అనసూయ నాకు ఎందుకు నచ్చిందంటే…..

నాకు నచ్చిన దర్శకుల్లో రవిబాబు ఒక్కడు. ఆయన శైలిలో హాలీవుడ్డు ప్రభావం ఉన్నా తెలుగు నేటివిటీకి (తెలుగు పదం?) తగినట్టు మార్పులు చేసుకోవడం, బుర్ర ఉపయోగించి సినిమా తీయటం కారణాలు కావచ్చు. దర్శకత్వం వహించక ముందు సినిమాల్లో క్యామెడీ తిక్క విలన్‌గా కనిపించే వాడు. బాబు లాగానే రవిబాబు హీరోయిన్లను చెరబడుతూ…హీరో చేత తన్నులు తినే పాత్రలు వేసే వాడు. ఓక రోజు హఠాత్తుగా నరేష్ అనే కొత్త తింగరి నట్టుణ్ణి కథానాయకుడిగా పెట్టుకొని ‘అల్లరి’ సినిమా తీసేశాడు. వీడేంటి దర్శకత్వం వహించడమేంది అనుకున్నారు జనాలంతా. తర్వాత ‘అల్లరి’ వాసనలతోనే ‘అమ్మాయిలు-అబ్బాయిలు’ సినిమా తీశాడు. ఈ సినిమా నాటుగా నాటీగా ఉండటంతో ఫ్యామిలీసు థియేటర్లకు రాక సరిగ్గా ఆడలేదు. తరువాత వచ్చిన ‘పార్టీ’ సినిమా నేను చూడలేదు. ఆ మధ్యలో సురేష్ ప్రొడక్షన్స్‌కు సోగ్గాడు అనే సినిమా కూడా తీసిపెట్టాడు. ఈ సినిమా ఫ్లాపవడం రవిబాబు దురదృష్టం. తనకంటూ ఒక స్టైలు శైలి లేని తరుణ్…లావైన ఆర్తితో తీసిన ఈ ప్రేమ సినిమాను యువత ఆదరించలేదు. కథనంలో పట్టున్నా సరైన తారాగణం లేక జనాలను ఆకర్షించలేదనుకుంటా. అల్లరి తరువాత సరైన హిట్లు లేకపోయినా మంచి సాంకేతిక నిపుణుడని మాత్రం పేరు తెచ్చుకున్నాడు. మూఖ్యంగా పాటల చిత్రీకరణలో మంచి వైవిధ్యం ప్రదర్శించాడు.

ఇంత ఉపోద్గాతం ఎందుకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే, ఈ వారాంతం రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అనసూయ, నా స్నేహితుడి స్నేహితులు నిర్మించిన [[మంత్ర]] సినిమాలు చూశాను. నెల ముందే [[కబుర్లలో]] చెప్పా తెలుగులో మంచి థ్రిల్లర్లు వచ్చి చాలా కాలం అయ్యింది అని. అలా అన్న వారానికే ఈ రెండు థ్రిల్లర్లు విడుదలయ్యాయి. అందుకే మా ఊరికి వెళ్ళిన వెంటనే ఈ సినిమాలు చూసేశా.
థ్రిల్లర్లు..సస్పెన్సు..సినిమాలకు సమీక్ష ఏమని రాస్తాం చెప్పండి.

మంత్ర గురించి ఎంత తక్కువ రాస్తే అంత సమయం ఆదా ఐనట్టు భావిస్తున్నాను. ఊరు చివర బంగళా, బంగళాలో ఉన్న వారు కొన్ని విచిత్ర పరిస్థితుల్లో మరణం, ఇది దెయ్యం పనే అన్న జనం, చివరకు హఠాత్తుగా ఒక శల్తీని చూపి…ఓర్నీ ఇంతేనా అని నిట్టూర్చిన మనం. ఇది పాత చింతకాయ పచ్చడి దెయ్యం కథలకు, ఢం ఢం ఢం ఢం ..డ్డు డ్డు డ్డు డ్డు ..హా…కెవ్…..స్సుర్..వ్వో..ఢమేల్..దఢక్ లాంటి చప్పుళ్ళు, ఛార్మీ పాపు సాంగు (ఇది జనాలకు గాలం అనుకుంటా) జోడించి వదలటం తప్పితే మరేమీ కాదు. సుత్తి కొట్టకపోయినా…ఏదో కొత్తదనం ఆశించి వెళ్ళిన వారికి కొంత నిరాశ తప్పదు.

