కత్తులతో సావాసం … నెత్తుటితో సమాప్తం

Bloody_Violenceఈ పాటికి అందరికీ ఈ వార్త తెలిసే ఉంటుంది. సంచలన వార్తలకోసం నిత్యం తపించే మీడియాలో ఈ పాటికి సెకండుకో స్క్రోలింగ్…నిమిషానికో న్యూసు వేస్తూంటారు, మద్దెలచెరువు సూరి మీద కాల్పులు జరిగాయని. అసలు ఈ సూరి గమ్మునే జైలులో ఉండాల్సింది, ఇంకా ప్రాణాలతో మిగిలే వాడు. జైల్లో నుంచి బెయిలు సాయంతో బయటకొచ్చినా, మీడియాకు దూరంగా ఉండాల్సింది. మీడియాతో మాట కలిపినా, కేసులన్నీ పూర్తైన తరువాత రాజకీయాలలోకి వాస్తానని అనకుండా ఉండాల్సింది. ఎన్ననుకొని ఏమి లాభం కత్తి పట్టుకున్నోడు కత్తివేటుకే పోతాడాని, బాంబు పట్టుకున్నోడు బులెట్‌‌లు తగిలించుకోవాల్సివచ్చింది. రవి మరణం తరువాత అతని కోసం పని చేసిన యాక్షన్ టీములన్నీ నిద్రాణంలోకి జారుకున్నాయని, సూరీని జగన్‌ను వేసేసే అదను కోసం చూస్తున్నారని విన్నాను. సూరి బావ కళ్ళలో ఆనందం కోసం ఒకడు రవిని చంపితే, రవి ఆత్మశాంతి కోసం ఈ సూరన్నను ఎవడో వేసేద్దాం అనుకొని ఉంటాడు. మొదటేమో బావ కళ్ళలో ఆనందం చూడటం కోసం తపించి, మొద్దుశీను తలపగిలి చచ్చాడు. కనీసం బావ కళ్ళలో ఆనందం మిగిలిందా అంటే, అదీ లేదు. మరి వొట్టి పుణ్యానికి రవిని చంపిందెందుకు, వీళ్ళు చచ్చిందెందుకు. చచ్చి ఏమి సాధిస్తున్నారో, వీళ్ళు నిత్యం పగతో రగిలి బ్రతికున్నప్పుడు కూడా సాధించిందదే. ఒక సినిమా స్టోరీని తయారు చెయ్యడానికి స్పూర్తినివ్వడం తప్ప వీళ్ళు చంపి, చచ్చి సాధించిందేమీ లేదు. ఈ సందర్బంగా నాకు రక్తచరిత్రలోని ఈ పాట గుర్తుకు వస్తోంది:

కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం
కక్షల ఈ సమరం కాటికిరా పయనం
ఈ ముళ్ళ దారుల్లో అడుగేసినా
మిగిలేది శూన్యం నిజం #కత్తులతో#

విలువైన బతుకు వెల లేనిదైతే
మరణాన్ని పూజించరా
పుడుతూనే ఎవడూ పగ వాడు కాదు
పోయినోడు కూడా రా
ఈ నడుమున నువ్వు విధి ఆట లోన
పావు అయితే ఓడేవురా #కత్తులతో#

పగ అన్నదెపుడు ఏమిచ్చె నేస్తం
నష్టాన్నే మిగిలించు రా
క్షణ కాలమైన మనశ్శాంతి లేని
బతుకెంత బరువవునురా
బతికేందుకే ఈ బతుకుందని
చచ్చాకా తెలిసేమి రా #కత్తులతో#

బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
బుద్ధం శరణం గచ్చామి

ప్రకటనలు

నిన్నలు పెరిగిపోతున్నాయ్…రేపులు తరిగిపోతున్నాయ్

Time చదవడం కొనసాగించండి

Being Curious

http://deeps–blog.blogspot.com/2010/01/being-curious.html

భోజన విరామ సమయంలో మేము చర్చించుకొన్న విషయాలను వ్యాసంగా మార్చి వ్రాశాడు నా స్నేహితుడు. ఈ కాలంలో మన ఉద్యోగంలో రోజూ మనం ఎందుకు వత్తిడికి గురి అవుతున్నాము, అనే విషమై చర్చించాము…

చిత్రమైన జీవితం…

బాల్యం విలువ అది గడచిపోతే కానీ తెలియదు
యవ్వనం లో ఉన్న శక్తి అది ఉడిగిపోయేదాకా తెలియదు
సంసార జీవితంలో మన గురించి ఆలోచించే సమయం దొరకదు
జీవితం గురించి అర్థం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు…..

మేకప్పేసుకున్న వికీపెడియా

చాన్నాళ్ళకు వికీపెడియా చూస్తున్నా. మడ్డిగా ఉన్న మొదటి పేజీ కాస్తా మొహం కడుక్కొని చక్కగా ముస్తాబయ్యింది..మీరే చూడండి ఒక్క సారి: http://te.wikipedia.org/wiki/మొదటి_పేజీ

ఈ వర్గీకరణ కొత్తవారికి సులభంగా మార్గనిర్దేశనం చేస్తుందని అనిపిస్తోంది.

ఇలా వర్గీకరణ చేసి మొదటి పేజీ తయారు చేసిన ధీరులు, శూరులెవ్వరో నాకు వెంటనే తెలియాలి, ఎందుకంటే వెంటనే వారికి వీరతాళ్ళు వేసుకోవాలిగా మరి.  (వైజా సత్య..ఈ ఘనకార్యం తమరిదేనా?)

అన్న బ్లాగాడోచ్……

చిన్నప్పుడు రెండవ తరగతిలో ఉండంగా బడి వార్షికోత్సవానికి మా చేత కొన్ని పాటలు పాడించి, నాటకం వేయించాలనుకున్నారు. దాని కోసం నేను, ప్రసాదు, ప్రశాంతు, రెడ్డెప్ప, వెంకటేశ్వర రెడ్డి, సునిత, ఇంకొందరు ఐవోర్లు, మిద్దె పైకి వెళ్ళి సాధన చేస్తున్నాము. ఇంతలో ఎందుకో మిద్దె పైన నుంచి క్రిందకు చూచాను. మా అమ్మ నాన్న కలసి బడి లోపలికి వస్తున్నారు. ఇద్దరినీ బడిలో చూడటం అదే మొదటి సారి. ఆనందమో..ఆశ్చర్యమో….వెంటనే కళ్లలో నుంచి నీళ్ళు వచ్చేశాయి. పది నిముషాలు అలాగే ఎడ్చాను. బహుశా అది తట్టుకోలేని ఆనందం వలన కావచ్చు.

ఇన్నాళ్లకు మళ్ళీ అటువంటి రోజు వచ్చింది. నాకు భలే సంతోషంగా ఉంది ఈ రోజు. వందకు పైన టపాలు, వందల వ్యాఖ్యలు , వికీలో వేల వ్యాసాలు వ్రాసి / దిద్దిన తరువాత….మొట్టమొదటి సారిగా అన్న దగ్గర్నుంచి అపురూపంగా ఒక్క వ్యాఖ్య వచ్చింది. ఆనందమో..ఆశ్చర్యమో…..వెంటనే కళ్లలో నుంచి నీళ్ళు తేలాయి. బహుశా అది తట్టుకోలేని ఆనందం వలన కావచ్చు.

ఎప్పుడూ ఇంగ్లీషులో వ్రాసే అన్న తెలుగులో వ్రాయటం భలే ముచ్చటగా ఉంది. రెడ్ కార్పెట్ లేక పోయినా చెప్పేస్తున్నా “సోదరా…….బ్లాగ్లోకానికి స్వాగతం సుస్వాగతం“. ఈ రోజైతే పండగ జరుపుకోవలసిందే :)

_________________________________________________________________
50% తాజాదనం ( ఏమిటిది? )

వేమన స్త్రీ ద్వేషి కాదు

ఆశ్చర్యం..ఇప్పుడే వేమన మీద ఒక వ్యాసం వ్రాస్తున్నాను. అనుకోకుండా తెలుగుపీపుల్ లో ఈ వ్యాసం తగిలింది. అందుకే ఆలస్యం చెయ్యకుండా బ్లాగేస్తున్నా.

http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=62493&page=1

మాటలను కొరడా చేసి కొట్టడమంటే ఏమిటో వేమన పద్యాలను చదివితే అర్థమయ్యింది. కులం, మతం, ఆచారాలు, పురుషులు, స్త్రీలు, యోగులు, మూఢులు, దుర్జనులు ఇలా ఒకటేమిటి …అన్నింటినీ ఏకిపారేశాడు.

_________________________________________________________________
35% తాజాదనం ( ఏమిటిది? )