కత్తులతో సావాసం … నెత్తుటితో సమాప్తం

Bloody_Violenceఈ పాటికి అందరికీ ఈ వార్త తెలిసే ఉంటుంది. సంచలన వార్తలకోసం నిత్యం తపించే మీడియాలో ఈ పాటికి సెకండుకో స్క్రోలింగ్…నిమిషానికో న్యూసు వేస్తూంటారు, మద్దెలచెరువు సూరి మీద కాల్పులు జరిగాయని. అసలు ఈ సూరి గమ్మునే జైలులో ఉండాల్సింది, ఇంకా ప్రాణాలతో మిగిలే వాడు. జైల్లో నుంచి బెయిలు సాయంతో బయటకొచ్చినా, మీడియాకు దూరంగా ఉండాల్సింది. మీడియాతో మాట కలిపినా, కేసులన్నీ పూర్తైన తరువాత రాజకీయాలలోకి వాస్తానని అనకుండా ఉండాల్సింది. ఎన్ననుకొని ఏమి లాభం కత్తి పట్టుకున్నోడు కత్తివేటుకే పోతాడాని, బాంబు పట్టుకున్నోడు బులెట్‌‌లు తగిలించుకోవాల్సివచ్చింది. రవి మరణం తరువాత అతని కోసం పని చేసిన యాక్షన్ టీములన్నీ నిద్రాణంలోకి జారుకున్నాయని, సూరీని జగన్‌ను వేసేసే అదను కోసం చూస్తున్నారని విన్నాను. సూరి బావ కళ్ళలో ఆనందం కోసం ఒకడు రవిని చంపితే, రవి ఆత్మశాంతి కోసం ఈ సూరన్నను ఎవడో వేసేద్దాం అనుకొని ఉంటాడు. మొదటేమో బావ కళ్ళలో ఆనందం చూడటం కోసం తపించి, మొద్దుశీను తలపగిలి చచ్చాడు. కనీసం బావ కళ్ళలో ఆనందం మిగిలిందా అంటే, అదీ లేదు. మరి వొట్టి పుణ్యానికి రవిని చంపిందెందుకు, వీళ్ళు చచ్చిందెందుకు. చచ్చి ఏమి సాధిస్తున్నారో, వీళ్ళు నిత్యం పగతో రగిలి బ్రతికున్నప్పుడు కూడా సాధించిందదే. ఒక సినిమా స్టోరీని తయారు చెయ్యడానికి స్పూర్తినివ్వడం తప్ప వీళ్ళు చంపి, చచ్చి సాధించిందేమీ లేదు. ఈ సందర్బంగా నాకు రక్తచరిత్రలోని ఈ పాట గుర్తుకు వస్తోంది:

కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం
కక్షల ఈ సమరం కాటికిరా పయనం
ఈ ముళ్ళ దారుల్లో అడుగేసినా
మిగిలేది శూన్యం నిజం #కత్తులతో#

విలువైన బతుకు వెల లేనిదైతే
మరణాన్ని పూజించరా
పుడుతూనే ఎవడూ పగ వాడు కాదు
పోయినోడు కూడా రా
ఈ నడుమున నువ్వు విధి ఆట లోన
పావు అయితే ఓడేవురా #కత్తులతో#

పగ అన్నదెపుడు ఏమిచ్చె నేస్తం
నష్టాన్నే మిగిలించు రా
క్షణ కాలమైన మనశ్శాంతి లేని
బతుకెంత బరువవునురా
బతికేందుకే ఈ బతుకుందని
చచ్చాకా తెలిసేమి రా #కత్తులతో#

బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
బుద్ధం శరణం గచ్చామి

నిన్నలు పెరిగిపోతున్నాయ్…రేపులు తరిగిపోతున్నాయ్

Time ఇంకా చదవండి »

Being Curious

http://deeps–blog.blogspot.com/2010/01/being-curious.html

భోజన విరామ సమయంలో మేము చర్చించుకొన్న విషయాలను వ్యాసంగా మార్చి వ్రాశాడు నా స్నేహితుడు. ఈ కాలంలో మన ఉద్యోగంలో రోజూ మనం ఎందుకు వత్తిడికి గురి అవుతున్నాము, అనే విషమై చర్చించాము…

మరో ప్రపంచం కోసం…

(మొదటి ప్రచురణ పొద్దులో)

పరిగెడుతున్నాను…..

కష్టాల కొండలు ఎక్కుతూ
నిరాశా నదులు దాటుతూ
చిమ్మ చీకటికి దూరంగా
వెలుతురు కోసం ఆశగా
పరిగెడుతున్నాను……

ఆవేదనతో కొట్టుకుంటున్న గుండెతోనూ
అలసిపోయి రొప్పుతున్న రొమ్ములతోనూ
చెంపల దాహాన్ని తీరుస్తున్న కన్నీళ్ళతోనూ
ఎగిసిపడుతున్న బాధను అదిమి పెట్టి
దహిస్తున్న ఆలోచనల్ని తొక్కిపట్టి
ఇంకా కనిపించని గమ్యం కోసం
పరిగెడుతున్నాను……

ఎక్కడా ఆగక
ముళ్ళను లెక్క చెయ్యక
పువ్వుల కోసం ఆశపడక
ఎవరు పిలచినా పలకక
వెనకకు తిరిగి చూడక
పరిగెడుతున్నాను……

తిరిగితే కోరికలు దయ్యాల్లాగా పిలుస్తాయ్
వికార ఆకారాలన్ని ప్రియంగా కనిపిస్తాయ్
విచక్షణ నన్ను వదిలి దూరంగా పారిపోతుంది
మాయ మైకంలా నేనున్నానంటూ ఆవహిస్తుంది

తప్పు తియ్యగా …నిజం చేదుగా
రుచిస్తుంది
నిజాలకు దూరంగా …కలలకు దగ్గరగా
జరగాలనిపిస్తుంది
శరీరం నిజం …ఆత్మ చాదస్తం
అనిపిస్తుంది
దు:ఖం సుఖంగా… ఆనందం భ్రమగా
ఉంటుంది

అందుకే …
ఆనందంతో పొంగే గుండెల కోసం
సు:ఖం పండిన మనస్సుల కోసం
పవిత్రత నిండిన ప్రపంచం కోసం
ప్రేమ విరిసిన ఆత్మల కోసం
మరో ప్రపంచం అందుకొనేందుకు
పరిగెడుతూనే ఉన్నాను….

Follow

Get every new post delivered to your Inbox.