మరో ప్రపంచం కోసం…

(మొదటి ప్రచురణ పొద్దులో)

పరిగెడుతున్నాను…..

కష్టాల కొండలు ఎక్కుతూ
నిరాశా నదులు దాటుతూ
చిమ్మ చీకటికి దూరంగా
వెలుతురు కోసం ఆశగా
పరిగెడుతున్నాను……

ఆవేదనతో కొట్టుకుంటున్న గుండెతోనూ
అలసిపోయి రొప్పుతున్న రొమ్ములతోనూ
చెంపల దాహాన్ని తీరుస్తున్న కన్నీళ్ళతోనూ
ఎగిసిపడుతున్న బాధను అదిమి పెట్టి
దహిస్తున్న ఆలోచనల్ని తొక్కిపట్టి
ఇంకా కనిపించని గమ్యం కోసం
పరిగెడుతున్నాను……

ఎక్కడా ఆగక
ముళ్ళను లెక్క చెయ్యక
పువ్వుల కోసం ఆశపడక
ఎవరు పిలచినా పలకక
వెనకకు తిరిగి చూడక
పరిగెడుతున్నాను……

తిరిగితే కోరికలు దయ్యాల్లాగా పిలుస్తాయ్
వికార ఆకారాలన్ని ప్రియంగా కనిపిస్తాయ్
విచక్షణ నన్ను వదిలి దూరంగా పారిపోతుంది
మాయ మైకంలా నేనున్నానంటూ ఆవహిస్తుంది

తప్పు తియ్యగా …నిజం చేదుగా
రుచిస్తుంది
నిజాలకు దూరంగా …కలలకు దగ్గరగా
జరగాలనిపిస్తుంది
శరీరం నిజం …ఆత్మ చాదస్తం
అనిపిస్తుంది
దు:ఖం సుఖంగా… ఆనందం భ్రమగా
ఉంటుంది

అందుకే …
ఆనందంతో పొంగే గుండెల కోసం
సు:ఖం పండిన మనస్సుల కోసం
పవిత్రత నిండిన ప్రపంచం కోసం
ప్రేమ విరిసిన ఆత్మల కోసం
మరో ప్రపంచం అందుకొనేందుకు
పరిగెడుతూనే ఉన్నాను….

ప్రకటనలు

ఒక్కరైనా…

మూడు పడితే … రెండు కలుస్తాయనుకున్నారు …
రెండు కలిసి … నాలుగు అవుతుందనుకున్నారు …
నాలుగు కలసి … నూరేళ్ళని అనుకున్నారు …
అసలైతే దీన్ని భ్రమంటారు …

మానవుల సృష్టిలో ఎందుకీ వైరుధ్యము?

ఓ రాజా! మీ మనస్సును ఆలోచనా మేఘాలు కమ్ముకుని ఉన్నాయని అనిపించుచున్నది…….

నిజమే మంత్రీ…మనవుడు కడు విచిత్రమైన జీవి. విశ్వంలోని సంక్లిష్టతనంతా మనస్సులో నింపుకొని ఉన్నాడు. ఒకరు ఉన్నటుల మరొకరు ఉండజాలరు కదా. ఇన్ని మాటలు యేల, ఒక తల్లి కడుపున పుట్టిన సంతానం పరస్పరం వ్యతిరేక భావాలు కలిగి ఉండుట చూచుచున్నాము. హ్హా…..మా మనస్సు ఏన్నో వేల ఆలోచనలతో కల్లోలము అగుచున్నది. మానవుల సృష్టిలో ఎందుకీ వైరుధ్యము?
రాజా..ఈ వైరుధ్యమునకు కారణము సంస్కారము.

మనుజులకు ఈ సంస్కారములు ఎలా కలుగుచున్నవి?

చేసిన కృతములు మనస్సుపై ముద్ర వేయుట చేత.

మనుజులు వివిధ కృతములకు ఎలా పూనుకొనుచున్నారు?

ఎవరి ఆలోచనా దృక్పథాలు వారికి ఉండుట చేత.

భిన్న దృక్పథాలు ఏలా ఏర్పడుచున్నవి?
ఎవరి స్మృతి వారికి ఉండుట చేత.

స్మృతులు ఎందుకు కలుగును
చేసిన కర్మల ఫలితములు కదా మళ్ళీ మళ్ళీ స్మృతుగా వచ్చునవి.

ఆహా…లెస్స పలికితిరి మంత్రి…మరి మన కర్మలు పరిశుద్దమైనచో మన స్మృతి, దృష్టి, వృతి, కృతి తద్వారా మన సంస్కారములు కూడా పరుశుద్దమగును.

———-౦౦౦౦::~O~::౦౦౦౦————

మరికొన్ని తవికలు:

అ అంటే ………

అ అంటే అశాంతి అని
ఆ అంటే ఆవేశం అని
ఈ అంటే ఈర్ష్య అని
అక్షరాభ్యాసం చేశాను

ఎంత చింతించి ఏమి లాభం
అ అంటే అందమని
ఆ అంటే ఆనందమని
ఈ అంటే ఈశుడని
దిద్దుకునే లోపే ఆలస్యమైపోయింది
చెరిపి మళ్ళీ వ్రాయటాని ఇది పలక కాదు
ఇది ……………. జీవితం

———-౦౦౦౦::~O~::౦౦౦౦————

మరికొన్ని తవికలు:

అప్పుడు ఆహా…ఇప్పుడు అబ్బా

అప్పుడు కళ…ఇప్పుడు వ్యాపారం
అప్పుడు కథ…ఇప్పుడు వ్యధ

అప్పుడు నటులు..ఇప్పుడు స్టార్లు
అప్పుడు ప్రేక్షకులు…ఇప్పుడు ‘అభిమానులు’

అప్పుడదో తపస్సు…ఇప్పుడిదో గారడీ
అప్పుడు తీపిగుర్తులు…ఇప్పుడు తలనొప్పులు

అప్పుడు సంతృప్తి…ఇప్పుడు లాభం
అప్పుడు నాటకరంగం…ఇప్పుడు వారసత్వం

అప్పుడు లంగాఓణీలు … ఇప్పుడు చెడ్డీబనీన్లు
అప్పుడు డ్రామా…ఇప్పుడు కోమా

(మనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వచ్చే తెలుగు సినిమాల మీద రాకేశ్వరా వ్రాసిన విమర్శనాత్మకమైన వ్యాసం చదివి పొంగిన భావజాలాన్ని పదాల రూపంలో ఇలా పేర్చాను.)

పడిపోయాను….

శరీరాన్ని తొడుక్కోవటానికి భూమి మీదకొచ్చాను
సంస్కారము వదిలేసి పాతాళానికొచ్చి పడ్దాను

( కొన్నాళ్ళు తవికల పేరిట నేను జరిపే హింసాకాండను పాఠకులు భరించాలి :) )

ప్రేమ కోసం శోధన

చిత్రమైన దేవుడు….మనకు

రెండు కళ్ళు

రెండు కాళ్ళు

రెండు చేతులు

రెండు చెవులు

ఇచ్చి ..గుండెను మాత్రం

తోడు వెతుక్కోమంటూ ఒంటరిని చేసేశాడు

(నా స్నేహితుడు వాడికి వచ్చున మెయిల్లో…మీ రెండో గుండెనెవరికిస్తారు (ఆంగ్లంలో) ..అని ఉంటే…అది సబబుగా లేదని…నా మనస్సుకు తోచింది వ్రాసేశా)

———-౦౦౦౦::~O~::౦౦౦౦————

నేను వ్రాసిన మరికొన్ని తవికలు: