బరువు తగ్గడానికి 10 ఉపాయాలు

ఈ మధ్య ప్రపంచీకరణ ప్రభావంతో రెస్టారెంట్లు, మెక్ డొనాల్డ్ లాంటివి పెరిగిపోయాయి. ఆధునిక జీవన శైలి వలన మనకు తెలియకుండానే బరువు పెరుగుతున్నాము. కూర్చొని పని చేసే ప్రతి ఉద్యోగి, వ్యాపారి కూడా తన బరువు మీద కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 35 దాటిన వాళ్ళు తమ బరువు మీద నియంత్రణ కలిగి ఉండాలి. బరువు పెరగటం వల్ల పొట్ట వద్ద, తొడల దగ్గర కొవ్వు పేరుకొని, గడ్దం క్రింద చర్మం వేలాడుతూ అసహ్యంగా తయారు అవుతాము. చర్మం కూడా బాగా సాగుతుంది. ఒక్క కేజీ బరువు పెరగటానికి ఎంతో సమయం పట్టదు. కానీ అదే ఒక్క కేజీ బరువు తగ్గటానికి వ్యాయామశాలకు వెళ్ళి, రోజు అర గంట పరుగెత్తి, కడుపును పస్తులు పెట్టి నానా అవస్థలు పడాలి. ఇన్ని అవస్థలు మనకు అవసరమా!! కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మనము బరువు చూసుకొంటూ ఉండాలి. మీరు స్థూలకాయస్తులా కాదా అనడానికి ఒక చిన్న లెక్క ఉంది. శివ 170cm పొడవు ఉన్నాడు, అతను ఎక్కువంటే (170 – 100 = 70Kgలు) ఉండవచ్చు. మన చేతి ఎముకలు సన్నవా, లావువా అని చూసి ఒక +/-5kgలు అటూ ఇటూ సర్దుకోవచ్చు. దాని దాటితే స్థూలకాయస్తుల జాబితాలో చేరినట్టే.
దీన్ని జయించాలంటే, రోజు వారిలో మనం కొన్ని అలవాటులు మార్చుకోవాలి. అంతే కాక మనస్సు రక రకాల రుచుల మీదకు పోకుండా నియంత్రించుకోవాలి. వాటి కోసం కొన్ని చిన్న చొట్కాలను పంచుకొంటున్నాను

1. చిన్న తట్టలో (పళ్ళెం) తినండి. మీకు తెలీకుండానే మీరు తక్కువ తినడం ప్రారంభిస్తారు.


2. భోజనానికి 30 నిముషాల ముందు నీళ్ళు బాగా త్రాగండి. ఆకలి ప్రభావం అంతగా తెలియదు. భోజనానికి రెండు గంటల తరువాత కనీసం 30 నిముషాలకు ఒక్కసారి నీళ్ళు త్రాగండి.


3. రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువ సార్లు తినండి. కప్పుడు అన్నంతో పాటూ ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు ఉండేలా చూసుకోండి. రాత్రి మాత్రం ఒక్క చపాతి చాలు. ఆకలేస్తే ఏ పచ్చి క్యారెట్టో, ఆపిలు పండో తినండి. (ఆహారపు అలవాట్ల గురించి విఫులంగా ఇంకో టపాలో వ్రాస్తా)


4. నోరు కట్టేసుకోవడం మా వల్ల కాదు అనేవాళ్ళు ఏదైనా తినండి ఐతే కొద్దిగా తినండి. తినేది ఒక్క బజ్జీయే అయినా నెమ్మదిగా తింటూ దాని రుచిని ఆస్వాదించాలి.
చిరు తిండ్లు, తీపి పదార్థాలు తినవలసి వస్తే…నిరభ్యరంతరంగా తీసుకోండి. ఐతే ఒకటికి మించి వద్దు. లేకపోతే [[అహ నా పెళ్ళంట]] సినిమాలో కోటాను అనుసరించాలి ;)


5. వారం మొత్తం నూనె పదార్థాలు లాంటివి పత్యం ఉన్నందుకు ప్రతిఫలంగా ఆదివారం మధ్యాహ్నం మీకిష్టమొచ్చింది తినండి. అంటే ఏదైనా స్పెషల్ తినల్ల అంటే ఆదివారం కోసం ఎదురు చూడాల్సిందే.


6. లిఫ్టు ఎక్కవద్దు, ఎన్ని అంతస్థులైనా సరే, ఎన్ని సార్లయినా సరే మట్లే ఎక్కండి. (కీళ్ళ వ్యాధులు ఉన్న వాళ్ళు వైద్యుని సలహా తీసుకోండి). బస్సు దిగాల్సిన స్థానం కన్నా ఒక స్థానం (stop) ముందే దిగెయ్యండి.


7. ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోండి. ఆత్రం వద్దు. ఆత్రంగా అన్నీ కుక్కేసుకోవడం కంటే, తినే ఒక్కదాన్నే తింటూ దాని రుచిని మెల్లగా ఆస్వాదించండి.


8. ఫలాల రోజు, కూరాగాయల రోజు, మొలకల రోజు లాంటివి ప్రతి నెలా జరుపుకోండి. ఆ రోజు తాజా పండ్లు, కూరగాయలే మాత్రమే తినండి .


9. నేను ఫలానా పది కేజీల బరువు తగ్గ దలుచుకున్నాను అని స్నేహితులు అందరికీ చెప్పండి. ఒక వేళ బరువు తగ్గాడానికి జాగ్రత్తలు తీసుకోకపోతే జనాలు అడుగుతున్నప్పుడైనా చురుక్కుమని తగిలి కర్తవ్యం గుర్తు వస్తుందిటి.


10. అన్నిటికన్నా ముఖ్యం, బరువు తగ్గాలన్న అత్యుత్సాహం వద్దు. అత్రుత్సాహం ఉంటే ఆరంభశూరుగానే మిగులుతారు. అలవాటులన్నీ మెల్లమెల్లగా మార్చుకోవాలి. ఇది ముఖలో మొదలుపెట్టి పుబ్బలో ముగించే కార్యక్రమంలా కాక, జీవితాంతం ప్రతి ఒక్కరోజూ పాటించే అలవాటుగా మార్చుకోండి.

ఇట్లాంటి ఉచిత సలహాలను ఎన్నని గుర్తు పెట్టుకోవాలి అనే అడిగేవారికి కొసరుగా మూడు గుడ్డి గుర్తులు
1) ఎప్పుడూ సగం కడుపుకే తినండి. అంట పొట్టలో సగం ఆహారం ఉంటే, మిగతా సగం గాలి, నీరు ఉండాలన్నా మాట.

2) సాధ్యమైనంతవరకు యంత్రాలు ఉపయోగించడం మానెయ్యండి.

3) వేపుళ్ళు, పాల ఉత్పత్తులు పూర్తిగా మానెయ్యండి, అస్సలు ముట్టుకోవద్దు.

(హెచ్చరిక: ఇది స్వయం అనుభవాలతో ఇస్తున్న సలహాలే కానీ వైద్యుని చికిత్సకు ప్రత్యామ్నాయాలు కావు)

_________________________________________________________________
65% తాజాదనం ( ఏమిటిది? )

ప్రకటనలు

107 thoughts on “బరువు తగ్గడానికి 10 ఉపాయాలు

 1. పెరుగెత్తడం కన్నా కొద్ది దూరం జాగింగ్ చేస్తే మేలు అనుకొంటా. రోజూ మైళ్ల కొద్దీ పరుగెత్తే…దీర్ఘకాలంలో కీళ్ళ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఎక్కడో చదివా. అదీ కాక…కొన్నాళ్ళు చేసి, తరువాత నిలిపివేస్తే కూడా మంచి కాదు అని జనాలు చెప్పగా విన్నాను.
  పొట్ట తగ్గాడానికి యోగా బాగా పని చేస్తుంది అనుకొంటా. హలాసనం లాంటివి చేస్తే మంచి ఫలితం.

 2. అమెరికానుండి మొదట నేర్చుకోకూడని విషయమిదే..గాబరా తిండి (ఫాస్ట్ ఫుడ్).. బాబోయ్ దయచేసి మెక్‌డోనాల్డ్స్, సబ్వే, పిజ్జాహట్ లాంటి ప్రదేశాలలోని చెత్త తిండి తినవద్దు..దూరపు కొండలు నునుపు కానీ ఇడ్లీలు, పెసరట్లు తినక ఇదేం మాయరోగం..ఈ లెక్కన భారతదేశం కూడా అమెరికాలాగా ఫాట్సో నేషన్ అయ్యేట్టుంది (అందునా ముందే భారతీయులకు జన్యుపరంగా హృద్రోగ్రము సంభవించే అవకాశాలు మెండు)

 3. పాలు తప్పకుండా తాగాలి మనక్కావలసిన కాల్షియం, మెగ్నీషియం చాలామటుకు అందులోనుండే వస్తాయి కానీ పాలలో కొవ్వెక్కువ కాబట్టి కట్టె విరగకుండా పామును చంపాలంటే లో్‌ఫాట్ పాలు లేదా వెన్నతీసిన పాలు తాగండి. ఇక నెయ్యి, రసగుల్లా వగైరా ఆధునిక జీవనశైలికి తగవు (తింటే ఇక పరిగెత్తాల్సిందే)

 4. బరువు తగ్గాలంటే కష్టం కాని, బరువు పెరగాలంటే చాలా సులువు.పైన వ్రాసిన పది పాయింట్లకు వ్యతిరేకం చెస్తే సరి :), ఏమంటారు?.

  ఇలా చెప్పినంత సులువు కాదులెండి.నాకు ఇది బాగా తెలుసు ఎందుకంటే నేను ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు ఇద్దరు స్నెహితులు తగిలారండి. ఇద్దరూ తెలుగువారే. ఇద్దరికీ ఒకటే ప్రొబ్లెం, వుండవలసిన బరువుకంటే తక్కువ బరువు వుండటం.ఎంత తిన్నా లావు కాక పోవడం.

  ఇద్దరి నడవడికలు దాదాపుగా ఒకటే అంటే నమ్మండి. బాచ్లర్ గా వున్నప్పుదు వీరితో 2 సంవత్సరాలు వున్నాను కాబట్టి వారిని చూసి నాకు (లావు పెరగాలంటే) అర్థం అయ్యింది ఇది:

  – ఎప్పుడూ ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవకూడదు.నా స్నెహితులకు ఏ చిన్నదానికైన చాలా టెన్షన్ ఫీల్ అయ్యేవారు.
  – కారం నొర్మల్ గా తినాలి. నా స్నెహితులకు భోజనానికి పచ్చి మిరపకాయలు లేనిదీ అన్నం దిగేదికాదు.
  – స్వీట్లు బాగా తినాలి.
  – పచ్చడి (ఉరగాయ) నొర్మల్ గా తినాలి. ప్రతిసారి భోజననికి 5 – 6 ఉరగాయ ముక్కలు తినడం లాంటివి చేయకూదదు.
  – చిన్నవాటికంతా ఎక్కువ ఆలొచించకూడదు.

  నెను అర్థం చెసుకున్నంత వరకు బరువు తక్కువ ప్రొబ్లెం కొంచం మైండ్ రిలేటెడ్ అనిపిస్తుంది.
  ఒక స్నేహితుడు మాత్రం పెళ్ళి ఐన సంవత్సరానికి కొంచం లావయ్యాడు :)

 5. రామ రామ ఆశోక్ గారూ, అంత పని చేయకండి బాబు..బరువెక్కాలని స్వీట్లు, నానా గడ్డీగాదం తింటే బరువెక్కుతారు..దానితో పాటూ కొవ్వెక్కుతారు కూడా..బరువు తగ్గటం ఎంత కష్టమైన పనో బరువు పెరగటం కూడా అంతే కష్టమైన పని (మా అవిడ బరువెక్కాలని ఆర్నెల్లనుండి తెగ కృషి చేస్తుంది..కానీ ప్రోగ్రెస్సు నిల్లు)
  ఆరోగ్యంగా బరువెక్కటానికి సరళమైన మార్గం మీ బరువు (కేజీల్లో) x 2 = గ్రాముల ప్రోటీను రోజూ తిసుకుని కాస్తైనా వ్యాయామం చెయ్యటం (దాంతో పాటు నీళ్ళు కూడా బాగా తాగాలండోయ్). బుజ బుజ బరువెక్కటానికి తిండి ఎంతకారణమో, ఉప్పూ అంతే కారణం

 6. Hello every body,

  Andharu yee krinda message chadavandhi….

  DRINK WATER ON EMPTY STOMACH

  It is popular in Japan today to drink water immediately after waking up every morning. Furthermore, scientific tests have proven its value. We publish below a description of use of water for our readers. For old and serious diseases as well as modern illnesses the water treatment had been found successful by a Japanese medical society as a 100% cure for the following diseases:
  Headache, body ache, heart system, arthritis, fast heart beat, epilepsy, excess fatness, bronchitis asthma, TB, meningitis, kidney and urine diseases, vomiting, gastritis, diarrhea, piles, diabetes, constipation, all eye diseases, womb, cancer and menstrual disorders, ear nose and throat diseases.

  METHOD OF TREATMENT
  1. As you wake up in the morning before brushing teeth, drink 4 x 160ml glasses of water
  2. Brush and clean the mouth but do not eat or drink anything for 45 minute
  3. After 45 minutes you may eat and drink as normal.
  4. After 15 minutes of breakfast, lunch and dinner do not eat or drink anything for 2 hours
  5. Those who are old or sick and are unable to drink 4 glasses of water at the beginning may commence by taking little water and gradually increase it to 4 glasses per day.
  6. The above method of treatment will cure diseases of the sick and others can enjoy a healthy life.

  The following list gives the number of days of treatment required to cure/control/reduce main diseases:
  1. High Blood Pressure – 30 days
  2. Gastric – 10 days
  3. Diabetes – 30 days
  4. Constipation – 10 days
  5. Cancer – 180 days
  6. TB – 90 days
  7. Arthritis patients should follow the above treatment only for 3 days in the 1st week, and from 2nd week onwards – daily.

  This treatment method has no side effects, however at the commencement of treatment you may have to urinate a few times.
  It is better if we continue this and make this procedure as a routine work in our life.
  Drink Water and Stay healthy and Active.

  This makes sense .. The Chinese and Japanese drink hot tea with their meals …not cold water. Maybe it is time we adopt their drinking habit while eating!!! Nothing to lose, everything to gain…

  For those who like to drink cold water, this article is applicable to you.
  It is nice to have a cup of cold drink after a meal. However, the cold water will solidify the oily stuff that you have just consumed. It will slow down the digestion.
  Once this “sludge” reacts with the acid, it will break down and be absorbed by the intestine faster than the solid food. It will line the intestine. Very soon, this will turn into fats and lead to cancer. It is best to drink hot soup or warm water after a meal.

  A serious note about heart attacks: Women should know that not every heart attack symptom is going to be the left arm hurting.
  Be aware of intense pain in the jaw line.

  You may never have the first chest pain during the course of a heart attack.
  Nausea and intense sweating are also common symptoms.

  60% of people who have a heart attack while they are asleep do not wake up.
  Pain in the jaw can wake you from a sound sleep. Let’s be careful and be aware. The more we know, the better chance we could survive…

  A cardiologist says if everyone who gets this mail sends it to everyone they know, you can be sure that we’ll save at least one life

 7. సరితగారు,
  వ్యాయామం చేసే సమయం లేని వాళ్ళకు ఇంకొక చిట్కా ఉంది. 1/2 ఫార్ములా పాటించండి, దెబ్బకు బరువు తగ్గుతారు. అంటే ఇప్పుడు తినే పరిణామంలో అన్నీ సగమే తినాలనన్న మాట. ఆరు ఇడ్లీలు తింటే మూడు ఇడ్లీలు, నాలుగు దోశలు తినే చోట రెండు దోశలు తింటూ. స్వీట్లకు, నూనెకు దూరంగా ఉండండి చాలు. నెలలోనే మీకు తేడా తెలుస్తుంది. ఇంకో ముఖ్య గమనిక, రాత్రి భోజనం బదులు రెండంటే, రెండే చపాతీలు కూరతో తిని చాలిస్తే, ఫలితం మరింత వేగంగా ఉంటుంది. సరైన పోషకాలు అందడానికి, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి, లేకుంటే డైటింగ్ వలన జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది.

 8. వ్యాయామం ఆకలి తిండి బరువు సమస్య మళ్లీ మొదటికే
  భుధ వారం, సెప్టెంబర్ 02, 2009 , 3:37 [IST]

  చెలిడెస్క్‌

  శరీరాకృతి పొందికగా ఆకర్షణీయంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు? అమ్మాయిలే కాదు నడివయసు వారు కూడా సన్నగా, నాజూగ్గా ఉండాలని కఠోర వ్యాయామాలకు పూనుకుంటున్నారు. అయినా సరే తమ బరువును మాత్రం తగ్గించుకోలేకపోతున్నారు. ఒకేసారిగా శరీరంలో ఎక్కువ కాలరీలు కోల్పోవడం వల్ల, ఆకలి పెరిగిపోతుందనీ, దీంతో మామూలుకన్నా ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కోల్పోయిన కాలరీలు తిరిగి సమకూరి బరువు మాత్రం అదే స్థాయిలో ఉంటుందని నిపుణులు సెలవిస్తున్నారు.ఎంత శ్రమకోర్చి వ్యాయామాలు చేసినా, ఆరామ్‌గా కూర్చుని బర్గర్లు, పేస్ట్రీలు, చిప్స్‌ లాగిస్తే తేలిగ్గా బరువు పెరిగిపోతుందనీ, అందుకే అతి వ్యాయామమూ అనర్ధమేనంటున్నారు.

  బరువు తగ్గాలంటే వ్యాయామం చేయాలి. ఇది అందరూ ఒప్పుకొనేమాట. స్థూలకాయం సమస్య అధికంగా ఉన్న అమెరికాలో శరీరబరువుకి, వ్యాయామానికి ఉన్న సంబంధంపై జరిగిన తాజా పరిశోధనలు ఫలితాలు అందరూ ఒప్పుకొనే పైమాటని ఒమ్ముచేసేవిగా ఉన్నాయి. నిజానికి వ్యాయామం అన్నది బరువు తగ్గడానికి దారితీయకపోగా పెరగడానికి దోహదపడుతున్నట్లు తేలింది. సాధారణంగా కఠోర వ్యాయామం తర్వాత ఆకలి పెరగడం, అందువల్ల వెంటనే ఎక్కువగా తినడం జరుగుతోందని ఈ పరిశోధనల్లో తేలింది. కొంతమంది కఠోర వ్యాయామం చేసినందుకు తమను తాము అభినందించుకొనే క్రమంలో ఎక్కువగా తింటున్నట్టు కూడా వెల్లడైంది. మొత్తానికి బరువు తగ్గడానికి కఠోర వ్యాయామం మార్గం కాదని అమెరికాలో చాలామంది వైద్యులు చెబుతున్నారు.

  సాధారణంగా టీ.వీ వంటి మీడియాల్లో జిమ్‌ వ్యాపార ప్రకటనలు వ్యాయామం ద్వారా బరువు తగ్గిస్తామని, స్థూలకాయం సమస్య లేకుండా చేస్తామని మాట ఇస్తూ ఉంటాయి. చాలామంది ఈ వాగ్దానాన్ని నమ్మి జిమ్‌ల దారి పడతారు. అమెరికాలో కూడా అదేపరిస్థితి. ఇలాంటి వ్యాపార ప్రకటనలను నమ్మి కొద్దికాలం వ్యాయామం తర్వాత బరువు తగ్గించుకున్న కొంతమంది ఆ వ్యాయామం తంతు ముగిశాక మరికొంత కాలానికి రెట్టింపు బరువు పెరుగుతున్నారు.
  పబ్లిక్‌ లైబ్రరీ ఆఫ్‌ సైన్స్‌ అనే పత్రిక ఇటీవల అమెరికాలో ఈవిషయంపై జరిగిన ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. ఈ అధ్యయనం వ్యాయామంతో శరీర బరువు తగ్గదని గట్టిగా వాదించే డాక్టర్‌ ఎరిక్‌రావుసిన్‌ శిష్యుని పర్యవేక్షణలో జరిగింది. ఆయన పేరు డాక్టర్‌ తిమోతిచర్చ్‌. ఈ పరిశోధనా బృందం 464మంది అధికబరువుగల మహిళలను నాలుగు బృందాలుగా విభజించి ఆరు నెలల పాటు వారిని భిన్న పరిస్థితుల్లో అధ్యయనం చేసింది. వారిలో ఒక శిక్షకుని పర్యవేక్షణలో కఠోరవ్యాయామం ఆచరించిన బృందంలోని వారు ఆశ్చర్యకరంగా అధికంగా బరువు పెరిగారు. రోజువారీ ఆహారపుటలవాట్లు మార్చకుండా కొనసాగించిన బృందంలో మహిళలు బరువు తక్కువగానే పెరిగారు. ఇలా ఎందుకు జరిగింది?

