వామ్మో… ఆపదమొక్కులవాడు

అలా సూత్తారేంటి…….కలియుగదైవం, ఇష్టదైవం ఐన ఆ తిరుమలేశుని గురించి కాదండి..ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్ ధియేటర్లలోకి వ్యాపించిన ‘ఆపదమొక్కులవాడు’ అనే సినిమా చీడ గురించి నేను చెప్పేది. దీన్ని పోసాని అనే రచయిత డవిరెక్టు చేశాడులెండి..హీరో మన చిరు తమ్ముడు నాగబాబు హీరో. పాపం నాగబాబు ఖర్మేందో కానీ…..అంక చండాల, నీచ, నికృష్ట, దరిద్ర, బేవార్స సినిమాలకంతా హీరోగా కుదురుకుంటాడు. పదైదేళ్ళ ముందనుకుంటా ఈయన కథానాయకుడిగా నటించిన ‘దాదర్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమా చూసి జ్వరమొచ్చింది. ఓ సినిమా కూడా ఇంతలా విరక్తి కలిగించగలదా అని అనిపించిన సినిమా. అప్పుడు బెంగళూరులో ఏదో శుభకార్యానికి హాజరు కావటానికి మా అత్తమ్మవాళ్ళింటికి వచ్చాము. పొద్దున్నంతా పెళ్ళి సందడి బోరుకొట్టడంతో సాయంకాలం రానని మొండికేశాను. సరే అని ఇంట్లో నన్ను ఒక్కణ్ణే ఉంచి మిగిలిన జనాలంతా ఫంక్షన్‌కు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఉండక ఈ ‘దాదర్ ఎక్స్‌ప్రెస్’ సినిమా క్యాసెట్టు వీసీయార్‌లో పడేసి చూస్తూండమని చెప్పి వెళ్ళారు. అంతే … వామ్మో ….అదేమి సినిమారా నాయనా. చూస్తూ చూస్తూ అల్లాగే సోఫాలోకి ఒరిగిపోయాను. అమ్మావాళ్ళు వచ్చేటప్పటికి జ్వరమొచ్చేసింది. నా జీవితంలో ఆ సినిమా ఓ పీడకల.

ఇక చరిత్ర అనుకున్న పీడకల రీటెలికాస్టెడ్ సీరియల్లా మళ్ళీ ‘ఆపదమొక్కులవాడు’ పేరుతో మన ముందుకు వచ్చేసినట్టుంది. ఈ సినిమా చూసిన కొందరు ఏమి చెబుతున్నారో చదవండి:
ఈ సినిమాకు వెళ్ళాలి అనుకుంటే అమృతాంజనం తీసుకు వెళ్ళండి. తట్టుకోలేని భయంకరమైన సుత్తి సినిమా. ఏదో దా’సిరి’ …చిరంజీవి అంటూంటే ఏదో చిరంజీవి గురించి చూపి ఉంటాడు కదా అని వచ్చాము. చూస్తే చిరంజీవి లేదు గాడిద ఎగ్గూ లేదు” అని పూడుకుపోయిన గద్గద స్వరంతో ఆవేదన వెలుబుచ్చిన ఓ అన్న

అమృతాంజన్ ఏమి సరిపోతాదండి…ఈ సినిమాని మరచిపోవాలంటే రెండు పెగ్గులు పడాల్సిందే లేకుంటే ఈ సుత్తిని మరచిపోవడం కష్టం” అని కన్నీళ్ళతో తన అభిప్రాయాన్ని పంచుకున్న ఓ తమ్ముడు

అసలు పోసాని సినిమాలకు దర్శకత్వం వహించకూడదు అని ఒక చట్టం చెయ్యాలండి” ఓ చెల్లెలి సలహా

పోసాని నాకు పదేళ్ళగా తెలుసు…మొదట్లో బాగానే ఉండేవాడు. ఇలా శాడిస్టుగా ఎలా తయారయ్యాడో తెలియటం లేదు” సినిమా చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఓ సినీ ప్రముఖుడు