ఇక అనసూయ. చాలా సైట్లలో 3/5 ఇచ్చారు. ఈ సినిమాకు ఇంతకంటే ఎక్కువ మార్కులు పడతాయి. నాకైతే జీవి జీవి ఎందుకింత తక్కువ రేటింగిచ్చావు అని అడగాలనుంది.
1) బాస్/డాన్/స్టాలిన్ లాంటి పరమ చెత్త సినిమాలకు కూడా మొదటి రెండు వారాల్లో 20కోట్లు ఊడ్చి పెట్టే అభిమానులున్న హీరో లేడనా?
2) చిన్న సినిమాకు పెద్ద రేటింగు ఇస్తే….సినిమా ప్రపంచం నివ్వెరపోతుందనా?
3) బాస్/స్టాలిన్ లాంటి చండాలమైన సినిమాలకు 3.25/3.5 ఇస్తే, మిగతా సినిమాలకు విభిన్నంగా మంచి ధ్రిల్లర్ అనిపించుకున్న ‘అనుసూయ’కు ఎంత రావాలి?
ఈ సారికి ఈ ప్రశ్నలు చాల్లే….

రవిబాబు నిన్ను ఈ విషయాల్లో శభాష్ అనకుండా ఉండలేకపోతున్నాను ….
1) అందర్లాగా హీరోయిన్నంటే అంగాంగ ప్రదర్శన చేస్తూ…మగాడంటే వీడే (హీరో)…వీడిని లైన్లో పెట్టడమే నా జీవితాశయం అని కాకుండా..హీరోయిన్నంటే కథకు నాయిక అని…అమెకు మనసుతో పాటు వ్యక్తిత్వం ఉంటుందని చూపినందుకు.
2) కుర్ర్ర ‘ప్రేమ’ కథలతో విసిగిపోయిన మాకు ఒక మంచి ధ్రిల్లరు అందించినందుకు
3) సీరియల్ కిల్లర్ అంటే వాడి ముఖం క్లైమాక్సు ముందు మాత్రమే చూపించాలి అని పాత పద్దతి అవలంభించనందుకు మరియి సస్పెన్సును విశ్రాంతికి ముందే విరగొట్టే ధైర్యం చేసినందుకు.
4) తులసి సినిమా కోసం వేసిన భారి సెట్లను తెలివిగా ఈ లో బడ్జెట్ ధ్రిల్లర్ సినిమా కోసం కొద్దిపాటి మార్పులు చేసి వాడుకున్నందుకు. (Reuse/Recycling జిందాబాద్)
5) హీరో అంటే పిడికిలితో కొడితే పది మంది ఒకే సారి గాల్లో లేచి పది అడుగుల దూరంలో ఎగిరి పడాలి అని చూపనందుకు
6) వీలైనప్పుడల్లా కొద్దిగా సహజమైన హాస్యం జోడించినందుకు
7) దర్శకత్వమే కాక నటనలో కూడా శెహభాష్ అనిపించుకున్నందుకు
8) ముఖ్యంగా హత్యలను మరీ వివరంగా చూపక..అది చూసే వాళ్ల ఊహకే వదిలేసినందుకు

ఇప్పుడు ఆడుతున్న సినిమాల్లో ఖచ్చితంగా చూడదగ్గ సినిమా. తొందర్లో ‘మా అత్త దెయ్యం’ అనే ఇంకో వెరైటీ కామెడీ సినిమా తీయబోతున్న రవిబాబు ఇలాగే చిన్న సినిమాల్లో మంచి సినిమాలు తీయాలని ఆశిస్తున్నా.

ప్రకటనలు

20 thoughts on “అనసూయ నాకు ఎందుకు నచ్చిందంటే…..

 1. జీవి మంచి రేటింగ్ ఇవ్వాలంటే పెద్ద స్టారు వుండాల్సిందే!మొన్న వాలెంటైన్ అనే సినిమా రివ్యూ (తెలుగులో) రాస్తూ “మొత్తానైకి దర్శకుడు సినిమా బాగా తీశాడు. కానీ ప్రేక్షకులను సినిమా థియేటర్కు రప్పించే అంశాలు ఇందులో ఏమీ లేవు” అన్నారు. సినిమా బావుండడం కాక ప్రేక్షకులు థియేటర్ కి రావడానికి వేరే అంశాలేం కావాలో విమర్శకులే కాదు ప్రేక్షకులు ఆలోచించాలి.
  వెంకట్
  http://www.navatarangam.com

 2. సినిమా బాగుందన్న టాక్ నిజమే. కానీ మంత్ర కూడా బానే ఉందని విన్నాను. ఇకపోతే, జీవి రివ్యూలన్నీ జీవం లేనివే. పెద్ద హీరోలవన్నీ 3/3+ ఇస్తూ పోతాడు. basically, i don’t give a shit to his reviews anymore.

  @కొత్తపాళీ గారూ, ఈ రవిబాబు గిరిబాబు చిన్న కొడుకని విన్నాను. పెద్దకొడుకు రఘుబాబు అని కామెడీ విలన్ రోల్స్ చేస్తుంటాడు.

 3. venkat గారు simple గా చెప్పారు జీవి రివ్యూస్ గురించి ;-) కానీ bhajans గారు English లో చెప్పిన comment నాది కూడా :-) … His reviews have no credibility now and used to be good but these days it’s a std rating like mentioned in this post …

  @కొత్తపాళీ గారూ / bhajans గారూ : Ravibabu is son of Chalapathi Rao (Villain once but these days Nanna/Mamayya/Babai type)

 4. తప్పు జీవి లోనే కాదు. మనలోనూ(నే) వుంది. తారే జమీన్ పర్ సినిమాని జనాలు ఆహా ఓహో అని పొగిడేస్తున్నారు. ఇదే సినిమా ఇంతకంటే గొప్పగా అమీర్ ఖాన్ లేకుండా చూస్తే ఎంతమంది చూస్తారు?
  మంచి సినిమాకి స్వాగతం పలుకుదాం. హీరోలు, హిరో వర్షిప్ పక్కన పెడదాం. నవీన్ గారూ, ఇంకా బాగా సినిమాలు చూసి మమ్చి సమీక్షలు వ్రాయండి.

 5. వెంకట్ గారు,

  మీరన్నది కరక్టే గానీ, నాయికానాయకులని పక్కన బెట్టి చూడటమంటే, అది విమర్శకుడిగానో లేదా కళారాధకుడిగా కళాత్మకతని చూడమని చెప్పటమే కదా. ఓ సగటు ప్రేక్షకుడికి (వినోదం కోసం చూసేవాడికి), అంతటి హృదయం/పరిణతి అవసరమా?

  మీరు తారే జమీన్ పర్ అంటే గుర్తుకొచ్చింది, బాద్షాఖాన్ హీరోగాఉన్నా, స్వదేస్ దెబ్బతింది. కచ్చితంగా నాకు మీ అంత సినిమా విషయ పరిజ్ఞానం లేదు, మీరే ఈ ప్రశ్నకు సరిగా సమాధానము చెప్పగలరనుకుంటాను.

  తెలుగువాడిని గారూ, సవరణకు కృతజ్ఞతలు.

 6. అనసూయ నేను చూడలేదు కాని స్వదేశ్ సినిమా చూసాను. నాకు చాలా నచ్చింది. దానిని ఇప్పటికి ఇరవై సార్లు చూసుంటాను. భారతీయ గ్రామ వాతావరణంతో ఆ విధంగా తీయబడిన సినిమా హిందీలో దాదాపు లేదు. కొంతవరకూ డోర్ సినిమాలో ఉన్నా అదొకరకం. హీరోకు ఏమాత్రం ఎక్కువ ప్రిపరెన్స్ ఇవ్వకుండా తియ్యబడిన స్వదేశ్, హిందీ సినిమా డివిడి ల సేల్స్ లో ఇప్పటికీ టాప్ లోనే ఉంది.

 7. ‘చెత్త ‘ సినిమాలతో క్లాస్ సినిమాలను పోల్చడం ఎందుకు?
  అనసూయను క్వాలిటీ సినిమాగా పరిగణిస్తే 3 కన్నా తక్కువ రేటింగ్ ఇవ్వాలి. నికిత ఎపిసోడ్ సినిమాను నిలబెట్టింది. అది తప్ప మిగతా సినిమా అనవసరంగా డ్రాగ్ చేసారు.

  1. ఈ సినిమాలో సెంటిమెంట్ అవసరమా? మళ్ళీ పాటొకటి.
  2. క్లైమ్యాక్స్ మరీ అంత సేపా?
  3. రవిబాబు నడక(Handicapped) Usual Suspects నుంచి కొట్టేసారుగా.

  సెవెన్, జోడియాక్ సినిమాలతో దీన్ని పోల్చి చూడండి.

 8. వికటకవి గారూ,
  వినోదం చిరంజీవి, బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్లు వున్న సినిమాల్లోనే వుంటుందని ఎక్కడా లేదు. కానీ మనం పెద్ద స్టార్ లేకుంటే సినిమాలు చూడం కాబట్టి ప్రత్యామ్నయ సినిమాలకు అవకాశం లేకుండా పోతుంది. ప్రత్యామ్నయ సినిమా అనగానే అవార్డు సినిమా, ఆర్టు సినిమా అని కేటగరైజ్ చేసే ఆలోచన మనం వదలాలి.

  మన దగ్గర ప్రత్యామ్నయం అనే పదానికే ఛాన్సు వున్నట్టులేదు. కానీ మలయాళం, కన్నడ, తమిళ్, మరాఠి , ముఖ్యంగా హిందీ సినిమా రంగంలో కొత్త ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. మన దగ్గర ఎప్పుడో ఇలా అనసూయ లాంటి మంత్రాలకు అప్పుడప్పుడూ చింతకాయలు రాలితే అదేబాటలో మన వాళ్ళు మరో హారర్ స్టోరీ తోనో, మర్డర్ మిస్టరీతోనో బయల్దేరతారు.

  వికటకవిగారూ,
  ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు, జంధ్యాల, విశ్వనాధ్, బాపు, వంశీ, సింగీతం,లాంటి వారు స్టార్ల అవసరం లేకుండానే మంచి సినిమాలు తీసారు. వాటిని మనం ఆదరించాం. ఇప్పుడు అలాంటి పరిస్థితే రావాలి. లేకపోతే రాబొయే కాలానికి ముఖ్యమంత్రులు, వాళ్ళ తొత్తులు, వారిని శత్రువులు, మిగిలిన మంత్రులు, అడపా దడపా ఎంపి లు, అందరూ మనకి ఫిల్మ్ స్టార్లే గతి.

 9. వ్యాఖ్యలు వ్రాసి తమ అభిప్రాయాలను తెలిపినందుకు అందరికీ కృతఙ్ఞతలు.
  @వెంకట్
  ఇక నుంచి తప్పకుండా నేను చూసిన మంచి సినిమా గురించి సమీక్షలు, చెత్త సినిమాల గురించి హెచ్చరికలు చేస్తూంటాను ;) (పనిలో పని….’ఆపద మొక్కుల వాడు’ సినిమా థియేటర్ల ముంది ఐదవ స్థాయి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వెళ్ళిన వారికి ఆ ఆపద మొక్కుల వాడే దిక్కని కూడా పత్రికలు ఘోషిస్తున్నాయి. నిజానిజాలు ఆ ఆపద మొక్కుల వాడికే తెలియాలి)

  @రాఘవ
  మీ ప్రోత్సాహకర వ్యాఖ్య చదివి చాలా సంతోషం వేసింది

  @కొత్తపాళీ
  మీ వ్యాఖ్య నాకు ముందు ముందు మరింత పసందైన సమీక్షలు వ్రాయటానికి డాబర్ చవన్‌ప్రాష్ టానిక్కులా పని చేస్తుంది .రవిబాబు పాత తరం విలన్ కొత్త తరం సహాయ నటుడు ఐన చలపతి రావు కొడుకు (సినిమాల్లో వంద రేపులు చేసి రికార్డు సృష్టించిన చలపతిరావు అంటే బాగా తెలుస్తుందేమో. ఇంటర్వ్యూల్లో ‘కొండవీటి సింహం’ సినిమాలో శ్రీదేవి మీద జరిపిన బలత్కారమే అత్యుత్తమమైనదని కూడా సెలవిచ్చాడీ పెద్ద మనిషి.)

  @Sat
  పుర్రెకో బుద్ది జిహ్వకో టేస్టు అన్నారు ఎవరో. ఒక్కోరికొక్కో రకం సినిమా నచ్చుతుంది. ఈ సినిమాకు 0/5 ఇస్తానన్నా అది మీ హక్కు. కాదనేదానికి నేనెవరిని? ఏమైనా నా బ్లాగు ద్వారా ఈ సినిమా మీద మీ అభిప్రాయాన్ని పంచుకున్నందు సంతోషం.

  కావాలనే సమీక్షలో సినిమా కథ గురించి వ్రాయలేదు.ధ్రిల్లర్లలో ఫలానా సీన్లు బాగున్నాయి ..ఫలానివి బాగోలేదు అని చెప్పి ఆయా సన్నివేశాల మీద preconception తెప్పించదలుచుకోలేదు. క్లయిమాక్సు సాఆఆఆఆగదీశాడని ప్రతి ఒక్క సైటు చెప్పింది. కానీ నాకలా అనిపించలేదు. అప్పటికే ఐదారు భయంకర హత్యలు చేసిన నరరూప రాక్షసుడి చెర నుండి తప్పించుకోవాలంటే ఆ మాత్రం డ్రామా అవసరమని నా ఉద్దేశ్యం. మిగిలిన హీరోయిన్ను ఓరియంటెడు సినిమాల్లో లాగా కథానాయిక తన కరచరణాలను కత్తుల్లా ఉపయోగించి ఆరడుగుల ఆజానుబాహుల్ని కూడా మట్టికరిపించనట్లు చూపక భూమిక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాపను క్షేమంగా భూగృహం నుండి బయటకు తెచ్చినట్లు చూపాడు. దీనిలో నాకేమీ లోపాలు కనిపించలేదు.