  సాధారణ మోతాదులో ఆహారం తీసుకున్నవారు చిరుతిళ్లు తక్కువ తిన్నారు. కఠోర వ్యాయామం చేసినవాళ్లు ఆకలికి తట్టుకోలేక అపరిమితంగా తిన్నారు. ఫలితంగా మొదటి వారు బరువు కొద్దిగా పెరగగా, వ్యాయామం చేసినవారు బరువు అధికంగా పెరిగారని నిపుణులు తేల్చారు. అమెరికాలో బరువు తగ్గడానికి వ్యాయామం చేయాల్సిందిగా అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేట్‌ సంస్థలు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పై అధ్యయనానికి విలువ పెరిగింది. ఆహారపుటలవాట్లు మార్చుకోని వారు, కఠోర వ్యాయామం చేసినవారు ఇరువురూ బరువు పెరిగితే ఇక వ్యాయామం దేనికి అన్న ప్రశ్న ఈ అధ్యయనం లేవనెత్తింది. 2007లో అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసన్‌, అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ శరీర బర ువు తగ్గించుకోవడానికి కొత్త మార్గదర్శకాలను నిర్దేశించాయి. ఆ సూత్రాల ప్రకారం ప్రతి మనిషి అరవై నుంచి తొంభైనిమిషాల శారీరక వ్యాయామం చేస్తే చాలు బరువు తగ్గుతారు. అంటే వారంలో చాలారోజులు పాటు రోజుకీ 60 నుంచి 90 నిమిషాల వ్యాయామం చేయాలి. డాక్టర్‌ తిమోతిచర్చ్‌ చెప్పినదాని ప్రకారం ఇలా చేస్తే బరువుతగ్గకపోగా ఇంకా పెరుగుతారు. ఎందుకంటే అంతసేపు వ్యాయామం వల్ల వారిలో ‘కాంపెన్‌సేటరీ ఈటింగ్‌ పెరుగుతుంది. అంటే వ్యాయామ శ్రమని పరిహరించుకోవడానికి తినే తిండి పెరుగుతుంది. డాక్టర్‌ చర్చ్‌ ఏ వ్యాయామం వల్ల ఎంత కేలరీస్‌ ఖర్చవుతాయో చెబుతూనే ఆ పనుల తరువాత ఒక మఫిన్‌ తింటే తిరిగి ఆ కేలరీల శక్తి మనని చేరుకుంటుందని హెచ్చరించారు.

  ప్రతి మనిషి సహజంగా తమకు అవసరమైన శక్తిమేరకు కేలరీలుంచుకుని, తక్కినది ఖర్చుచేసేవిధంగా పరిణామం చెందలేదని డాక్టర్‌ చర్చ్‌ చెబుతున్నారు. అదనపు కేలరీలతో మెలిగే శక్తిని ఎలుకలు పరిణామక్రమంలో సంతరించుకున్నాయి. ఈవిషయంలో మానవులకంటే ఎలుకలు మేలు. ఎందుకంటే ఎలుకల్లో ‘బ్రౌన్‌ఫాట్‌ అనిపిలిచే ముదురు రంగు టిస్యూ ఎక్కువగా ఉంటుంది. ‘మిటోచోండ్రియా అనే అతిచిన్న కణాల యూనిట్లను పరిహరించడంలో ఈ బ్రౌన్‌ఫాట్‌ చాలా చురుగ్గా పనిచేస్తోంది. ఈ కణజాలం పోషకాలను శక్తిగా మారుస్తుంది. అవి స్విచ్‌ఆఫ్‌ అయినపుడు జంతువులు శక్తికి ఉద్దీపన పొందలేవు. శక్తి పొందడానికి బదులుగా వాటి శరీరం వేడెక్కుతుంది. అందువల్ల అదనపు కేలరీలు వేగంగా ఖర్చయిపోతాయి. బ్రౌన్‌ఫాట్‌ ఎక్కువగా ఉంటే స్థూలకాయం రాదు. మానవుల శరీరంలో ఈ బ్రౌన్‌ఫాట్‌ దురదృష్టవశాత్తు చాలా తక్కువ. అందుకే సరదాకోసం చిరుతిండి తిన్నా మనలో ఒళ్లు పెరిగే ప్రమాదం ఆ మేరకు పెరుగుతోంది. గత ముఫ్పైఏళ్లుగా ఎంతమంది ట్రైనర్లు, యోగ గురువులు, వ్యాయామ ఏజెంట్లు కృషి చేసినా శరీర బరువు సమస్య ఎంతమాత్రం తగ్గలేదంటే కారణం అర్థమయ్యే ఉంటుంది.
  బరువు తగ్గించుకునే క్రమంలో ఉదయం గంట సాయంత్రం గంట బ్రిస్క్‌వాక్‌ చేసి, మూడు నెలల్లో ఐదు కేజీల బరువు తగ్గిన వారు, ఆ తరువాత తిండి యావ పెరిగిపోయి అతిగా ఆహారం తీసుకుంటే నెలలోపలే ఐదు కేజీల బరువు పెరిగిపోతున్నారు. దీనికన్నా ఇంట్లో చేయాల్సిన పనులు బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడవం మార్కెట్‌కు వెళ్ళి రావడం, ఫ్యాట్‌ ఫుడ్‌ తగ్గించడం లాంటి సాధారణ పనులు, ఆహారం వల్ల కేలరీలు సమపాళ్ళలో శరీరానికి అందుతాయని నిపుణులు భావిస్తున్నారు. అతి ఏ విషయంలోనైనా అనర్థమే అనడంలో ఇదీ ఒక ఉదాహరణగా నిలుస్తుంది

 9. అదనపు బరువు వదిలించుకోండి… ఆరోగ్యంగా ఉండండి… వారం రోజుల్లో 4 కేజీల బరువు తగ్గండి…వారం రోజులలో 4 నుండి 5 కేజీల బరువు తగ్గటం సాధ్యమేనా? అవును సాధ్యమే.

  ఇదేదో ఒబేసిటి సెంటర్ల వ్యాపారప్రకటనో, టీవీల్లో చూపే టెలిబ్రాండ్‌ ప్రకటనో కాదు. ఎక్కడికి వెళ్ళకుండా, ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే శాస్త్రీయ పద్ధతుల్లో బరువు తగ్గే పద్ధతి. దీనికి కావల్సిందల్లా అదనపు బరువు తగ్గాలన్న బలమైన కోరికా, అమలుపరిచే దృఢ సంకల్పం. ఆ తరువాత బరువు పెరగకూడదన్న తలంపు మీకుంటే చాలు. ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని జాన్‌హప్‌కిన్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ రూపొందించింది. ప్రయోగాత్మకంగా రుజువైంది. ఇది అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డిఎ) ఆమోదం పొందింది.

  వారంరోజుల పాటు మీరు తీసుకునే ఆహారం శరీరానికి ఏమాత్రం అదనపు కాలరీలను ఇవ్వకుండా మీ వంట్లో ఉన్న అదనపు నిల్వలను ( కొవ్వు, ప్రొటీన్లను) కరిగించడానికి ఉద్దేశించిన డైట్‌ చార్టు ఇది. మరైతే ఆలస్యం దేనికి ? వెంటనే ప్రారంభించండి.

  మొదటిరోజు

  అరటిపండు తప్ప అన్నిరకాల తాజా పళ్ళు ఈ రోజు మీ ఆహారం. మీకు నచ్చిన అన్నిరకాల పండ్లను తినొచ్చు. అరటి పండు మాత్రం లేదు. ప్రత్యేకించి పుచ్చకాయలు, కిరిణికాయలు (కడప దోసకాయలు) ఎక్కువ తింటే మంచిది. పరిమితి ఏమీ లేదు. మీ అవసరం మేరకు తినొచ్చు. పళ్ళను ఆహారంగా తీసుకోవటం వల్ల రాబోయే ఆరు రోజులకు మీ శరీరాన్ని, జీర్ణవ్యవస్థను సిద్ధం చేస్తున్నారన్నమాట.

  రెండవరోజు

  ఈ రోజు మీ ఆహారం అన్నిరకాల కూరగాయలు. కేవలం కూరగాయల్ని మాత్రమే తినాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక పెద్ద బంగాళదుంపను ఉడికించి తినటం ద్వారా ఈ రోజును ప్రారంభించండి. తరువాత బంగాళాదుంప తినొద్దు. మిగతా కూరగాయలు పచ్చివి కాని, ఉడికించినవి కాని తినొచ్చు. ఉప్పు, కారం మీ ఇష్టం. నూనె మాత్రం వాడొద్దు. ఈ రోజు కూడా పరిమితి అంటూ ఏమీ లేదు. మీ అవసరం మేరకు తినొచ్చు.

  మూడవరోజు

  మీరు పళ్ళు, కూరగాయలు కలిపి తినాలి. పళ్లలో అరటిపండు, కూరగాయల్లో బంగాళాదుంప తప్ప మిగిలిన పళ్ళు, కూరగాయలు కలిపి తీసుకోండి. ఈ రోజు కూడా పరిమితి ఏమీ లేదు. అవసరం మేరకు తినొచ్చు. ఈ రోజు నుండి మీ శరీరంలో అదనపు కొవ్వు విలువలు కరగటం ప్రారంభిస్తాయి.

  నాల్గవ రోజు

  నాలుగో రోజు మీ తిండి 8 అరటిపళ్లు, మూడు గ్లాసుల పాలు (ఒక గ్లాసు 200 మి.లీ.) నాల్గవరోజు దాదాపు ఆకలి ఉండదు. రోజంతా హాయిగా గడచిపోవడం గమనిస్తారు. 8 అరటిపళ్ళు తినాల్సిన అవసరం రాకపోవచ్చు. తగ్గించగలిగితే తగ్గించండి. పాలల్లో చక్కెర ఎక్కువ ఉండకూడదు. ఇంకా అవసరం అనిపిస్తే 100 మి.లీ. వెజిటబుల్‌ సూప్‌ తాగవచ్చు. (తాజా కూరగాయలతో మీ అభిరుచికి తగ్గట్లు మీ ఇంట్లో తయారుచేసింది మాత్రమే తాగండి).

  ఐదవ రోజు

  ఒక కప్పు అన్నం, 6 టమోటాలు. మీకిది విందు రోజు. మధ్యాహ్నం ఒక కప్పు అన్నం, దానిలోకి కూరగాయలు లేదా ఆకుకూరతో నూనె లేకుండా వండిన కూరతో తినండి. ఉదయం టిఫిన్‌గా రెండు టమోటాలు తీసుకోండి. మిగిలినవి అవసరం అయినప్పుడు తినండి. కప్పు అన్నం తినొచ్చు కదా ఏమవుతుందని ఇంకాస్త లాగించే పని చేయవద్దు. వీలయితే కప్పు కన్నా కాస్త తక్కువే తినండి.

  ఆరవరోజు

  ఈ రోజు ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం. రెండవరోజు తిన్నట్లు పచ్చివి లేదా వండిన కూరగాయలు (ఉర్లగడ్డ మినహా) తీసుకోండి. అన్నంలోకి కూర 5వ రోజు చెప్పినట్లే. కూరగాయలకు లిమిట్‌ లేదు. అయినప్పటికి ఆకలి లేకపోవడం వల్ల రెండవ రోజు తిన్నంత అవసరం లేదు.

