మన బ్లాగు ఎంత తాజాగా ఉంది?

1. నా బ్లాగు ఎంత తాజాగా ఉంది? తెల్లవారి…అప్పుడే కూరగాయల విపణిలో (Market) సంతలో నవ నవ లాడుతున్న కూరగాయల్లా తాజాగా ఉంటుందా లేక అసెంబ్లీ సమావేశాల్లో వచ్చే కుళ్ళు కంపు కొడుతుందా?
2.
నేను ఉపయోగపడే టపా వ్రాస్తానా లేక ఎవ్వరికీ ఉపయోగపడని బేవార్స్ టపా వ్రాశానా?
3. నేను వ్రాసిన టపా జనాలకు ఎంత నచ్చింది?
4. నేను వ్రాసిన టపాల్లో అత్యుత్తమ టపా ఏది?
5. ఈ సంవత్సరంలో వ్రాసిన అత్యుత్తమ టపాలు ఓ పది పట్టడమెలాగు?
6. ఉండడానికే!!! సుబ్బరంగా వందకు పైన టపాలు ఉన్నాయి. అందులో జనాలకు ఊపయోగపడేది ఒక్కటైనా ఉందా? ఉపయోగపడకపోయినా కనీసం కొంచెం ఐనా ఆనందం కలిగించిందా? వారిలో ఆలోచనలు రేకెత్తించేలా చేసిందా? నేను మొదటి టపా వ్రాశి దాదాపు సంవత్సరం కావస్తోంది. ఇలా లక్ష్యం లేక వ్రాస్తూండటం ఎన్నాళ్ళు?

ఈ ప్రశ్నలకు ప్రస్తుతం నా వద్ద సమాధానం నా వద్ద లేదు. ఈ మధ్య పూతరేకులు ప్రభుత్వ యంత్రాంగంలా స్థబ్దుగా ఉండటానికి కారణం పని కొంచెం ఎక్కువ ఉండటం ఒక కారణం. దానికన్నా పైవన్నీ నిరంతరంగా ఆలోచిస్తూ ఉండటం ముఖ్యకారణం. కానీ కూడలికి నేనెంత దూరం అవుదామని ప్రయత్నించినా “నన్ను వదలి నువ్వు పోలేవులే….” అంటుంది. ఏం చెయ్యను. మంచి పోశ్టులు, కవితలు చూసినప్పుడు రాసేద్దాం అన్న ఆవేశం వస్తుంది. ఆవేశాన్ని నా ఆలోచన చంపేస్తుంది. దాని వలన కలిగే బాధని పని వత్తిడి కప్పేస్తుంది. ఏమిటి…ఇలా అవుతోంది. ఈ తికమకలో కొన్ని సార్లు గుంపులో విరుచుకుపడుతూ కొన్ని రిప్లైలు ఇచ్చాను. తరువాత నాలు కరచుకొన్నాను.

ఈ ఆలోచనలకంతా చమరగీతం పాడుతూ ఎప్పట్లాగే “పూతరేక్స్”ను కొనసాగించాలని ఈ రోజే నిర్ణయించాను. ముందుట్లాగే అన్నీ వ్రాస్తాను. కానీ ఒక చిన్న మార్పు.

టపా వ్రాసిన తరువాత “పోశ్టు యొక్క తాజాదనం” శాతం వ్రాస్తాను. నాకు నా పోశ్టు బాగా నచ్చింది అనుకోండి…డిస్టింక్షను వస్తుందనుకొంటే “75% తాజాదనం” అని వ్రాస్తాను. అది ఏ సినిమా గురించో ఐతే “35% తాజాదనం”. ఎవరినైనా విమర్శిస్తేనో లేక చెడ్డమాటలు వ్రాస్తే ఫెయిలే…”ఏ 10%మో లేక 25%” వస్తుంది. ఇది నాకు నేను ఇచ్చుకునే మార్కులు మాత్రమే. వ్యాఖ్య వ్రాసే ప్రతి ఒక్కరు కూడా నాకు మార్కులు వెయ్యవచ్చు. వ్యాఖ్య రాసే సమయం లేకపోయినా..వ్రాయడానికి మాటలు లేవు అని అనిపించినా ఓఠ్ఠి మార్కులెయ్యండి చాలు. అంటే….”చాలా బాగుంది” బదులు “60%”, చెత్తగా ఉంది బదులు “20%” అన్నమాట. వీలైతే నన్నెందుకు ఫ్యాసు చేశారో ఎందుకు ఫెయిలు చేశారో వ్రాయండి…సంతోషంగా మీ సూచనలను స్వీకరిస్తా. నేను స్నేహితుణ్ణి కదా అని మీరు మొహమాటపడి ఎక్కువ మార్కులు వెయ్యనవసరంలేదు. ఒకరు 90% వేశారు కదా అని మీరు తక్కువ వెయ్యడానికి సందేహించకండి. అది మీ వ్యక్తిగత అభిప్రాయం అని అర్థం చేసుకోగలను. Anonymous వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడి వ్యాఖ్యలు లెక్కలోకి రావు.

ప్రతి నెలా / సంవత్సరం ఈ మార్కులన్నీ Avg తీసుకొని నా బ్లాగు తాజాగా ఉందా కంపుకొడుతోందా చూస్తా. తప్పుల్ని దిద్దుకోని కొత్త ప్రణాళికలతో ముందుకు పోతా.

_________________________________________________________________
59% తాజాదనం

16 స్పందనలు

 1. కూరగాయల విపణి అనేబదులు సంత అని ఉండవచ్చుకదా… అంచేత ఈ పోస్టుకు కొన్ని మార్కులు కట్.

 2. ఛత్…………ప్రతి మంగళవారం …సంతకు పొయ్యొస్తా అని చెప్పడటం ఇంట్లో అలవాటే…మరి ఇది రాసేటప్పుడు…అది గుర్తురాలేదేంటి!!!!!!!
  రానారె…సంత అని గుర్తు చేశి మంచి పని చేశావ్ :)

 3. తెలుగు పదం గుంపులో తాబాసు గారితో చర్చించిన Marketability = విపణియోగ్యత మహత్యమేమో.

 4. మంచి ఆలోచన. పూతరేకుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం.

 5. మీ బ్లాగ్ నిజం గానే చాలా తాజాగా ఉంది
  మన తెలుగు వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త
  quillpad.in/telugu సైట్ లో మనం ఆంగ్లం లో టైప్ చేస్తే తెలుగు లోకి అనువదించపడుతుంది

 6. chaaaaaaaaaaaalaaaaaaaaaaaaaaaaa baaaaaaaaaagundi.

 7. […] _________________________________________________________________ 50% తాజాదనం ( ఏమిటిది? ) […]

 8. taajaa kaburu

  lEtu gaa choosaanaMDi

  kaanI taajaa gaanE undi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: