మన బ్లాగుకు 10,000 హిట్లు

ప్ర) నవీన్ గారు ఏమిటి ఈ రోజు విశేషం?
జ) నేను కూడా 10,000 క్లబ్బులో చేరానోచ్…..అంతే కాదు ఈ రోజు అత్యధికంగా 200 మంది పైన దర్శించారు నా బ్లాగుని

ప్ర) ఆ …ఐతే ఏంటట..దేశానికి సెలవప్పించమంటారా?
జ) అంత ఎటకారం ఎందులే…ఏదో సినిమాలు వంద రోజుల పండగ చేసుకొన్నట్టు మనమూ పండగలా కాకపోయినా….ఈ 10,000ల నంబరు నేను బ్లాగారంభ శూరుణ్ణి కానని చెబుతుందిన్న మాట..అర్థమైందా?

ప్ర) సంతోషం..అర్థమైంది…ఈ తొమ్మిది నెలలు బ్లాగి ఏమి పీగ్గలిగారు?? అదే ఏమి సాధించారు?
జ) నా టపాలతో ఎంతో మంది బ్లాగర్లను సాధించాను …హెహ్హెహ్హె

ప్ర) మౌతు ముయ్యి…అల్లా నవ్వబాకు..లేకుంటే నోట్లో గన్యా దోమలు దూరగలవు…
జ) మూసేశా…ఇంకేమిటి విశేషాలు

ప్ర) అడగాల్సింది నేను..స్పీకాల్సింది నువ్వు…
జ) సరే సరే…ఏవన్నా మాంచి ప్రశ్నలు అడుగు జవాబులు ఠకీ ఠకీ మని చెబుతా

ప్ర) నీకు ఈ బ్లాగుల గురించి ఎలా తెలిసింది?
జ) ఠకీ ఠకీ

ప్ర) అంటే? దానర్థం?
జ) ఠకీ ఠకీ

ప్ర) క్యామిడీనా??? సరిగ్గా చెప్పకబోతే కుళ్ళబొడుస్తా…
జ) వొద్దొద్దు…ఈ సారి సీరియస్….

ప్ర) సరే చెప్పుమరి..బ్లాగుల గురించి ఎలా తెలిసింది నీకు?

జ) మన ప్రవీణ్ లేడు ఆడు పరిచయం చేశాడు. కుర్రాడు ఎప్పుడూ కంప్యూటర్లో కొత్త కొత్త విషయాలన్నింటినీ గెలుకూతూంటాడు. నా చేత http://www.livejournal.comలో బ్లాగు మొదలెట్టించాడు . ఒక రెండు మూడు టపాల తరువాత అందులో బ్లాగడం ఆపేశాను.

ప్ర) ఎందుకు? తరువాత బ్లాగటానికి ముహూర్థం కుదరలేదా?
జ) అదేం కాదు….. ఎంత గింజుకున్నా ఒక్క రిప్లై కూడా రాదు…ఎవరికోసం వ్రాయాలో కూడా తెలియదు. అందుకే బ్లాగుకన్నా డైరీ మిన్న అని…రోజూ డైరీలో నా అనుభవాలని వ్రాసేవాడిని. ఇంకో గమ్మత్తైన విషయం చెప్పనా….నాకు ప్రవీణ్ ఆంగ్ల బ్లాగులు పరిచయం చేస్తే…నేను ప్రవీణ్కు తెలుగు బ్లాగులు పరిచయం చేశా :)

ప్ర) మరి తెలుగు బ్లాగులెలా పరిచయం అయ్యాయి నీకు?
జ) తెలుగు మీద అభిమానంతో యాహూ గుంపైన “తెలుగుదనం”లో సభ్యుడిగా చేరాను. అందులోనే నాకు Telugu RTSలో వ్రాయటం బోధపడింది. దానిలో మన చావా కిరణ్ కూడా సభ్యుడే. అతని ద్వారా మన తెలుగుబ్లాగులు పరిచయం అయ్యాయి.