  ఏడవరోజు

  చివరి రోజు ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం. ఆరవరోజులాగే తింటూ, అదనంగా కూరగాయలను కాస్త తగ్గించి, పళ్ళరసం (చక్కెర లేకుండా) తీసుకోండి. మధ్యాహ్నం యథావిధిగా ఒక కప్పు లేదా అంతకంటే తక్కువ అన్నం తినండి. ఇక రేపటి కోసం ఎదురుచూడండి.

  అదనపు బరువులెక్క

  ముందుగా మీరు ఉండాల్సిన దానికన్నా అదనంగా ఎంత బరువు ఉన్నారో చూడండి. అదనపు బరువును లెక్కించటానికి ఒక చిన్న లెక్క. ముందుగా మీ బరువును కేజీలలో, మీ ఎత్తును సెంటీమీటర్లలో కొలుచుకోండి. సెంటీమీటర్లలో మీ ఎత్తు నుండి 100 తీసెయ్యండి. వచ్చిన విలువను 0.9తో హెచ్చించండి. అది మీరుండాల్సిన బరువు. మీరు ఉన్న బరువులో నుండి ఉండాల్సిన బరువు తీసివేస్తే మీరు ఎంత అదనంగా ఉన్నారో తెలుస్తుంది. ఇక వారంరోజుల డైట్‌ చార్టులోకి వెళ్లి మీరు ఏమేం తినాలో, ఎలా తినాలో చూద్దాం. ప్రతిరోజు ఆహార నియమాలతో పాటు చివర ఇచ్చిన సాధారణ నియమాలను ఖచ్చితంగా పాటించాలి.

  వారం తరువాత

  మీలో మార్పును మీరే కాకుండా పక్కవాళ్ళు సైతం గుర్తించేలా ఉంటుంది. మీ బరువు ఎంత వున్నారో చూసుకోండి. ఈ పద్ధతి కచ్చితంగా పాటిస్తే, శరీరం అవసరం మేరకు తింటే, 4 నుండి 5 కేజీల బరువు తగ్గుతారు. మినహాయింపులూ, ఉల్లంఘనలు ఉంటే దానికి తగ్గట్టే తగ్గుతారు. ఇంకా మీరు బరువు తగ్గాలంటే కనీసం రెండు వారాల విరామం తర్వాత లేదా మళ్లీ మీ ఇష్టం వచ్చినప్పుడు ఇదే వారం చార్టుని తిరిగి ప్రారంభించండి. ఈ విధంగా మధ్య మధ్యలో విరామంతో మీ బరువు తగ్గించదలచుకున్నంత వరకు ఈ చార్టుని ఫాలో కావచ్చు. వారం రోజుల పాటు ఈ పద్ధతిని పాటించడం వల్ల ఆ తరువాత కూడా మీకు పెద్దగా ఆకలి ఉండదు. అంటే ఆకలి స్థాయి తగ్గుతుంది. కాబట్టి ఇక నుండి మీ ఆహారపు అలవాట్లను పక్కాగా మార్చుకుని పరిమితంగా తింటూ వుంటే మీ బరువు అదుపులో ఉంటుంది. అప్పుడు ఈ చార్టు అవసరం ఉండదు. లేదంటే మళ్ళీ లావు పెరిగితే ఈ చార్టు ఎలాగూ ఉంది.

  గుర్తుంచుకునేవి

  బరువు పెరగడం అనేది మనిషి తినే ప్రవర్తనకు సంబంధించిన సమస్య. తిండి విషయంలో మీ ప్రవర్తన మార్చుకోకుండా బరువు తగ్గాలనుకోవడం జరగని పని. ఇందుకు మీరు ఒబెసిటి సెంటర్ల చుట్టూ తిరిగితే చేతి డబ్బులు వదలటం, ఆరోగ్యం పాడుకావడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఓబెసిటి సెంటర్లది ప్రచార ఆర్భాటం, మోసం తప్ప మరేమి కాదు. సలహాల కోసం మీ కుటుంబ డాక్టరును లేదా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించండి.

  సాధారణ నియమాలు

  ఈ వారం రోజులు మీరు 20 నిమిషాలపాటు ఒక మోస్తరు వ్యాయామం అంటే నడక, సైక్లింగ్‌, ఎరోబిక్స్‌, స్విమ్మింగ్‌లాంటి వాటిలో ఏదో ఒకటి చెయ్యాలి.

  రోజూ 10 గ్లాసులకు తక్కువ కాకుండా నీళ్ళు తాగాలి.

  డయాబిటిస్‌ ఉన్నవాళ్ళు డాక్టరు సలహా తీసుకున్న తర్వాతే దీన్ని పాటించాలి. లేదంటే ప్రమాదం.

  పైన చెప్పిన ఆహారం అవసరం మేరకు తినాలే తప్ప తినమన్నాం కదా అని అవసరం లేకపోయినా తింటే ఫలితం అనుకున్నంత రాదని గుర్తించండి.

  ఏడు రోజులు మీరు తినే ఆహారంతో పాటు ఈ క్రింద వాటితో చేసిన వెజిటబుల్‌ సూప్‌ పరిమితి లేకుండా ఎప్పుడైనా తాగవచ్చు.

