాట్లాడే వారు, “విలువలు” అన్న ఒక్క మాటతో మిగిలిన వాటన్నిటినీ చెప్పేశామనుకుంటారా? “లోకా స్సమస్తాః సుఖినో భవంతు”, “ఓం! శాంతిః శాంతిః శాంతిః”, “సత్యమేవ జయతే!”, “ఓం! సహనా వవతు, సహ నౌ భునక్తు…” ” ఇలాంటివి ఎక్కువ చెప్పనవసరం లేదంటారా? “

 10. Subrahmanyam gaaru,

  about “ఒక వ్యక్తి ఏం చెబుతున్నాడనేదానికన్నా ఆ వ్యక్తి ఏ కులం ఏది ? ఆ వ్యక్తి ఆడా ? మగా ? అనేది చాలా ముఖ్యమైన విషయం.”

  There is something called a perspective. What I take as “advice” from my mother, I could take as “imposing” from my mother-in-law.

  The relationship, gender and other attributes of a person do play a role in the way the person’s words are received.

  I do appreciate your reasoning and I depended on it and the expertise you seem to having on some of our sacred texts, and hoped you would give us all more insights into other aspects of the sacred texts as well. I am still holding that hope.

  Your explanations take me back to my father’s discussions on the same topics. Your reasoning sounds very familiar. The difference is, I meet with them on a different platform.

  I don’t think it’s fair to write any more on this here or now.

  Regards,
  lalitha.

 11. లలిత గారూ,
  ఇంకా మీరు లలిత గారేనా? లలితాంబిక కాదా? :) తాడేపల్లి గారు మిమ్మల్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు.
  పాపం లలిత గారు!

  –ప్రసాద్
  http://blog.charasala.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s