  ఈ సినిమాలో సెంటిమెంటు ఎందుకు ఉండకూడదు?

  సినిమా విడుదల ముందు నుంచి కూడా ఇది “సైలెంన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్” కాపీనో అని మారు మోగిపోయింది. ఐతే దర్శకుడు తెలుగు నేటీవిటీకి తగిన మార్పులు చెయ్యడంలో చాలా వరకు విజయం సాధించాడని ఘంటాపదంగా చెప్పగలను. Usual Suspectsలోని సన్నివేశం ఒరిజినల్ అని ఏమిటి నమ్మకం? అది ఏ జపానో ఇటలీ సినిమా కాదని ఏమిటి నమ్మకం? ఐనా అలా కంపేర్ చేస్తూ సినిమా చూస్తే దాన్ని ఆస్వాదించలేమండి.
  ఈ సినిమా క్వాలిటీ బాగోలేదు అన్నారు…ఎక్కడ ఏది నచ్చలేదో కొంచెం విడమరిచి చెబుదురూ. నేనింకా ఈ సినిమా టెక్నికల్‌గా చాలా బాగుందని అనుకుంటూ ఉన్నాను.

 10. చాలా రోజుల తర్వాత స్టార్లు లేని ఒక సినిమా మీద మంచి చర్చ జరుగు తుంది.నేను ఇంకా ఈసినిమా చూడలేదు.చూడాలి అంటే అతిధి ,తులసి దర్శకుల గాయాల నుంచి నేను ఇంకా తేర్కోలేదు.థ్రిల్లర్,హర్రర్,కౌబాయ్ సినిమాలకు మామూలుగా మూలాలు వెతకక్కర్లేదు.సాధారణంగా జనం దృష్టిలో పడే లోపు అవి బాక్సాఫీసు డబ్బాల్లోకి చేరుకుంటాయి కాబట్టి.ఓ మోస్తరు విజయం సాధించిన అనసూయ మంత్ర సినిమాలకు కూడా ఆ మినహాయింపు ఇచ్చేద్దాం.గతంలో జేంస్ హాడ్లీ చేజ్ నవలలు ఎవరో తెలుగులోకి అనువదించారు,కానీ మనతెలుగు పాఠకులకు అందులోని ” మసాలా” అందించి చెడగొట్టకూడదన్న ఉద్దేశంతో అసలు నవలలో జీవం పోయింది.మనవాళ్ళు సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ లేక గ్లాడియేటర్ ఇలా ఏదైనా తెసుకోవచ్చు కానీ అందులోని ఫిన్నెస్ మనకు ఇప్పట్లో అందదు .పనిలో పనిగా ఎవరన్నా ఆపదమొక్కులవాడు గురించి రాయండి చాలామంది బతికిపోతారు .

 11. ఇంకో విషయం రాయటం మర్చాను,స్వదేశ్ సినిమాను చక్ దే ఇండియాను షారుక్ లేకుండా ఊహించుకోవటం ఆ సినిమాల్లో మన తెలుగు హీరోలను ఊహించుకోవటం ఎంత కష్టమో మనకు.నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను షారుక్ అలాంటి సీరియస్ సినిమాల్లో ఎలా ఒప్పుకున్నాడా అని?బహుశా అలాంటి డేరింగ్ స్టెప్స్ వల్లే కాబోలు చాలా మందిని అధిగమించ గలిగాడు

 12. gsnaveen@ క్వాలిటీ సినిమాల గురించి మాట్లాడుతూ వాటిని మాస్ సినిమాలతో పోల్చడమే నాకు నచ్చలా. అందుకే అనసూయలోని లోపాల గురించి రాశా. నాకు నచ్చనంత మాత్రాన వేరే వాళ్లకు నచ్చకూడదని అనుకోను.

  నేనకునే క్వాలిటీకి మీరనుకునే దానికీ తేడా ఉండొచ్చు.

  మాస్ సినిమాల్ని ఎందుకు పట్టించుకుంటున్నారు?

 13. I strongly disliked Swades too. Though I thought Shahrukh Khan was tolerable for the first time.

  Now coming to Jeevi’s reviews, I read them whenever I’m bored at work. manchi kalakshepam. If he hires an editor his problems will solved. Atanu telugu alochinchi English lo anuvadistaadu anukuntaanu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s