• టాజా షరుకు

 • ఉట్టమ టపాళు

 • పాట షరుకు

 • వర్గాలు

 • Blog Stats

  • 259,365 హిట్లు

చిరంజీవి Vs రజనీకాంత్

శివాజి….ఈ దేశంలో 75కోట్లతో నిర్మించిన అతి ఖరీదైన సినిమా
శివాజి….అంటే రజనీకాంత్ అతి ఎక్కువ పారితోషికం పొందిన సినిమా
శివాజి….ప్రపంచవ్యాప్తంగా 1500 చిత్రశాలల్లో విడుదలైన సినిమా (అసలు సంఖ్య 700+ అనుకోండి…అది వేరే విషయం)
శివాజి….మూడు రోజుల్లో 55 కోట్లు వసూలు చేసిన సినిమా
శివాజి….కార్పొరేట్ సంస్థలు పోటీలు పడి తమ ఉద్యోగస్తులకు చూపిన సినిమా
శివాజి….వేలకు వేల డబ్బు పోసి బ్లాక్లో టిక్కెట్టు కొని చూసిన సినిమా
శివాజి….ఆహాహా ఓహోహో అదరహో సినిమా

ఇదంతా చదివి నేనూ చప్పట్లు కొట్టి అభినందిస్తాను. కానీ కొన్ని తమిళ పత్రికలు (rediff లాంటివి) రజనీ సృష్టించిన ప్రభంజనం చూసి చిరంజీవి లాంటి హీరోల చొక్కాల్లో చెమటలు పట్టి ప్యాంట్లు తడుపుకుంటున్నట్టు వ్రాశారట. మధ్యలో చిరంజీవిని లాగడమెందుకు? ఒకరిని గొప్పగా చూపాలంటే ఇంకొకరిని తక్కువ చేసి చూపడం ఎంత మాత్రం సబబు?
చిరంజీవి రజనీకాంత్ లాగ ఇతర రాష్ట్రాలలో మర్కెట్టును సంపాదించలేకపోయాడట. రాసినోళ్ళకి ఈ విషయం ఎవరు చెప్పారో…ఈ వ్యాసం చదివినోడు….ఫలానా గొప్ప అని అంగీకరించాలని వీడి తాపత్రయం.
ముఠామేస్త్రి (1995) సినిమా తరువాత నేను చిరంజీవి సినిమాలను పెద్దాగా పట్టించుకోవడం మానేశాను. తరువాత వచ్చిన సినిమాలలో 90% పరమ చెత్తవే. ఆయనలో ఉన్న నటుడుకి, ఆయనకున్న మూర్తిత్వానికి(Image) సాటి రాగల దర్శకులు ఆయనకు తగల్లేదు. పైగా తన మూర్తిత్వాన్ని సొమ్ము చేసుకొనే తాపత్రయంలో ఎక్కువగా సొంత బ్యానర్లలోనే నటించారు. గత పది సంవత్సరాలలో చూడాలని ఉంది, ఇంద్రా, ఠాగూర్ సినిమాలు మాత్రమే ఆయన స్థాయికి కొద్దిగా దగ్గరలో విజయవంతమయ్యాయి.
ఇప్పుడున్న చిరంజీవి నాకు చిరంజీవే కాదు…నాకు మాత్రం చిరంజీవి అంటే పున్నమి నాగు, దొంగ, గూండా, మంత్రిగారి వియ్యంకుడు, విజేత, మహానగరంలో మాయగాడు, చట్టానికి కళ్ళులేవు, నకిలీ మనిషి, ఊరికి ఇచ్చిన మాట, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, మగ మహారాజు, ఖైదీ, రుస్తుం, హీరో, అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, వేట, కొండవీటి రాజా, దొంగ మొగుడు, స్వయంకృషి, జేబు దొంగ, యముడుకి మొగుడు, మరణ మృదంగం, అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, జగదేక వీరుడు – అతిలోక సుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు…అంతే.

చిరంజీవి గురించి బాకా ఊదే కార్యక్రమం కాదు కానీ….rediffలో చెప్పినట్టు కాక మెగాస్టార్ కు కర్ణాటకలో కూడా భయంకరమైన మార్కెట్టు ఉంది. నేను 1989లో బెంగళూరు వచ్చినప్పుడు స్టేట్ రౌడీ చిత్రం 200రోజు పోస్టరు స్వయంగా చూశా. ఘరానా మొగుడు గురించి దార్వాడ్ – హుబ్లీలో ఉన్న ఏ కన్నడిగుడినైనా అడగండి చెబుతాడు. ఆ సినిమా 150వ రోజు కూడా పల్లెల్నుంచి ప్రజలు ట్రాక్టర్లలో హుబ్లీకి వచ్చే వారంట. కనిపించినోళ్ళకంతా “అర్థాగిల్ల అంద్రె ఏనో…సినిమా సక్కత్ ఇదె…చిరంజీవి సినిమా మారయ్యా ఇదు..” అనే వాళ్ళంట. తెలుగులో “ఏమండి” తప్ప మరో ముక్క కూడా రాని మా కన్నడ మేనేజర్ అరుణ్ యాడ్వాడ్ అప్పట్లో ఆ సినిమాను 5 సార్లు చూశాడంట. ఏమర్థమైందని చూశారండి అని అడిగితే…”చిరంజీవిని ఆలా చూస్తూంటే చాలు…ఏమర్థం కాకపోయినా పర్లేదు” అంటాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…ఇప్పటికీ తెలుగు రాకపోయినా ఆ సినిమాలో చిరంజీవి డైలాగులు మొత్తం కంఠతా వచ్చు మా మేనేజర్ కు :)
స్టాలిన్ లాంటి ఫ్లాపు సినిమానే ఒక్క బెంగళూరులో 30 థియేటర్లలో విడుదలైంది. అది ఏ కన్నడ సినిమాకు సైతం సాధ్యపడదు. శివాజి చిత్రం కూడా చెన్నైలో 14 ధియేటర్లలో మాత్రమే విడుదలైందని NDTVలో విన్నాను (హైదరాబాదులో 40 ధియేటర్లంట)……
ఎంతైనా చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని…మెగాస్టారు మీద తాప్పుడు వార్తలు వ్రాస్తే ఈ మాత్రం ఆవేశం రావడం తప్పు కాదు కదా???
ఏమైనా “శంకర్ దాదా జిందాబాద్” విడుదల కాబోతోంది…దేవిశ్రీ అత్యద్భుతమైన సంగీతానికి …ప్రభుదేవా మాంచి నృత్య రీతులను సమకూర్చాడని చదివాను….in front there is crocodile festival

—————————————————————————–
Keywords: Chiranjeevi, Chiru, Rajnikant, Rajni, Telugu Movies
——————————————————————————

ప్రకటనలు

55 వ్యాఖ్యలు

 1. రుద్రవీణ లాంటి గొప్ప సినిమా ని మరిచారేమిటండీ..

 2. అంతే నవీనూ ..అంతే !
  విషయమేమిటో తెలియదుగానీ సినిమా రాకముందే ప్రచారం ఊదరగొట్టేశారు.
  పెట్టుబడి తిరిగి రావాలంటే లాంగ్ రన్ / శతిదినోత్సవాల గురించి పట్టించుకోకుండా వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి తొందరగా డబ్బులు దండుకుందామనే ఆలోచిస్తున్నారు అంతా !

  అనువాద చిత్రమైన శివాజీకే అంత మార్కెట్ ఉందని (లెక్కలు చూపించారు ) అన్నారు !
  ఇక అచ్చ తెలుగు చిత్రానికి ఇంకా ఎక్కువ మార్కెట్ ఉందని జనాలను నమ్మించాలి అని మన కథానాయకులు – దర్శకనిర్మాతలు ఆలోచించకుండా ఉంటే చాలు .. !!