ప్ర) మరి నీ బ్లాగులో నీ సొంత రచనలు కాకుండా….వేరొకరివి కూడా పోస్టు చేస్తావే? ఎందుకలాగ?
జ) బ్లాగు మొదలెట్టిన కొత్తల్లో ఒక ఆసక్తికరమైన వ్యాసం చదివాను…”బ్లాగు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఎలా?” అని. అందులో..క్రమం తప్పకుండా బ్లాగటం ఒక మంచి అలవాటుగా వ్రాశారు. క్రమం తప్పితే..తరువాత వ్రాయటానికి బద్దకించి మరచిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. అందుకే నేను వ్రాసే విషయాలు కాక పత్రికల్లో నాకు నచ్చిన వ్యాసాలు కూడా బధ్రపరుస్తున్నాను.

ప్ర) మరి ఈ మధ్య నీ సొంత టపాలు పెంచి…సేకరణలు తగ్గించావే?
జ) అవును…తగ్గించాను సి.బి.రావు గారి సలహా ప్రకారమే అలా చేశాను. అసలు చిన్నప్పట్నుంచే నాకు వ్యాసాలు వ్రాసే అలవాటు ఉంది. 8వ తరగతిలో “సారావ్యతిరేక ఉద్యమం” విషయంపై స్కూలు మరియు జూ.కాలేజిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మొదటి స్థానం వచ్చింది. కానీ వయసొచ్చిన తరువాత వేరే వ్యాపకాలు ఎక్కువై పని ఒత్తిడిలో వ్యాసాలు వ్రాయలేకపోతున్నాను.

ప్ర) నీకు ఆశయాలు ఉన్నాయా?
జ) ఉన్నాయి…జీవితంలో కనీసం ఒక్కటంటే ఒక్క కథ వ్రాయాలి. అది చదివి మా నాయన సంతోషించి..నన్ను మెచ్చుకోవాలి

ప్ర) మరి వ్రాయొచ్చు కదా కథ?
జ) మాలతీ చందూర్ గారు ఏం చెప్పారు…..వెయ్యి కథలు చెదివిన మీదట …మొదటి కథ వ్రాయమన్నారా..ప్రస్తుతం మంచి సాహిత్యం చదివేపనిలో ఉన్నాను. అలా చదువుతూ పోతే..ఎప్పుడో ఒకప్పుడు నా మెదడులోని ఫాంటల్ లోబ్స్ లో రసాయనిక చర్యలు జరిగి ఆలోచనలు పుట్టి..అవి నరాల గుండా విద్యుత్తులా ప్రవహించి..చేతిని చేరుకొని..చేతిలోని కలం గుండా పేపరు మీదకు ఒలుకుతాయి. సుకృతం ఉన్న వాళ్ళు కొందరు…సహజంగా రచయితలు అవుతారు…కాని మిగతా వారు కష్టపడాల్సిందే.

ప్ర) ఐతే క్రమం తప్పగూడదన్న తపనలో చాలా చెత్త వదిలే ప్రమాదం ఉంది కదా?
జ) అవును..ఆ విషయం గ్రహించాను. గంగి గోవు పాలు గరిటైడను చాలు కదా. ఈ సందర్బంగా ….ఇక నుంచి మనుష్యులకు ఉపయోగపడే టపాలు ఎక్కువ వ్రాద్దాం అనుకొంటున్నాను.

ప్ర) నువ్వు వ్రాయాలని వ్రాయలేకపోయిన విషయాలు ఏమన్నా ఉన్నాయా?
జ) ఏందుకు లేవు..చాలా చాలా ఉన్నాయి. నా కాలేజీ జీవితంలో జరిగిన విశేషాలు వ్రాయాలంటే కనీసం వెయ్యి టపాలైనా వ్రాయాలి. అంత కాకున్నా కనీసం నా ర్యాగింగ్ రోజులనైనా వ్రాయాలని నా ఆశ.

ప్ర) మరి వ్రాస్తే సరిపోయె?
జ) వ్రాస్తాను..అన్నీ కాదు. చాలా సంఘటనలను మర్యాదకరమైన మాటలతోనే వ్రాయటం కష్టం. అందుకే సంకోచం…చూద్దాం ఎలా వ్రాస్తానో ఎప్పుడు వ్రాస్తానో.

