యూట్యూబ్లో దుమ్ము రేపుతున్న చిరంజీవి వీడియోలు :)

ఓ వీడియోని 9,113,536 సార్లు చూశారు. 18291 వ్యాఖ్యానాలు వ్రాశారు. 18291 సార్లు రేటింగు ఇస్తే, సుమారుగా 4/5 రేటింగు వచ్చింది ఈ వీడియోకి. ఈ నంబర్లు మన చిరు డ్యాన్సాడిన ఓ పాట వీడియోదంటే నమ్మగలరా? చిన్నప్పుడు దొంగ సినిమాను చౌడేపల్లెలో చూశా. అప్పుడు చిరంజీవి చేసిన పోరాటాలు, నృత్యాలు విపరీతంగా నచ్చేశాయి. అందులో ‘గోలీమార్…మార్..మార్’ అనే పాట ఒకటుంది. అప్పుడది బాగా అనిపించినా, పెద్దయ్యేసరికి అది మైఖేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ కాపీ అని తెలిసింది. ఈ రోజు చిరంజీవి వీడియోల కోసం వెతుకుతూంటే, ‘Indian Thriller’ అని ఒక వీడియో…అందులో మన చిరు బొమ్మ. ఏంటో చూద్దాం అని తెరిచా, చూస్తే, మన పాట. అలాగే క్రిందన రేటింగు, వ్యూస్, కామెంట్లు చూసేసరికి కళ్ళు తిరిగాయి. ఒక తెలుగు వీడియోకి పద్దెనిమిది వేల వ్యాఖ్యలా……………………….వామ్మో. ఖచితంగా 80% విదేశీయులవే అయ్యుంటాయి.

వ్యాఖ్యల్లో మాత్రం పాటను యేకేశారు..చండాలమైన కాపీ, భయంకరం అంటూ ఇష్టమొచ్చినట్టూ కామెంటేశారు. మచ్చుకు కొన్ని కామెంట్లు చూడండి:

 1. That’s the funniest thing I’ve ever seen
 2. this is not even close to MJ’s work….and thrller is supposed to be scary you guys are making it look lame…
 3. thanks god i am not indian
 4. hahaha!!…why the woman scare??? the woman must laugh becuase the dance steps are very ridiculous and funny,, but i really enjoy the video..

పైన వ్రాశిన కామెంట్ల కంటే క్రిందన చూపించిన జాలి భయంకరంగా ఉంది:

 • I still think this whole music video is some kind of joke about western music. Cause, honestly? Who makes something this bad on purpose?

పాటను తిట్టారు కానీ, చిరు డ్యాన్సు చాలా మందికే నచ్చినట్టుంది:

 • I love how the pounding synth music starts and he begins the shoulder action. It’s so awesome. goli ma ma. i like it when he’s humping the air.. at 2:19

ఒకతనికి ఇది ఎంతగా నచ్చిందంటే…తన భాష కాకపోయినా సాహిత్యాన్ని వ్రాయడానికి ప్రయత్నించాడు:
Goli maaaaaaar… goli maar!
Goli mar-mar-mar-mar-mar-mar-(mar).
Goli mar-mar-mar-mar-mar-(mar)…..
Kashno rau kaugileste yenche staavooo…
Ne pali manta meste yee maltovooo…..
Kandaru padda kane shungaa.. raamaaaa…
Valkunga guda yesta vaya raamaaa…
Goli maar!
Goli.. mar-mar-mar-mar-(mar)….
Rrrrrgrrryyaaaaayaaaaa!

చూసిన చాలా మందికి, ఇంత సిల్లీ వీడియోకి ఇన్ని హిట్లు, వ్యాఖ్యలు ఎందుకో అర్థం కాక అయోమయానికి గురయ్యారు:

 • i cant help but wonder ..why so many views?! i have lost brain cells…ahahaha

ఇక్కడా తమిళ వాసనే :(

 • this is in tamil not hindi

వ్యాఖ్య వ్రాసిన జనాల్లో సగం మంది, కేరళ భామ రాధ అందానికి ఫ్లాటయిపోయారు. ఈ విషయంలో మాత్రం అందరిదీ ఏకాభిప్రాయం :)

 • HEY INDIAN MICHAEL JACKSON! You’re girlfriend is a bumblebee…

ఇంకోడు పాటలు వ్రాయడంతో సరిపెట్టుకోకుండా ఏకంగా, పాటను ఆంగ్లంలో అనువదించే ప్రయత్నం చేశాడు :) దీనికి ఇరవై లక్షల పైన హిట్లు…పది లక్షల తిట్లు ;)


——————–
నా నార్వే స్నేహితుడు ఓ మాటన్నాడు. ఎందుకు మీ పాటల్లో విదేశీ ట్యూన్లు కాపీ కొడతరు, అనుకరించడానికి ప్రయత్నిస్తారు, మీకంటూ సొంత సంగీతం, శైలి లేదా అని. మీకంటూ సొంతంగా కళను ప్రదర్శించకపోతే ప్రపంచం మీ వైపు తిరిగి కూడా చూడదు అని.

ప్రకటనలు

13 thoughts on “యూట్యూబ్లో దుమ్ము రేపుతున్న చిరంజీవి వీడియోలు :)

 1. కామెడీగా ఉంది గదాని చదువుకుంటూ వస్తే.. ఆ చిట్టచివరి పేరాలో భలే దెబ్బ కొట్టారు గదా!

  ఆ వీడియో చూసి మీ స్నేహితుడు – మనం ఒక సంస్కృతీ, సంగీతము, కళా లేని, అణా కానీకి నోచని ముష్టి వెధవలం అనుకుని ఉంటాడు. అందుకే..

  “ఏమయ్యా ఆ చింపిరి గుడ్డలేసుకుని, ఇలా అడుక్కునీ, దొంగతనం చేసీ తినకపోతే.. కాస్త కాయకష్టం చేసుకుని సంపాదించుకు బతకొచ్చు గదా” అన్నట్టు చీవాట్లు పెట్టాడు. మనం ముష్టి వెధవలం కామనీ, తరాలతరబడి తిన్నా తరగని ఆస్తి మనకుందనీ చెబితే మన మొహాన ఉమ్మేసినా వెయ్యగలరు. చవట దద్దమ్మల్లారా అని గౌరవించే అవకాశమూ లేకపోలేదు.

 2. అబ్బో దీనికి పెద్ద చరిత్రే ఉంది. నా అనుమానం గ్రహాంతర వాసుల్లో కూడా ఈ పాట మీద చర్చలు జరిగుంటాయి. నా అనుమానం మైఖేల్ జాక్సన్ పతనం ఇది చూశాకే మొదలయ్యుటుంది.

 3. ఇది చదివిన తరవాత మా కంపెనీ లొ ఈ మధ్య జరిగింది గుర్తొచ్చింది… మాకు సాంకృతిక భిన్నత్వం అనే అంశం మీద ఒక ప్రదర్శన ఏర్పాటు చేసారు.. అన్ని రాష్ట్రాల నుండి ఉద్యోగులు వాళ్ళ సాంప్రదాయ సిద్ధమైన దుస్తులు ధరించుకుని ప్రదర్శించారు… మన రాష్ట్రానికి చెందిన వాడు ఒక్కడే పాల్గున్నాడు… వాడి వేషం చూసి ఇదా మన సాంప్రదాయం, సంస్కృతి అని నేను ముక్కు మీద వేలేసుకున్నాను… వాడు చిరంజీవి అభిమానంట… ముఠా మేస్త్రి సినెమలొ లాగా లాగు కనపడెలా లుంగి పైకెత్తి కట్టుకుని స్టేజ్ మీద చక్కెర్లు కొట్టాడు!! అది చూసిన బయట రాష్ట్రాల వాళ్ళు ఏమనుకున్నారో?!! సినెమ ఎంత పని చేస్తుంది?!!

 4. ఇదంతా చదువుతూవుంటే పిచ్చ నవ్వొచ్చింది. ముఖ్యంగా ఆ పాట సాహిత్యాన్ని రాయడానికి ప్రయత్నించడం భలేవుంది. ఈ పాటకు సంబంధించినంతవరకూ సొంత శైలీ, సొంత సంగీతం లాంటి సీరియస్ మాటలు అనవసరమనుకుంటా. ఎందుకంటే ఇదేమీ మన సంస్కృతిని విదేశీయులకు పరిచయం చెయ్యడం కోసం కళాత్మక దృష్టితో చేసిన పని కాదు, కేవలం వ్యాపారదృష్టితో ఆంధ్ర ప్రేక్షకుల మెప్పుకోసం చేసిన పని కనుక. కాపీచేశారని ఆ కాలంలో తెలుగువాళ్లకు తెలీదు కదా, తెలిసినా .. హూ కేర్స్? పాటలో చిరు, రాధ కనిపిస్తే చాలు. :)

 5. Chala funnyga :) and bhadhaga :( vundi motham page chadivaka. Me Norwegian friend annadi nejame andi Hollywood movies chusay telugu vallandareke telusu mana Darshaka Nermathalu enthaga vallani copy koduthunnaro. chevarega okkamata …… enka Veena pata steps chuste entha gundelu chilchukuntaro …..ha ha ha …. namatuku adi oka dance Ey kadu

 6. helo…
  meerantha annadi correcto kado naku theliyadu kani
  okkati matram nizam …enduku panikiradu antunee intha mandi charchinchu kontunnaru kada ……… apude ardham kala indirectga ..mee matallo thanu entha edigi paoyado ani….that is …ayina ila chesina varini thittadam kanna mundu manam ento thelusukovali asalu aa arhatha unda ? leda? ani
  neeku nachaka pothe….nuvvu chesi chupu chuddam

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s