ఈ-TVలో కోయిల కార్యక్రమం

ప్రతి ఒక రోజూ (వారాంతంలో తప్ప) ఈ-టీవీలో రాత్రి 10:30 నిముషాలకు “కోయిల” అనే కార్యక్రమం వస్తుంది. ఇది మంచి పాత పాటల సమాహారం. రోజుకు ఒక్క అంశాన్ని ఎంచుకొని..ఆ అంశం మీద 7 నుంచి 10 పాటలు ప్రసారం చేస్తాడు. పాత తెలుగు సినిమాల్లోని మంచి పాటలు ఇష్టపడే వారికి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఉదాహరణకు:

వీణ పాటలు
1) నా రాణి కనులలోనె (చిత్రం:“చిలకా గోరింక” (1967) ;కళాకారులు:)
2) ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో ..నాలోన పలికించు ఎన్ని భావాలో
(చిత్రం:అత్తలు కోడళ్ళు ;కళాకారులు:)
3) మాటరాని మౌనమిది (మహర్షి)
4) మబ్బుల్లో ఏముంది…నా మనస్సులో ఏముంది ..

మబ్బులో కన్నీరు…నా మనస్సులో పన్నీరు (చిత్రం:లక్షాధికారి ;కళాకారులు:NTR,కృష్ణకుమారి, సినారె)

పొడుపు కథల పాటలు
1) చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా (చిత్రం: చెంచు లక్ష్మి కళాకారులు: అక్కినేని, అంజలీదేవి, పి.బి.శ్రీనివాస్)
2) కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై… ఎగసిపోదునో చెలియ నీవే ఇక
నేనై… కలల అలలపై…
మనోహరమైన పాట. ఎగసిపోదునో…
…………
జలకమాడు జవరాలిని చిలిపిగ చూసేవెందుకు
తడిసీ తడియని కొంగున ఒడలు దాచు కొన్నందుకు (
చిత్రం:గులేబకావళికథ ;కళాకారులు: రామారావు)
3) అడగాలని ఉంది..ఒకటడగాలని ఉంది
(చిత్రం:చిన్ననాటి స్నేహితులు ;కళాకారులు:)
4) అడిగినదానికి జవాబిస్తే..అందుకు బహుమతి ఇవ్వాలని ఉంది (చిత్రం: ;కళాకారులు: శోభన్ బాబు, వాణిశ్రీ)
5) కిట కిట తలుపులు కిటారి తలుపులు (
చిత్రం: ;కళాకారులు: అక్కినేని, కృష్ణకుమారి, రేలంగి)
6) మీసమున్న మగాడా చెప్పగలవా ముడి విప్పగలవా లోగుట్టు వివరించి చెప్పగలవా
(చిత్రం: ;కళాకారులు:)
7) ఒకటి ఒకటి మూడు..ఈ లెక్కకు కావాలోయేడు (చిత్రం: ;కళాకారులు: కాంతారావు, సత్యనారాయణ, ప్రభాకరరావు)

విషాద పాటలు
1) బొమ్మను చేసి ప్రాణం పోసి (చిత్రం: ;కళాకారులు: రామారావు)
2) నమ్మరే నేను మారానంటే నమ్మరే (
చిత్రం: ;కళాకారులు: అక్కినేని)
3) తానే మారెనా…నన్నే మారెనా…దారీ తెన్నూ లేక ఈ తీరాయెనా (
చిత్రం:దేవదాసు ;కళాకారులు: )
4) వెళ్ళిపోతున్నావా అమ్మా ఇల్లు విడిచి నన్ను మరిచి వెళ్ళిపోతున్నావా (చిత్రం:దసరాబుల్లోడు ;కళాకారులు: అక్కినేని, అంజలీదేవి, ఎస్వీయార్)
5) జన్మమెత్తితిరా ..అనుభవించితిరా (
చిత్రం: ;గుడి గంటలు ;కళాకారులు: )
6) గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం (
చిత్రం:స్వయంవరం ;కళాకారులు: శోభన్ బాబు)

