ర్యాగింగ్ భూతమా?

ర్యాగింగ్ భూతమా? కానే కాదు, అదో వరం (సీనియర్లకు). ర్యాగింగ్ నిరోధించడానికి ప్రభుత్యం / కోర్టులు ఇంతలా చర్యలు తీసుకోవడం విచారకరం. దీనికి బదులుగా ఎంత మేరకు ర్యాగింగ్ చేసుకోవచ్చో కాలేజీ వాళ్ళే నియమ నిబంధనలను ఏర్పర్చాలి. సీనియర్లు మొదటి రోజే “సున్నిత మనస్కులని” గుర్తించి వారిని ర్యాగింగ్ చెయ్యకుండా బహిష్కరించాలి. ఇలా చేస్తే ఏ ఇబ్బంది లేకుండా ర్యాగింగ్ హాయిగా సాగిపోతుంది.

7 స్పందనలు

 1. ర్యాగింగ్ ఎప్పుడూ పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం లాంటిది. దీని ముసుగులో నానా వికృత చేష్టలు జరుగుతున్నప్పుడు దీనివల్ల మంచి నామమాత్రమైనప్పుడు దీన్ని కఠినంగా అణిచివేయడమే మంచిది.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 2. ఖచ్చితంగా ర్యాగింగు ఒక భూతమే. చేసే వారికి కూడా… విధ్యార్దులలో అంతర్లీనంగా వుండే శాడిజానికి ఒక బాహ్య ప్రవర్తనే ఈ రాగింగ్. సున్నిత మనస్కులను ఎలా గుర్తిస్తారు? ప్రతీ ఒక్కరికీ ఒక limit వుంటుంది. అది దాటితే burst అవుతారు. దానిని ఎలా గుర్తిస్తాం. రాగింగ్ ను నిర్దాక్షిణ్యంగా అణిచివేయటానికి కంకణం కట్టుకున్న సుప్రీమ్ కు జేజేలు..

 3. సుధాకర్ నువ్వు చెప్పిన దానిని ర్యాగింగ్ అనరు…ఏడిపించుకు తినడం…క్రూరత్యం అంటారు. నిజమైన ర్యాగింగ్ లో సీనియర్లు ఎంత ఆనందిస్తారో జూనియర్లు కూడా అంతే ఆనందిస్తారు. మేమైతే ఎప్పుడెప్పుడు సీనియర్లు పిలుస్తారా…ఎప్పుడెప్పుడు వెళ్ళి ర్యాగింగ్ చేయించుకొందామా అని ఎదురు చూసే వాళ్ళం :) ఇక సున్నిత మనస్కులను గుర్తించడం చాలా తేలిక. వారి మాటలు, చేష్టలు బాధపడుతున్నారని ఇట్టే పట్టిచ్చేస్తాయి.
  కానీ అందరి అనుభవాలు మనస్థత్వాలు ఒకే రకంగా ఉండవు కదా? రాను రాను..జనాలు ర్యాగింగ్ పేరుతో విపరీతమైన శారీరక మానసిక హింసలు పెరిగిపోబట్టే ఈ పరిస్థితి వచ్చింది.

 4. నవీనూ,
  “మేమైతే ఎప్పుడెప్పుడు సీనియర్లు పిలుస్తారా…ఎప్పుడెప్పుడు వెళ్ళి ర్యాగింగ్ చేయించుకొందామా అని ఎదురు చూసే వాళ్ళం :)” మీ మాట నిజమైతే మీరు ఏమనుకోకపోతే డాక్టరును కలవడం మంచిది. రాగింగ్‌లో మనిషి వికృత పార్శ్వము బయటికి వస్తుంది. దాన్ని అదుపులో పెట్టుకోగలగటం కొందరికే చాతనవుతుంది. అయినా సున్నితమైన ర్యాగింగ్ కూడా సీనియర్లకు, జూనియర్లకు మధ్య చిన్న పెద్దా రేఖను సృష్టిస్తుంది. ఏవో కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ర్యాగింగ్ ద్వారా జూనియర్లు సీనియర్లతో ధృడమైన స్నేహం చేస్తారు.
  ఎవడనా సీనియరు మాటకు జూనియర్ జడవడం లేదంటే ఆ సీనియర్‌ను ఓ విధమైన అహంకారం పీడిస్తుంది. అలాగే సీనియర్లు చెప్పిన పనులు చేయాలంటే జూనియర్ ఆత్మాభిమానం చంపుకోవాల్సి వస్తుంది. అలా చంపుకోలేని వాడు హత్య/ఆత్మహత్యలకు తలపడ్డా ఆశ్చర్యం లేదు. ఇక్కడ Virginia Techలో జరిగిన దురంతానికి కారణాం కూడ కొంచం అలాంటిదే! అతన్ని మిగతా విధ్యార్థులు గేళి చేసేవారట!