  వీళ్ళు అలా అనుకుంటే మాత్రం అన్ని సినిమాలకూ “సక్సెస్ మీట్” ఎంత సర్వసాధారణంగా మారినట్టుగానే .. ప్రతి సినిమాకీ ఈ ప్రచారం లో భాగంగా పెద్ద పెద్ద అంకెలు చూడడానికి అలవాటు పడాల్సొస్తుంది.

 3. కొండవీటి దొంగండీ బాబూ…

  నేను మీ లాంటోడినే. ముఠా మేస్త్రి తరవాత అంతా చెత్త సినిమాలే. లేటెస్టుగా వచ్చిన జై చిరంజీవా అయితే వాక్… వాక్…

 4. “అర్థాగిల్ల అంద్రె ఏనో…సినిమా సక్కత్ ఇదె…చిరంజీవి సినిమా మారయ్యా ఇదు” అంటేమిటండీ?

 5. పోస్టులోనే దీనర్థం వ్రాసుండాల్సింది.
  “అర్థాగిల్ల అంద్రె ఏనో…సినిమా సక్కత్ ఇదె…చిరంజీవి సినిమా మారయ్యా ఇదు” అంటే:
  “అర్థం కాకపోయినంత మాత్రమేమి…సినిమా చాలా బాగుంది…ఇది చిరంజీవి సినిమానయ్యా బాబు” అని అర్థం

 6. “ఇప్పుడున్న చిరంజీవి నాకు చిరంజీవే కాదు ” నిజమేనండి!!… చిరంజీవి వీరాభిమానిని అయినా… ఆయిన పాత సినిమాలతో పోలిస్తే…కొంత భాదే.
  అప్పటి చిరంజీవిని మళ్ళీ చూడలేమేమో… ఆయనను సరిగ్గా చూపించే దర్శకులు కూడా ఇప్పుడు లేరు. కాని ప్రభుదేవా ఖచ్చితంగా ఇరగ దీసుంటాడు… ( చిరంజీవి ‘దర్శకుడి’ పని లో వేలు పెట్టకుండా ఉంటే..)
  రియల్లీ… one vulture, eating hundred Buffalos-one cyclone finish..శంకర్ దాదా జిందాబాద్‌తో ఈ తొకాలో రికార్డ్స్ సోదిలోకి కూడా లేకుండా పోతాయి.

 7. this article is very nice.. there is a lot of unnecessary popularity & boost up for shivaji movie.

 8. మీ ఆక్రోశం సరైనదే. చిరంజీవికి మంచి నటనా కౌశలం ఉన్నా, ఆయనకి సరిపడా కథ, కథనం లేకపోవడం పెద్ద లోపం. మంచుపల్లకీ చిరంజీవి నటనని మర్చిపోవడం కష్టం. యండమూరి నవలలు చదివుతూ ఉంటే చిరంజీవే గుర్తొచ్చే వాడు. ఒక స్థాయికొచ్చాక దాన్ని నిలుపుకునే ప్రయత్నం ఎక్కువ చేయాల్సొస్తుంది. కాని అప్పటికే వచ్చిన పేరువల్ల , ఎలాగైనా హిట్ చేసే ప్రేక్షకులవల్ల కొంత నిర్లక్ష్యం వచ్చినట్లుంది.
  ఏమాటకామాటే చెప్పుకోవాలి. రజనీకాంత్ సినిమాలు అంటే జపాన్లోనూ, కొరియాలోనూ కేజ్. నాకు ఒక కొరియా కుర్రాడు (సినిమా అతని మేజర్ సబ్జెక్ట్ అట) నేను ఇండియానించి అని తెలియగానే- రజనీ సినిమా గురించి చెప్పాడు.

 9. శివాజి మాత్రం రజినీ సినిమా అయినందువల్లనే ఇంత ప్రచారార్భాటం జరగడం లేదు. దేశంలో పేరున్న దర్శకులలో ఒకడైన దర్శకుడు, సినీసంగీతంలో మొదటిస్థానంలో ఉన్న సంగీతదర్శకుడు, పురాతన వైభవం గల నిర్మాణసంస్థ ఏవీయం – మునుపెన్నడూ లేనివిధంగా ఇవన్నీ కలగలిసి రూపొందిన సినిమా గనుకనే మునుపెన్నడూలేనంత ప్రచారం సాధ్యమైంది. చొక్కాలూ పాంట్లసంగతి పక్కనబెట్టేయండి. సినిమావాళ్ల గురించి ప్రతివాడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు.

 10. aney whey rajani super star but he dont have good dansar and he
  dont good actar also camparing kamalasan and he dont have good camedian ok then he is very very good stylish and smiling face
  and seriyas face also he is presented hero ejam carectars and
  very very good charectar persanality man in the socity ok thats why he is reach a goals and reaching a goals .

  ok
  manjunathareddy

 11. If wealth is lost nothing is lost. If health is lost something is lost. If character is lost everything is lost. So Rajini shouldn’t be involved in such type of controversial talks and I suppose he wouldn’t. Both of them are good actors and have good character unlike the leagend Mr.Mohan Babu who doesn’t know where and what he speaks.

 12. rajinikant inspite of being such a great actor works in a heroine oriented movie like chandramukhi…he returned his remuneration to his investors whn his movie baba was a flop…whn his daughter loved a junior actor he got them married successfully…whn his friend mohan babu(non tamilian) was facing financial crisis in1990’s rajinikant acted free of cost in pedarayudu and it really helped him…inspite being so rich he spends most of his time in himalayas…CAN WE DREAM OF SUCH QUALITIES IN MEGASTAR?

 13. evcellent blog boss!! That was true what ever u said about shivaji and our megaaaa star chiru sir.

 14. excuseme sir chiru is waste as copared with rajani.bcoz his total blood and eye banks are full of correption i telling this type of matter bcoz i face the problem with that camps.i was attended many of times in donation camps but once i required biood from them but they were asked me2000 rs for350 ml blood

 15. No doubt of the best action of Chiru and Rajani. both are fine artists. the problem is language. Tamils{aravollu} are trying to project that their language is best. They should remember that no Tamilian is best in Tamil nadu.
  Ex.
  MGR= Malayalee
  KarunaNidhi= Telugu
  Jayalalitha= Kannadiga
  Rajani kanth= Marati
  Kamal hasan= Malayalee
  so dear friends, Tamils are mad of Tamil language but not the people from where they are. We Telugus are mad of castes but not language.
  i think mad of language is better than mad of caste.
  so friends let us promote our language{ours is bigger group} by not insulting other languages like Tamilians.

 16. caste feeling valla chiru tokkabaddadu…. ganjayivanumlo tulaci mokkalaga , telugu cinifield lo chiru okka mogadu ga edhigadu…brothers.
  asalau ntr ke ledhu tamil market.

 17. In my opinion both of them perform extraordinary films
  No one leads over other .
  But when it comes to reality,either of the actors have their respective merits & demerits.Today majority of cine actors donot pay taxes to govt announced by the IT dept. which conducted rides .Even the chiru (megastar)who acted in a film “Tagore” which create a feeling of “rooting out corruption ” is included in this group of people .
  My father who donated blood to bloodbank havenot got “certificate of donation ” leading to idea of conspiracy in blood banks.

 18. IAM FAN OF NANDAMOORI BUT ONE THING CHIRANJEEVI IS ALWAYS(1000%) BEST THAN RAJNIKANT.

 19. In my
  opinion plz dont comapre rajiniVSchiru coz
  they r doing lot of buisness for thier industries
  at last industry need buiness not acting & performence of the actors both heros still manage collections even thogh they have more than 50 we need to appreciate them

  Both no need to prove thier ability in coming projects coz they already prooved

 20. “ఎంతైనా చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని…మెగాస్టారు మీద తాప్పుడు వార్తలు వ్రాస్తే ఈ మాత్రం ఆవేశం రావడం తప్పు కాదు కదా???”

  Same to same feeling.

  -Murali

 21. I AM ALWAYS CHIRU FANS………………………………………………………..

 22. chiru is best and better human being

 23. hi this is chaitu, know im telling the true,bcouse chiru is everest, we cant reach , chairenjeevi anidhi okha shathi dhanii dee konadum yevarivallaw khadu….

  mari chairu@rajani anti,chairu heis doing four characer, but rajani is he is doing only two characeter, ipudu cheppu yevaro ekhuvo…

  yeppudu number one position in india chiru okhadiiiiiiiiiiiii he is boss

 24. prapancham lo 7 wonders unnayi.avanni aa aa desaaluku avi ento aakarshaneeyaga kanipistaayi but chiru sir kachitanga 8 wonder.idi attraction kaadu.prapamchaaniki veluguniche oke okka magaadu,1000 suns ki samaanam

 25. రజనీకాంత్ సినిమాలు తమిళ్ వాళ్ళకు బాగానే వుంటాయేమో కాని, మేమైతే మాత్రం రజనీకాంత్ సినిమాలు చూసినప్పుడల్లా పడి పడి నవ్వే వాళ్ళం. ఎందుకంటే మూతి వంకరగా పెట్టి డైలాగులు చెప్పడాలు, కత్తి విసిరితే బుల్లెట్ రెండు ముక్కలయ్యి, ఒక ముక్క ఒక విలన్ నీ, రెండవ ముక్క రెండవ విలన్ నీ, అలాగే కత్తి వెళ్ళి మూడో విలన్ నీ చంపడం ( ఒక దెబ్బకు మూడు పిట్ట లన్న మాట ) , అలాగే గన్ను విసిరితే ఎక్కడో స్తంభం వెనకాల దాక్కున్న విలన్ ని చంపి మళ్ళీ చేతిలోకి రావడాలు లాంటి ఎగస్ట్రాలు కేవలం రజనీకాంత్ వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. ఇలాంటి ఎగస్ట్రాలు చిరంజీవి వల్ల సాధ్యం కాదు. నటనలో, డ్యాన్సుల్లో మరియు ఫైట్లల్లో మాత్రం చిరంజీవి దరిదాపుల్లోకి కూడా రాలేడు రజనీకాంత్. అలాగే ఎగస్ట్రాలల్లో కూడా అంతే, రజనీకాంత్ దరిదాపుల్లోకి కూడా రాలేడు చిరంజీవి.

  అయినా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటే ఎవరికి ఉపయోగం. కెరీర్ మధ్య కాలంలో రోజుకు 20 గూట్కా పాకెట్లు నమిలి నమిలి, సిగరెట్లు తాగి తాగి ఆరోగ్యాలు పాడుచేసుకుని ఆసుపత్రిలో పడితే అక్కడ ఙ్ఞానోదయం అయ్యి ఇప్పుడు “బాబా” అంటున్నాడు.

  ఇలాంటి అలవాట్లు మన “మెగాస్టార్” కు లేవు కాబట్టి, అలాగే హిమాలయాలకు వెళ్ళకుండా ప్రజల దగ్గరికి వస్తున్నాడు కాబట్టి, నా దృష్టిలో చిరంజీవే గొప్ప.

  జై చిరంజీవా

  • neeku chiranjeevi ante dhantho neeku bhadha anipinchadam lo tappu ledhu kaani…. konthamandhi chesina comments over reaction ga unnay….. asalu Rajni kaali gotiki kuda chiranjeevi saripodu…. andhuke tamil top director shankar ni chirutho cineme theeyamani 5 years nundi bathimilaadina pattinchukovadam ledhu……. Telugulo Chiru market kante ” SOUTH INDIAN SUPER STAR RAJNIKANTH ” Market 10 retlu ekuuva….!?

 26. నవీన్, ఏంటో ఈ జాబుకు తెరలు తెరలుగా వ్యాఖ్యలొస్తూ ఉన్నాయి. ఈ సారి వచ్చిన వ్యాఖ్యలు మంచి వినోదాత్మకంగా ఉన్నాయి కూడాను. :)

  గతంలో కూడా మీ జాబు ఒకదానిలో ఇలాగే ఓ ఏడాత్తరవాత వ్యాఖ్యలొచ్చినట్టు గుర్తు.

 27. @చదువరిగారు,
  అదే నాకూ అర్థం కావటం లేదు. ఆరు నెలల ముందైతే, నా బ్లాగుకు రోజుకు 1000+, 2000+ హిట్స్ వచ్చాయి. కూడలిలో టపాలు రాకున్నా, నా బ్లాగు జనాలకు ఎక్కడ నుండి కనిపిస్తోందో అర్థం కావటం లేదు.
  మెన్ననే గూగుల్‌‌లో “చిరంజీవి” అని టైప్ చేసి వెతికా. మొదటిదేమో తెలుగు వికీ వ్యాసం…రెండోదేమో…:) చెప్పడమెందుకు, మీరే ప్రయత్నించి చూడండి. బహుశా జనాలు నా బ్లాగుకు ఇక్కడ నుండే వస్తుంన్నారేమో.

 28. no comment for others, first we find ur self then realize.
  if any comment first respect to parents, elders and to correct ur mistakes

 29. chiru is living legned.
  He controls on his mind and social activities.
  He is not fair but he is trying to be the best .
  I am telling that as a cinegoer , we saw 50 per cent of his acting skills.
  he is ideal for who want to become high level in life.
  he is goog in personality developement and he is expert in the socialogy.
  he dont know the commericial business.

  finally said that
  …………………..No one can compare with chiru who are living on the earth.

 30. there is no comparison between chiranjeevi &rajinikanth,only rajini knows for his stylish performances and style statements,and he is lucky to got the apportunities in great directors movies ike shankar,maniratnam etc.in tamil there are so many great directors .chandramuki cinema hit rajini goppatanam kadu,aa credit director p.vasu di and heroine jyothikadi,aa cinemalo rajini checindi yemi ledu.shivaji movie kuda anthe.cinema chala rich ga vundi kani andulo pasa ledu,its too bad .

 31. chiranjeevi navarasalu palikinchagaladu,he is best in dancing & acting &fights& sentiment &dailogues & everything he can do.i like his movie “APADBANDAVUDU”.its very very beutiful movie,and rajini only for styles and dialogues.dabbing cinimalanu adarinchadam telugulalla goppatanamu,anthe kani they dont insult our telgu heroes.”””CHIRU IS ALWAYS BEST”””””THAN RAJINIKANTH,TAMIL HEROES DONT COMPARE WITH TELUGU HEROES.

 32. mega star jindabad.mega staar is great he is real hero chiranjeevi ni padagottevadu ledu.chiru oka shakthi.chiru pye telugu kuda sariga rani oka yadava comments chestunadu.mundu vadu school ki velli chaduvu nerchukoni tarvata matladamanu.

 33. mega star chiru is reallife hero he is better than all heros like rajikanth. kammalhassan. najrjuna.balakrishna.amitab.shahruk. amir .salmankan why u know because all heros like there life thatwise there are not coming in politics.they will show heroism in movie only but reallife chiru is better is having dare no body have like that so 1000000000 times he is a king.

 34. tokka chiru ki rajni ki polikenti………
  rajni muttu film tho kraze vachindi kani maa chiru maatram punadiraalu thone start ayyindi……………
  tats chiru………ippudu kuda chiru cinemalo ki vaste megastar ki tirugu ledu……….kaani tamil news papers lo chiru gurinchi rayadam badhaga undi……….
  telugu papers lo ala rayaru adi telugu samskaram…..