పర్యాటక పాటలు
1. రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్…రిక్షావాలా జిందాబాద్ (చిత్రం:మట్టిలో మాణిక్యం కళాకారులు: చలం)
2. రష్యాలో పుట్టి భారతావనిలో మెట్టి తెలుగువారి కోడలివై వలపు లొలుకు జాజిమల్లి (
చిత్రం: ;కళాకారులు:కాంతారావు)
3. ఆడవే ఆడవే జలకమ్ములాడవే..కలహంసనో..జలకన్యలానో ఆడవే…. ఆదికవి నన్నయ (
చిత్రం: విచిత్ర కుటుంబం; కళాకారులు:శోభన్ బాబు)
4. సంద్రంలో కలసినవి కలసిపోయెను…వొంటరిగా ఈ కోవెల మిగిలిపోయెను….మహాబలిపురం మహాబలిపురం (
చిత్రం:బాలరాజు)
5. ఇదే చంద్రగిరి..శౌర్యానికి గీచిన గిరి… తెలుగుజాతికిది తరగని సిరి (
చిత్రం: ;కళాకారులు:జగ్గయ్య)
6. ఆనాటి మానవుడు ఏమి చేశాడు ఈనాటి మానవుడు ఏమి చూశాడు శిలలలో జీవికళపోశాడు వాడు (
చిత్రం: ;కళాకారులు:అక్కినేని, సావిత్రి)
7. కాకతీయుల కత్తి పదనులో కాకలు తీరిన నగరం మన ఏక శిలా నగరం (
చిత్రం: ;కళాకారులు:విజయలలిత?)

చిన్నపిల్లల పాటలు
1) గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి (చిత్రం: బాలమిత్రుల కథ)

2) కంటికి మీద నిద్ర రావే
………..చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది
…………..చూడకపోతే దిగులు (
చిత్రం:ముద్దు బిడ్డ, కళాకారులు:ఆత్రేయ)

3) ఎంతెంత కాలం ఇంకెంత దూరం… కథలు చెప్పుతూ పోతూంటే కాసింత దూరం (చిత్రం: ;కళాకారులు:బేబి శ్రీదేవి)
4) తూనీగా తూనీగా (
చిత్రం:మనసంతా నువ్వే)

నవ్వుల పాటలు
1) (చిత్రం: కళాకారులు:అక్కినేని, కృష్ణకుమారి)
అతను:
ఆ నవ్వులకోసమే నేను కలలు కన్నాను
ఆ నడకల కోసమే నేను కాచుకొన్నాను
2) (
చిత్రం: సిరిమల్లెపువ్వు, కళాకారులు:మురళీమోహన్, జయసుధా)
అతను:
సిరిమల్లెపువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు
3)(
చిత్రం: కళాకారులు:కృష్ణా) (జేంస్ బాండ్ ఉన్నట్టుంది)
ఆమె:
మనసుతీరా నవ్వులె నవ్వులె నవ్వాలి
మనం రోజూ రోజూ పండగె చెయ్యాలి
4)
(చిత్రం: చిత్రం: కళాకారులు:కృష్ణా, కాంచనా)
అతను:
నవ్వులే రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమా
ఉన్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా

5) (చిత్రం: కళాకారులు:ఎన.టీ.ఆర్)
అతను:
చిరునవ్వులోని హాయి చిలికించ నేడి రేయి
ఆమె:
ఏ నాడు కలగని హాయి ఈ నాడు కలిగెనోయి
నెలరాజు సైగచేసి వలరాజు తొంగి చూసె
సిగపువ్వులోన నగుమోము లోన వగలేవొ చిందువేసె
6) (
చిత్రం: కళాకారులు:కృష్ణా)
అతను:
నవ్వు నవ్వించు ఆ నవ్వును అందరికి అందించి
జగమంతా ఆ దేవుని చిరునవ్వే అని హమనించు
చదువులలో ఆరితేరి పదుగురిలో పేరు పొంది
కన్నవారి దీవెనలందే చిన్నారి బాలల్లారా
7)(
చిత్రం: పదహారేళ్ళ వయసు, కళాకారులు:చంద్రమోహన్, శ్రీదేవి)
అతను:
చీమకుట్టి చిన్నోడు ఏడుస్తూంటే… ….
మా మల్లి నవ్వాల పకా పకా
8)(
చిత్రం: కళాకారులు:కృష్ణా)
నవ్వవే నా చెలి…నవ్వవే నా చెలి
చల్లా గాలి వీచేను

9) (చిత్రం: మర్మయోగి కళాకారులు:ఆరుద్ర, గుమ్మడి)
నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
ఇది మైమరపించే హాయి
10) (
చిత్రం: కళాకారులు:కృష్ణా)
చంపేది ఎవడురా చచ్చేది ఎవడూరా
శివుడాజ్న లేకుండా చీమైన కుట్టదురా
…………..
అందుకే నవ్వుతూ బ్రతకాలిరా..తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా

11) (చిత్రం: పెద్దరికం కళాకారులు:జగపతి బాబు, సుకన్య)

నీ నవ్వే చాలు పూబంతి చామంతి

ఇందులో నాకు నచ్చనిది ఏమిటంటే…కార్యక్రమం నడిచినంత సేపూ …సినిమా పేర్లు కానీ కళాకారుల ఊసు కానీ ఉండదు….కావున కామ్రేడ్స్ మీకు ఎవర్కైన పై పాటలు ఏ సినిమాలోనివో తెలిస్తే అది నాకు చెబితే సంతోషిస్తా.

————————————————————————————

Keywords: Telugu Songs, E-TV, ETV , Koyila Program, Telugu Paatalu

————————————————————————————

ప్రకటనలు

11 thoughts on “ఈ-TVలో కోయిల కార్యక్రమం

 1. నవీన్ ,

  ఈ-టివి మా టివి కాదు గానీ (మాకు జెమిని , తేజా వస్తాయి )
  ఇన్నాళ్ళకు (ఇన్నేళ్ళకు ? ) నీ బ్లాగ్ ప్రాబ్లం లేకుండా కనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది :)
  Did I say it in the wrong place ?

 2. రాజశేఖరం……నా బ్లాగు నీకు కనిపిస్తున్నందుకు చానా హ్యాపీస్…..
  నీకు రాంగ్ ప్లేస్ ..రైట్ ప్లేస్ ఏంది మామా…ఏందైనా రాసెయ్ ఏమ్ పర్లేదు..:)

 3. నవ్వుల పాటలు :

  1)ఆ నవ్వులకోసమే నేను కలలు కన్నాను
  చిత్రం : జమీందార్ (1966)

  4)నవ్వులే రువ్వే పువ్వమ్మా
  చిత్రం : గాజుల కిష్టయ్య (1975)

  8) నవ్వవే నా చెలి…నవ్వవే నా చెలి చల్లా గాలి వీచేను
  చిత్రం : అంతా మన మంచికే (1972)

  10) నవ్వుతూ బ్రతకాలిరా..తమ్ముడూ
  చిత్రం : మాయదారి మల్లిగాడు

  మీకు ఇదివరకే కొన్నిటి సినిమాల పేర్లు తెలిసే ఉంటాయి .
  ఒకసారి ఈ టపా ని ఎడిట్ చేయకూడదా ,,, మిగిలిన పాటల
  కీ సినిమాల పేర్లు కావాలంటే – వీలు ఉన్నపుడు మరల మీ
  ఈ బ్లాగు చూసి ప్రయత్నించాలి …

 4. కిటకిట తలుపులు పాట “జమిందార్” చిత్రం లోనిది.
  బొమ్మనుచేసి ప్రాణం పోసి పాట “దేవత” చిత్రం లోనిది.
  “జన్మమెత్తితిరా” పాటకు అభినయించినది “రామారావు”.
  ఇదే చంద్రగిరి పాట “కోడెనాగు” లోనిది – శోభన్ బాబు అభినయం.
  మనసుతీర నవ్వాలి పాట ‘గూడచారి 116 ” లోనిది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s