  వెజిటబుల్‌ సూప్‌

  పెద్ద ఉల్లిపాయలు రెండు, క్యాప్సికప్‌ ఒకటి, టమోటాలు మూడు, 30 గ్రాముల క్యాబేజి, కాస్తంత కొత్తిమీర, 500 మిల్లీ లీటర్ల నీరు, ఉప్పు, మిరియాలపొడి మీ ఇష్టాన్ని బట్టి. వీటితో సూప్‌ చేసుకోవచ్చు.

 10. HEALTH TIPS – Collected By Ramamohan .Ch

  1.ప్రకృతిని మించిన గురువు – అనుభవాన్ని మించిన పాఠం లేవు
  2.వేకువ జామునే లేవడం
  3.పరగడుపున ఎక్కువ మంచినీరు మంచిది
  4.సుఖవిరొచనం పై మనస్సు మంచిది
  5.నడక ఆసన ప్రాణాయామాలు మంచిది
  6.చమటపడితేనే తినడం మంచిది
  7.ఉదయం చన్నీళ్ళు తలకు మంచిది
  8.సబ్బులు షాంపూలు మాను
  9.పూరీలు దోశలు మాను మొలకెత్తిన విత్తనాలు మంచిదను
  10.పచ్చికొబ్బరి సంపూర్ణాహారం
  11.తినేటప్పుడు అరగంటముందు లీటరు నీరు మంచిది
  12.రాత్రి మాని ఉదయం తినడం మంచిది
  13.ముడిబియ్యం మంచిది
  14.కూరలు తొక్కలు తీయడం మాను
  15.కూరలు ఉడకనివ్వడం మంచిది
  16.పచ్చికూరలు మంచిది
  17.భోజనం మనస్సు పెట్టితినడం మంచిది
  18.అన్నం తక్కువ కూరలు ఎక్కువ తినాలి
  19.ఆహారాన్ని పదేపదే నమలడం మంచిది
  20.నీరు భోజనం అరిగాక త్రాగడం మంచిది
  21.రాత్రి గాఢ నిద్ర మంచిది
  22.నాటు పళ్ళు తినడం మంచిది
  23.పళ్ళు రోగ నిరోధానికి మంచిది
  24.రసాలు త్రాగడం మాను తినడం మంచిది
  25.ఫాను ఎ సి లు మాను చెమటపడితె ఆరోగ్యానికి మంచిది
  26.విరేచనం 3 4 సార్లు అవడం మంచిది
  27.రెండుపూటల స్నానం మంచిది
  28.పొద్డు ఉండగానే భోజనం మంచిది
  29.ఎండ తగలడం రోగ నిరోధానికి మంచిది
  30.శ్రమకు తగిన తిండి మంచిదను
  31.అరిగాక పదుకోవడం మంచిది
  32.పళ్ళు కూరలకు గాలి వెలుతురు మంచిది
  33.రోజు 6 లీటర్ల నీరు మంచిది
  34.ఉప్పు మాను ఆహారం లో ఉన్న ఉప్పే ఆరోగ్యానికి మంచిది
  35.తేనె మంచిది
  36.చింతపండు మాను పచ్ఛి చింతకాయ మంచిది
  37.పచ్ఛి మిర్చి మంచిది
  38.నూనె నేయి మాను
  39.మషాళాలు మాను
  40.సాత్విక భోజనం మంచిది
  41.మనిషి అడుపులో రుచి మంచిది
  42.ఉపవాసం మంచిది
  43.అసంతృప్తి మాని తృప్తి ఆరోగ్యనికి మంచిది
  44.కోపం ఈర్ష్య చిరాకూలు మాని శాంతం ఆరోగ్యానికి మంచిదను
  45.మనపని మనమే చేసుకోవడం మంచిది
  46.ప్రకృతి విధానాన్ని జీవన విధానం అనడం మంచిది

  1. బరువు పెరగాలి అంటే, మన ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి. మనస్సును వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోండి. పండ్లు,కూరగాయలు, ఆకు కూరలు, నెయ్యి, వెన్న లాంటివి సమతూకంగా తీసుకోండి. బయట ఆహారం ఎంత తగ్గిస్తే అంత మంచిది. జొన్నలు, సద్దలు, రాగులు లాంటి వాటితో రొట్టెలు, అలసందలు, బఠాణీలు లాంటి గింజలతో కూరలు చేసుకొని తినండి. చక్కెర, ఉప్పు, మైదా పిండి లాంటివి మితంగా వాడండి. ఇంకా అనుమానాలుంటే, ఎవరైనా dietitianను కలసి సలహాలు పొందండి. ఈ బ్లాగు పోస్టులో, బరువు పెరగటం ఎలా అని తమ అనుభవాలను పంచుకొన్నారు, టపాను మరియి వ్యాఖ్యలను ఒక సారి చదవండి. http://gsashok.wordpress.com/2007/09/19/tips_for_increasing_weight/

 11. 1. check your dairy calories required for Basal Metabolic Rate (BMR)..it is calculated based on height, current weight and gender. (Check in google for BMR calculator).

  2. Based on BMR, you will get an idea of amount of calories you have to eat for your body to function smoothly (without malnutrition or any other side effects) during weight loss period.

  3. Always, make sure to check and keep tab on what and how much you are eating (interms of calories day by day).

  4. Try to exercise a lot, 5 days per week. (usually a calorie burn of ~600-700 calories/day is considered a good fitness regime). Eg., 50 min. of sun salutations, Jogging for 5 km every day etc.

  5. Have a ‘cheat day’ i.e., on saturdays, sundays eat what you enjoy most (eg., nonveg pulao/curries etc., sweets)

  Inputs from a person who lost ~20kg in 7 months. (97kg to 77kg)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s