 35. రజనీది అంతా సుడి (నసీబు) వ్యవహారం. చిరంజీవిది పూర్తిగా అలా కాదు. ఉన్నమాటంటే రజనీ అభిమానులు బాధపడతారు గానీ అంత వికారపు హీరో ప్రపంచంలో ఎక్కడా లేడు. ఇతరప్రాంతాల్లో మార్కెట్ అంటారా ? అది తమిళ సినిమాలకి లేదు కాబట్టే బాయ్టి రాష్ట్రాల్లో సినిమాల్ని అమ్ముకోవాల్సి రావడం. ఆ రకంగా ఒక లోపాన్ని ఘనతగా చెప్పుకోవడం తమిళులకే చెల్లు. లేదు. తెలుగు సినిమాలకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళది ఒక పిత్తంత రాష్ట్రం. మన తెలంగాణ కంటే ఒకటి రెండు జిల్లాలు పెద్దది. డబ్బింగో మరొకటో చేసి బయట అమ్ముకోకపోతే తమిళ నిర్మాతలు రైతుల్లా, నేతకార్మికుల్లా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది.. అయినా ఈ మధ్యకాలంలో రజనీ సినిమా ఒక్కటి కూడా ఆంధ్రాలో సరిగా ఆడలేదు. ఆ మనిషికి ఇంతకు ముందున్న గ్లామరు, క్రేజు (తమిళనాడులో కూడా) ఇప్పుడు లేవు.

 36. yevadandi rajinikanth? anukokoodadu kani eee tamilvaallu baavilo kappallanti vallu, valla lokame valladi, itarula gurinchi assssalu pattinchukoru,
  valla manishi vasthe andalamekkistharu, andulo thappu ledu, kani itharula gurinchi endukantha chulakana? thappu idi chaaaala thappu, nenu choosina 10 mandi tamilvallalo 9 mandi ilanti valle,
  orey ila chesthunnanduku mimmalni aparichithudu (meeru shrustinchina) kooda kshaminchadu!!
  jagrathaga vundandi, noru jagratha, maata jagratha,
  maryadaga vundandi, teliyka pothe adi nerpe paathashalala vellandi, and finally be carefull before commenting on non-tamilian, especially our chiranjeevi.

 37. i am always chiru biggggggggggggggggggggggggggggggggggggg fan.jai chiranjeeva.jai chiru.

 38. అలాగే హిమాలయాలకు వెళ్ళకుండా ప్రజల దగ్గరికి వస్తున్నాడు కాబట్టి, నా దృష్టిలో చిరంజీవే గొప్ప.

  జై చిరంజీవా

 39. EEROJU TELUGU CINEMA DESAM DATI ADUTUNDI ANTE ADI CHIRU MOVIES VALLE.

 40. chiru is the only one,no one can reach him.rajini also have worst films

 41. chiru had no of good qualities by hearing the words of brother pawan kalyan
  ex: chiru told to his brothers and family members that if any magzine what ever the star may be printed if magzine had fell down please lift them and keep neatly

 42. see the film vijetha no can do or act like chiru because i cried lot of times by looking that movie
  such a sentiment film

 43. i am also supporting all the chiru fans thoughts…….

 44. hai iam chiru veera abhimanini chiru is a very good actor nenu hero avuthanu ram charan antha kakunna chiru antha avutha

 45. chiru is greatest persen in the earth.you fucking people dont say any thing about him.

  JAI CHIRANJEEVA

 46. Hmmmmmmm…………both earned lot of our ( even poor people )money and and even producers too become rich.

  Talent!!!!!
  plenty in the field,only few get opportunity and luck factor too should help.

  otherwise both are beyond comparison at this stage of their cine life.
  Definitely they may b too good to each other and only we ??????????

  ananth enjoying all comments.

 47. RAJINI IS GREAT AND GOOD HUMAN. WHERE AS CHIRANJEEVI WOREST IN ALL LEVELS.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: