నిన్నలు పెరిగిపోతున్నాయ్…రేపులు తరిగిపోతున్నాయ్

Time
చూస్తూ చూస్తూనే చిత్రం జరిగిందే…ఏమో ఏమైందో ఏమీ అర్థం కాకుందే...
ఈ పాటలాగే ఉంది నా పరిస్థితి. ఇంతకూ చిత్రమైన ఆ విచిత్రం ఏమిటంటారా!! 2010 సంవత్సరం వెళ్ళిపోతోంది. వచ్చి నాలుగురోజులు కూడా కాకుండానే “టాటా…వీడుకోలు..గుడ్‌బై..ఇంక సెలవు” అని తన నెలవుకు వెళ్ళిపోతోంది. అమ్మమ్మా… 2010 సంవత్సరమా దయచేసి అప్పుడే వెళ్ళిపోకే… దయచేసి ఇంకా కొన్ని రోజులు ఉండవే. ఇంకా చదవాల్సిన పుస్తకాలు, చూడాల్సిన ప్రదేశాలు, కలవాల్సిన మనుష్యులు, చేయాల్సిన పనులు అలా మిగిలిపోయాయ్. అవన్నీతీరకుండానే నిర్దయగా వెళ్ళిపోతావా? పోపోవోయ్…2011 వస్తుందిగా, అప్పుడు చేసుకో ఆ పనులన్నీ అంటావా? మరి 2011లో చెయ్యల్సిన పనులో? రోజూ డైరీ రాసేవాడిని, నువ్వు వచ్చినప్పట్నుంచి డైరీ రాయలేదని కోపమా? ఎంత బ్రతిమలాడి ఏమి లాభం వెళ్ళేదానివి మళ్ళీ నిన్ను చూడలేము కదా.

చిన్నప్పుడు సంవత్సరమంటే… సంంంంంంంంంంంంవత్సరంలా ఉండేది. ఇప్పుడంటే కొంచెం ఏమారితే చాలు, సంవత్సరాలు, నెలలూ తిరగబడిపోతున్నాయ్. మొన్ననే మన ముందే ఏడుస్తూ పుట్టిన పిల్లల్ని నేడు పలకరిస్తే “ఇంజనీరింగ్ చదువుతున్నాను అంకుల్” అని అంటున్నారు…తేడా ఎక్కడుంది? భూమేమైనా సూర్యుడి చుట్టూ తిరిగే వేగం హెచ్చించిందా? మనమే మంచు భల్లూకాల్లా ఆరునెలలు మనకు తెలియకుండానే హైబర్నెషన్‌లోకి వెళ్ళిపోతున్నామా? లేదా తేడా మన వయస్సు ..భాధ్యతలలో ఉందా .. ఏం జరుగుతోంది…..నాకు తెలియాలి. Y2K సమస్య పోయిన సంవత్సరంలో వచ్చినట్లు ఉంది… చూస్తే దశాబ్దం గడిచిపోయింది. మొత్తానికి జీవితం 8x వేగంతో ఫాస్ట్ పార్వర్డ్‌లో చూస్తూన్న సినిమాలా జరిగిపోతోంది. దీని గురించి చించంగా చించంగా నా బుఱ్ఱకు కొన్ని కారణాలు కనిపించాయి.
౧. ఒంటరి సంసారాలు
౨. షేక్ గుడారంలోకి చొచ్చుకొచ్చేసిన ఒంటెలా, మన సమయాన్ని తద్వారా జీవితాన్ని మింగేస్తున్న టీవీలు
౩. సినిమాలు
౪. పెరిగిన ఆశ, స్వార్థం.

వీటన్నిటికీ మించి జీవితానికొక లక్ష్యం లేకపోవడమే, ఈ అసంతృప్తికి కారణం అనుకొంటా. రోజూ మన లక్ష్యం కొరకు పాటుపడుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటే, సమయం ఎంత వేగంగా గడచినా దానికి మనం చింతించడం అన్నది ఉండదు.

చివరగా అందరికీ నా “నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు“. మీరు కోరుకొన్న కోరికలన్నింటినీ దేవుడు ఠపీ ఠపీ మని తీర్చెయ్యాలని ప్రార్థిస్థాను.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s