ప్ర) సరే నవీన్ చివరి రెండు ప్రశ్నలు….
జ) హమ్మయ్య అవేవో తొందగా అడిగెయ్యి…ఇంటికెళ్ళి పెరుగులో చపాతీలు తిని..మల్గూబా మామిడి కాయలు తినే కార్యక్రమం ఉంది.

ప్ర) బ్లాగు జీవితంలో నీకు అత్యంత సంతోషం కలిగించినది?
జ) చాలా మంది స్నేహితులను సంపాదించుకోవడం :)

ప్ర) బ్లాగు జీవితంలో నీకు బాధేసేది ఏమిటి?
జ) నా బ్లాగును ఇప్పటికి 10000 సార్లు చూశారు…..కానీ నేను వ్రాసేది చదవాలని ఇంట్లో వారికి ఆసక్తిగా ఉండదు. రెండు మూడు సార్లు చదవమని అడిగా. నేను బాధపడుతానేమోనని బలవంతగా చదువుతున్నట్టనిపించింది. అందుకనే తరువాత “నేను వ్రాసిన టపా చూశావా” అని అడగటం మానేశా. మానేశానంటే..బాధపడుతున్నానని కాదు, ఎవరి ఆసక్తి వారిది. చదివితే బాగుండునే అన్న చిన్న ఫీలింగ్ అంతే…….

ప్ర) మంచి విశేషాలు చెప్పావు నవీన్..సంతోషం…నీ లోపాలు నువ్వు తెలుసుకొని..వాటిని సరిదిద్దుకొంటూ వెళ్ళు. ఎందుటి వారిలో ఎప్పుడూ మంచినే చూడు….వస్తాను
జ) సంతోషం..అందరికీ నమస్కారం….సత్యం శివం సుందరం

ప్రకటనలు

19 thoughts on “మన బ్లాగుకు 10,000 హిట్లు

 1. అభినందనలు నవీన్ గారు.
  మీ interview బావుంది.
  చాలా విషయాలు తెలిసాయి.
  ఇంకొన్ని తెలుసుకోవటానికి లంకెలు దొరికాయి.

  ఒక విషయం, ఇంట్లో మనం రాసేవి పట్టించుకునే వారు, మన “సోది” ని అభినందించే వారుంటే మనం (నా లాంటి వాళ్ళు) బ్లాగులు రాసే అవసరం(?) ఉండేది కాదేమో?

  మా వారికి నేను ఒకటో రెండో ప్రత్యేకించి చూపించి చదవమంటే తప్పని సరై చదువుతారు. అదైనా చదివారు కదా అని సంతోషించి ఇక ఎలా ఉంది, ఏమనిపించింది అనే ప్రశ్నలతో విసిగించకుండా ఆ తాపత్రయాన్ని మరో టపా చదివించుకునేందుకు పొదుపు చేసుకుంటాను.

  కానీ, నాకు చాలా సంతోషం కలిగించిన విషయం, నా స్నేహితురాలు నా బ్లాగులు regular గా చదువుతోందని తెలియడం, సరిగ్గా నా బ్లాగులు నాకు కావలిసిన వారికి ఎలా అర్థం అవ్వాలనుకున్నానో అలానే తనకి అర్థం అవ్వడం.

 2. మీకేంటి సార్…
  పదివేలేంటి. పది లక్షలే వస్తాయి. నాక్కూడా నిజం చెప్పాలంటే మీ సొంత టపాలు ఎక్కువ చూడాలని అనిపించేది. మీ నిర్ణయం కూడా అదే అని తెలిసి చాలా సంతోషం.
  మీ ఇంటర్వ్యూ అదిరింది. :)

 3. నవీన్ గారు,

  మీకు పదివేల బ్లాగాభివందనాలు…

  అవునండీ మీ 10,000 క్లబ్ లో మన సుధాకరుడు, మీరు కాకుండా ఇంకా ఎవరైనా వున్నరా!
  -నేనుసైతం

 4. మీ బ్లాగుకు ఇప్పటి వరకూ 100000 హిట్లు రాలేదంటే, అశ్చర్యంగా ఉంది!!!
  మీరొక చక్కటి కథను వ్రాసి, వెంటనే మీ నాన్న గారికి (,మాకు) చూపించగలరు.
  ఏమయినా సందేహాలు ఉంటే, ముందు నా మీద ప్రయోగించి చూసే అవకాశాన్ని ఇస్తున్నాను :-)

 5. నవీన్,
  అభినందనలు.

  ప్ర) బ్లాగు జీవితంలో నీకు బాధేసేది ఏమిటి?
  జ) నా బ్లాగును ఇప్పటికి 10000 సార్లు చూశారు…..కానీ నేను వ్రాసేది చదవాలని ఇంట్లో వారికి ఆసక్తిగా ఉండదు. రెండు మూడు సార్లు చదవమని అడిగా. నేను బాధపడుతానేమోనని బలవంతగా చదువుతున్నట్టనిపించింది. అందుకనే తరువాత “నేను వ్రాసిన టపా చూశావా” అని అడగటం మానేశా. మానేశానంటే..బాధపడుతున్నానని కాదు, ఎవరి ఆసక్తి వారిది. చదివితే బాగుండునే అన్న చిన్న ఫీలింగ్ అంతే…….

  ఈ ప్రశ్నకు నీ జవాబే నా జవాబూనూ!

  –ప్రసాద్
  http://blog.charasala.com

 6. ఓహ్ ..మీ అందరి అభిమాన అభినందన జల్లుల్లో తడిసి ముద్దయ్యాను. వ్యాఖ్యలు వ్రాసి శుభాకాంక్షలు అందించిన మీ అందరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు తెలుపుతున్నాను.

  ** netien గారు,
  నేను బ్లాగు తెరచింది: July 22, 2006
  మొదటి టపా వ్రాసింది: August 18, 2006 (మొదట్లో అన్నీ సేకరణలు)
  సొంత టపా మొదటిగా వ్రాసింది: September 16, 2006
  ** నాగరాజా గారు,
  మీరిచ్చిన అవకాశాన్ని తప్పక వినియోగించుకుంటాను :)
  ** విహారి గారు,
  నావి పేజి లోడ్లే……మీరు క్లబ్బులో అల్రెడీ ఉన్నారంటే ఆశ్చర్యమేమీ లేదు.
  ** రాధిక గారు,
  హైబ్లాస, బెబ్లాస, అతెబ్లాస అని కాకుండా తెబ్లాస గా ఎప్పుడైతే అందరం కలుస్తామో అప్పుడు పూతరేకులు తప్పక తెస్తాలేండి :)

 7. అభినందనలు. మీ తాజా పూతరేకులు భలే అదిరాయ్. ఎప్పటిలాగే చాలా రుచిగా చేశారు? 10000 మంది తిన్నారంటే తినారా మరి? మీరు వేరే వాళ్ళ పూతరేకులమ్మిన రోజులకంటే ‘స్వగృహా’ పెట్టుకున్నాక చేసినవి ఇంకా బాగుంటున్నాయి.
  ప్ర) బ్లాగు జీవితంలో నీకు బాధేసేది ఏమిటి?
  ఈ ప్రశ్నకి ‘నా సమాధానం’ కాపీ చేసి వ్రాసారేమిటీ అనిపించింది. సరే రచ్చ గెల్చి ఇంట ఓడడం అంటే ఇదేనేమో.

 8. ఈ విషయాలు చెప్పడానికి ఇంటర్యూ పద్ధతిని ఎంచుకోవడంతో సొంతటపాలు రాసే సత్తా నీకు పుష్కలంగా ఉందని తెలుస్తోంది. కాలెజీ జ్ఞాపకం చిన్నదిగా ఒక్కటి ఒదిలిచూడు.

 9. పదివేల సందర్శకులంటే బయటినించే కంగ్రాట్స్ అని చెప్పి లోపలికి వచ్చి టపా చూడలేదు..ఇంటర్యూ అదుర్స్..మీరు మా బ్లాగుకు కూడా వీలనప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాలని రిక్వెస్ట్..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s