సినిమా చూసి ‘నేనే ఆపదమొక్కులవాణ్ణి.. న్యాయం నేనే..ధర్మం నాదే’ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నా కొడుకు…నేనేం చేసేద్రా దోవుడో” ఓ కన్నతల్లి ఆవేదన

ప్రభుత్వం ఈ సినిమా చూసిన వాళ్లకు వంద ..చూసి ఆస్పత్రిలో చేరిన వాళ్ళకు వెయ్యి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి” అని ఆక్రోశించిన బాణం పార్టీ అభ్యర్థి

ప్రతి ధియేటర్‌లో ఉచితంగా వామిట్ బేసిన్‌లు అమరుస్తున్నాం…పరిస్థితి విషమించిన వాళ్ళకోసం ధియేటర్‌ నుంచి ఆపరేషన్ ధియేటర్‌కు తీసుకెళ్ళే అంబూలెన్స్‌లు సిద్దం చేసి ఉంచాం” అని ప్రకటించిన సహృదయా సేవా సంస్థ చైర్మన్

తల్లిదండ్రులు మా ప్రేమను ఒప్పుకోలేదు…..ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం చాలకపోతే..ఇలా సినిమా చూడటానికి వచ్చాం” ఓ ప్రేమ జంట వ్యాఖ్యానం (ఆత్మహత్య చట్టరీత్యా నేరం..ఘోరం)

ఈ అభిప్రాయాలు చదివి కూడా సినిమాకు సమీక్ష రాసే దమ్మున్న ‘ఒక్క మగాడు’ ఎవరైనా ఉన్నారా?

(సినిమా నిజంగానే ఇలా ఉందని టాక్. ఈ టపా ఒక్క ప్రాణాన్ని ఐనా కాపాడగలిగితే నేను వెచ్చించిన సమయానికి అర్థం ఉన్నట్టే . కొంపదీసి నాగబాబుకి కూడా అభిమాన సంఘాలు లేవు కదా. ఉంటే చెప్పండి ఈ టపా వెంటనే డెలీట్ చేసేస్తా.)

ప్రకటనలు

17 thoughts on “వామ్మో… ఆపదమొక్కులవాడు

 1. హి హి హి … ఇప్పుడే ఈనాడులో ఈ చిత్రరాజం విడుదల ఆలస్యమవటానికి గల కారణాల గురించిన వార్త చదివి ఇంకా విడుదల కాలేదేమో అనుకున్నా. ఇంత బ్రహ్మాండమైన విడుదల అని ఇప్పుడే తెలిసింది. ఇలాంటివి మా పూనాలో చచ్చినా రావు కాబట్టి ప్రస్తుతానికి నేను భద్రం.

 2. “అసలు పోసాని సినిమాలకు దర్శకత్వం వహించకూడదు అని ఒక చట్టం చెయ్యాలండి” ఓ చెల్లెలి సలహా

  హహహహ ఈ పోస్టు అన్ని దినపత్రికల్లో ప్రధాన శీర్షికగా ప్రచురించాలని,మనవి చేస్తూ ఇలాగే ముందుకు పోదామని నేన్‌ తెలియజేసుకుంటున్నా…….ను.

 3. నవీన్, నీ ఫేవరెట్ సినిమాకు సూపర్ ఎక్స్‌ప్రెస్ అని పేరు మార్చినట్టు గుర్తు. తెవికీలో ఆ సినిమా గురించిన సమాచారం అస్సలు లేదు. కాస్త సాయం చెయ్యరాదు..హి హి హి ;-)

 4. ఇంతగా ఈ సినిమా గురించి రాస్తుంటే నాకు, ఎంత చండాలంగా ఉందో ఒక సారి చూడాలని ఉంది :-)

  ఇదెలా ఉంటుందంటే, భక్తి లేని వాడు రాముడిని ఎప్పుడూ తిడుతూ ఉన్నాడట. తిడుతూ ఉన్నా కూడా, తిట్టులో దేవుడి పెరు ఉంది కాబట్టి కొంచం పుణ్యం వచ్చిందంట.

  అలా ఉంది నాకు ఈ సినిమా చూడాలని మనసుకొచ్చిన తీరు!

  ఆల్ హ్యపీస్

 5. ఇంతగా ఈ సినిమా గురించి రాస్తుంటే నాకు, ఎంత చండాలంగా ఉందో ఒక సారి చూడాలని ఉంది.

  ఇదెలా ఉంటుందంటే, భక్తి లేని వాడు రాముడిని ఎప్పుడూ తిడుతూ ఉన్నాడట. తిడుతూ ఉన్నా కూడా, తిట్టులో దేవుడి పెరు ఉంది కాబట్టి కొంచం పుణ్యం వచ్చిందంట.

  అలా ఉంది నాకు ఈ సినిమా చూడాలని మనసుకొచ్చిన తీరు!

 6. బాబూ,
  ఫలానా, పవన్ కల్యాణ్, జూ NTR, చిరంజీవి, బాలయ్య, నాగార్జునలు ఇంతకంటే ఘోరమైన సినిమాల్లో నటీంచారు. ఇలాగే అ సినిమాలను కూడా ప్రస్తావించండి మీ బ్లాగుల్లో!

 7. మాకు నచ్చిన 25 మంది నటులలో మొదటి 10 స్థానాలూ కాబోయే ముఖ్యమంత్రీ (ఆయన ప్రధాన మంత్రి కావాలని మా ఆకాంక్ష)అయిన మా “మెగాస్టార్” చిరంజీవివే..ఇక మిగిలిన స్థానాలు అంటావా…

  1 నుంచి 10 వరకూ … చిరంజీవి
  11. పవర్ స్టార్ .. పవన్ కల్యాణ్
  12. మెగా పవర్ స్టార్ .. చిరుత(నయుడు)… రామ్ చరణ్
  13. ఆపదమొక్కులవాడు…నాగబాబు..
  14. అల్లు అర్జున్
  15. అల్లు రామలింగయ్య..
  16. అల్లు అరవింద్
  17. శ్రీజ (ఇంటి పేరు తెలియదు) & వారి పతి దేవులు…
  18. అశ్వనీదత్త్..

  అందువలన మా అభిమాన వంశాలతో పెట్టుకోకు…బాక్సులు బద్దలయిపోతాయి…

  just for fun…

  అనిల్ చీమలమఱ్ఱి

 8. ఇంతగా ఈ సినిమా గురించి రాస్తుంటే నాకు, ఎంత చండాలంగా ఉందో ఒక సారి చూడాలని ఉంది.

  ఇదెలా ఉంటుందంటే, భక్తి లేని వాడు రాముడిని ఎప్పుడూ తిడుతూ ఉన్నాడట. తిడుతూ ఉన్నా కూడా, తిట్టులో దేవుడి పెరు ఉంది కాబట్టి కొంచం పుణ్యం వచ్చిందంట.

  అలా ఉంది నాకు ఈ సినిమా చూడాలని మనసుకొచ్చిన తీరు!

 9. @అగంతకుడు
  ఇటీవలే విడుదలైన ఈ సినిమా బారి నుండి తోటి బ్లాగర్లను కాపాడాలనే తపన తప్పితే, పని కట్టుకొని విమర్శలు గుప్పించడం కాదు. అసలు ఈ సినిమా గురించి విమర్శలు మొదలు పెడితే పది పేజీల టపా అవుతుంది. కానీ అది నా ఉద్దేశ్యం కాదు. సందర్భం వచ్చింది కాబట్టి దాదర్ ఎక్స్‌ప్రెస్ గురించి ప్రస్తావించాను. ఎలాగు విషయం రాస్తున్నా కాబట్టి కొంచెం సరదాగా వ్రాశాను. అదే పనిగా చండాలమైన సినిమాలు గుర్తు తెచ్చుకుని బ్లాగటమంటే శుభ్రంగా స్నానం చేసొచ్చి మురుగు కాలవలో మునిగినట్టు ఉంటుంది. దానికన్నా తెవికీలో వ్యాసాలు వ్రాసుకుంటే వెచ్చించిన సమయానికి అర్థం మనకు పుణ్యం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s