  –ప్రసాద్
  http://blog.charasala.com

 5. దానిని ఏమంటారో తర్వాతి విషయం. అది జరిగేది మాత్రం రాగింగు పేరుతోనే. నిజమైన రాగింగు అంటే చాలా కామెడీగా వుంది.ఎక్కడయినా రూలు బుక్కు వుందా? ఇలా చెయ్యాలని. ?

  ఇక మీరు చెప్పిన సున్నిత మనస్కులను గుర్తించే పద్ధతి బట్టే తెలుస్తుంది, అది తప్పని సరిగా బాధిస్తుందని. అసలు ఎవరైనా ఎందుకు బాధపడే పనులు చెయ్యాలి?

  మా కళాశాలలో ఒక జూనియర్ ని పాట పాడమన్నారు. అతడు నాకు గొంతు నొప్పిగా వుంది (సర్ అనాలని ఒక మాయరోగం కండీషన్ మళ్ళీ) అన్నాడు. కహానీలొద్దురా పాడుబే ఆన్నంతవరకు వెళ్ళాక ఆ జూనియర్ ఇలా అన్నాడు “ఆత్మాభిమానం చంపుకోవటమే మీరు సీనియర్స్ గా నాకు నేర్పే మొదటి పాఠం అయితే నాకు అది అక్కరలేదు…నేను చచ్చినా పాడను. ఇంకా ఎక్కువ చేసారంటే ఒకొక్కడి తోలు ఎలా వలిపించాలో నాకు తెలుసు” అన్నాడు.

  అంతే …పరువు పోయింది, లేని పౌరుషాలు వచ్చేసారు. సీనియర్లు ఒక ముగ్గురు సస్పెండు, తన్నులు తినటం కూడా జరిగింది.

 6. ప్రసాద్ గారు, ఏమైనా మీకు ఆవేశం పాళ్ళు కొంచెం ఎక్కువే. నా వ్యాఖ్య కొంచెం ప్రశాంతంగా చదివి ఉంటే ఈ వాక్యం కనిపించి ఉండేది—> “అందరి అనుభవాలు మనస్థత్వాలు ఒకే రకంగా ఉండవు కదా?”
  మరి నా ర్యాగింగ్ అనుభవాలు అలా ఉన్నాయి మరి. ఆ రెండు నెలలు నాకు ఎన్నో మంచి ఙ్ఞాపకాలు మిగిల్చాయి. మమ్మల్ని Internal Exams లో 25 మార్కులకు 20కి తగ్గితే తంతాం అనేవాళ్ళు. ఎవరికైనా ఒళ్ళు బాగోకపోతే మంచి డాక్టరు పేరు సూచించి బైకులో తీసుకెళ్ళే వాళ్ళు. ర్యాగింగ్ జరుగుతున్నంత సేపు జూనియర్లందరూ నవ్వు ఆపుకోవడానికి విఫల ప్రయత్నం చేసే వాళ్ళం. ఎంతో బ్యాలెంస్డ్ గా ర్యాగింగ్ జరిగేది. నా జీవితం విలువని ఆ సమయంలోనే తెలుసుకొన్నాను. తల్లి దండ్రుల విలువ తెలిసేలా చేసింది ర్యాగింగ్.
  ఇక మా కాలేజీలోనే ఉన్న కేరళా వాళ్ళ ర్యాగింగ్ పరమ భయంకరంగా ఉండేది. రోజూ రాత్రి ర్యాగింగ్ అయిపోయిన తరువాత, నడవలేక గోడలు పట్టుకొని కుంటుతూ వచ్చే వారు. రెండు అనుభవాలకు ఎంత తేడా!!
  ఇంతకూ నేను చెప్పొచ్చేదేమిటంటే…కేరళా వాళ్ళకు జరిగిన దానిని ర్యాగింగ్ అనను నేను. దాన్ని హింస అనాలి. దానికి చట్టం శిక్షించాల్సిందే. అన్ని కాలేజీలలో ఇలాంటి హింస లేకుండా ర్యాగింగ్ సరదాగా ఉంటే బాగుంటుంది కదా అన్న ఊహే నన్ను ఈ టపా వ్రాసేలా చేసింది, అంతే కానీ ర్యాగింగ్ పేరిట జరిగే హింసను ప్రోత్సహించడం నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు.
  సుధాకర్, ర్యాగింగ్ ఇలా చెయ్యాలి అని ఏవరూ వ్రాయలేదు..కానీ ఆ అనుభవాన్ని బట్టి నేనే నిర్వచించుకొన్నాను.

 7. నా అనుభవం కూడా నవీన్ అనుభవం లాంటిదే. ఐతే వికృత రూపాలు లేవని అనను. మా కేంపస్ లోనే కొన్ని గుంపుల్లో వికృత చేష్టలి జరిగేవని విన్నాను. చట్టాలు నియమాలు ఆల్రెడీ ఉన్నాయి – వాటివల్ల ఈ హింస అణగదు – ప్రత్యామ్నాయాలు కావాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: