కత్తులతో సావాసం … నెత్తుటితో సమాప్తం

Bloody_Violenceఈ పాటికి అందరికీ ఈ వార్త తెలిసే ఉంటుంది. సంచలన వార్తలకోసం నిత్యం తపించే మీడియాలో ఈ పాటికి సెకండుకో స్క్రోలింగ్…నిమిషానికో న్యూసు వేస్తూంటారు, మద్దెలచెరువు సూరి మీద కాల్పులు జరిగాయని. అసలు ఈ సూరి గమ్మునే జైలులో ఉండాల్సింది, ఇంకా ప్రాణాలతో మిగిలే వాడు. జైల్లో నుంచి బెయిలు సాయంతో బయటకొచ్చినా, మీడియాకు దూరంగా ఉండాల్సింది. మీడియాతో మాట కలిపినా, కేసులన్నీ పూర్తైన తరువాత రాజకీయాలలోకి వాస్తానని అనకుండా ఉండాల్సింది. ఎన్ననుకొని ఏమి లాభం కత్తి పట్టుకున్నోడు కత్తివేటుకే పోతాడాని, బాంబు పట్టుకున్నోడు బులెట్‌‌లు తగిలించుకోవాల్సివచ్చింది. రవి మరణం తరువాత అతని కోసం పని చేసిన యాక్షన్ టీములన్నీ నిద్రాణంలోకి జారుకున్నాయని, సూరీని జగన్‌ను వేసేసే అదను కోసం చూస్తున్నారని విన్నాను. సూరి బావ కళ్ళలో ఆనందం కోసం ఒకడు రవిని చంపితే, రవి ఆత్మశాంతి కోసం ఈ సూరన్నను ఎవడో వేసేద్దాం అనుకొని ఉంటాడు. మొదటేమో బావ కళ్ళలో ఆనందం చూడటం కోసం తపించి, మొద్దుశీను తలపగిలి చచ్చాడు. కనీసం బావ కళ్ళలో ఆనందం మిగిలిందా అంటే, అదీ లేదు. మరి వొట్టి పుణ్యానికి రవిని చంపిందెందుకు, వీళ్ళు చచ్చిందెందుకు. చచ్చి ఏమి సాధిస్తున్నారో, వీళ్ళు నిత్యం పగతో రగిలి బ్రతికున్నప్పుడు కూడా సాధించిందదే. ఒక సినిమా స్టోరీని తయారు చెయ్యడానికి స్పూర్తినివ్వడం తప్ప వీళ్ళు చంపి, చచ్చి సాధించిందేమీ లేదు. ఈ సందర్బంగా నాకు రక్తచరిత్రలోని ఈ పాట గుర్తుకు వస్తోంది:

కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం
కక్షల ఈ సమరం కాటికిరా పయనం
ఈ ముళ్ళ దారుల్లో అడుగేసినా
మిగిలేది శూన్యం నిజం #కత్తులతో#

విలువైన బతుకు వెల లేనిదైతే
మరణాన్ని పూజించరా
పుడుతూనే ఎవడూ పగ వాడు కాదు
పోయినోడు కూడా రా
ఈ నడుమున నువ్వు విధి ఆట లోన
పావు అయితే ఓడేవురా #కత్తులతో#

పగ అన్నదెపుడు ఏమిచ్చె నేస్తం
నష్టాన్నే మిగిలించు రా
క్షణ కాలమైన మనశ్శాంతి లేని
బతుకెంత బరువవునురా
బతికేందుకే ఈ బతుకుందని
చచ్చాకా తెలిసేమి రా #కత్తులతో#

బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
బుద్ధం శరణం గచ్చామి

ప్రకటనలు

3 వ్యాఖ్యలు

  1. పోవాలండీ…నరుక్కుని పోవాలి…బాధపడకండి…..పోయినోళ్లు అంతా మంచోళ్లని శిలా విగ్రహాలు వెలయించే గొర్రెలు మన జనాభా! ఆ పోయినోడు ఎట్టాంటోడైనా సరే…..

    మీకు వీలైతే మంగళహారతులు పట్టి, పూలదండలు దిగెయ్యండి….ఎప్పుడెళ్తున్నారో చెబుతే నేనూ వస్తా మీతో! :)

    అయినా ఒక దరిద్రం పోతేనేం, ఇంకో దరిద్రం పుట్టుకొస్తుందిగా? వెయ్యితలల రాకాసికి పదితలలు పోతే లెఖ్ఖా…ఈ మీడియా ముచ్చులకు ఈలాటి దిక్కుమాలిన హత్యా వార్తలు ఫ్రంటు పేజీలో హెడ్డులైన్లు! పనిలో పనిగా ఈ మీడియా కోతిమూకను కూడా ఎవడన్నా ఏసేస్తే బాగుండు…

  2. >>దిక్కుమాలిన హత్యా వార్తలు ఫ్రంటు పేజీలో హెడ్డులైన్లు
    ఇదే అనుమానం నాకూ వచ్చిందండి. రోజూ ఎన్నో హత్యలు జరుగుతుండగా, సూరి హత్యనే మొదటి పేజీలో అచ్చేశారేమా అని. ఇతను కనీసం ఏ పంచాయితీలో కూడా సభ్యుడు కాడు. నాకు అర్థం అయ్యిందేమంటే… మీడియా ఉద్దేశాలు కాలానుగుణంగా మార్పు చెంది, ఏది ఎక్కువ entertain చేస్తే దానికే ప్రధాన్యం ఇస్తారనిపిస్తుంది.

  3. This website was… how do you say it? Relevant!n! Finally I have found something that helped me. Thank you! Click http://d2.ae/hool090715

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: